శ్రీదివ్య

భారతీయ నటి

శ్రీదివ్య భారతీయ సినిమా, టెలివిజన్ నటి. బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.

శ్రీదివ్య
Sri Divya.jpeg
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
బంధువులుశ్రీరమ్య

జననంసవరించు

శ్రీదివ్య హైదరాబాద్‌ లో జన్మించింది. ఈవిడ అక్క శ్రీరమ్య తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. శ్రీదివ్య కేంద్రియ విద్యాలయంలో చదివింది.

సినీజీవితంసవరించు

శ్రీదివ్య మూడేళ్ళ వయసు నుండే నటించడం ప్రారంభించింది. మొదట్లో తెలుగు టి.వి. సీరియల్స్ లో నటించింది.

2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాలో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. అటుతరువాత 2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్టాప్ సినిమాలో నటించింది. అది విజయం సాధించింది. మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు సినిమాలో నటించింది. హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేసింది.

చిత్రసమహారంసవరించు

Key
  నిర్మాణ దశలో ఉంది
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2000 హనుమాన్ జంక్షన్ శ్రీదివ్య తెలుగు బాలనటి
2000 యువరాజు కల్పన తెలుగు బాలనటి
2003 వీడే శ్రీవిద్య తెలుగు బాలనటి
2010 మనసారా అంజలి తెలుగు
2012 బస్ స్టాప్ శైలజ తెలుగు
2013 మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు లక్ష్మీ తెలుగు
2013 వరుత్తపడాద వాలిబర్ సంఘం లతా పండి తమిళం ఉత్తమ నటి, 3వ సైమా అవార్డు
2014 జీవా జెన్ని తమిళం
2014 వెల్లైకార దురై యమున తమిళం
2015 కాకి సట్టై దివ్య తమిళం
2015 వారధి[1] ఆరాధన తెలుగు
2015 కేరింత[2] మనస్విని తెలుగు
2015 సైజ్ జీరో (ఇంజి ఇడుపళగి) శ్రీదివ్య తెలుగు, తమిళం అతిథి పాత్రలో
2015 ఈట్టి గాయత్రి వేణుగోపాల్ తమిళం
2016 బెంగళూరు నాట్కల్ దివ్య రాఘవన్ తమిళం
2016 పెన్సిల్ మాయ తమిళం
2016 మరుదు[3] భాగ్యలక్ష్మీ తెలుగు తెలుగులో రాయుడు గా అనువాదమైంది
2016 రెమో దివ్య తమిళం అతిథి పాత్రలో
2016 కాష్మోరా యామిని తమిళం
2016 మావీరన్ కిట్టు గొమథి తమిళం
2017 సంగిలి బంగిలి కాదవ తోరే స్వేత తమిళం
2018 ఒత్తైకు ఒత్త తమిళం నిర్మాణ దశలో ఉంది

మూలాలుసవరించు

  1. సినీ విషేస్. "విడుదలకు సిద్ధమవుతున్న శ్రీదివ్య వారధి". http://www.cinewishesh.com/. Retrieved 12 September 2016. {{cite web}}: External link in |website= (help)[permanent dead link]
  2. "Kerintha: Coming-of-age stories".
  3. 10 టి.వి (May 3, 2016). "నేడు 'విశాల్' 'రాయుడు' టీజర్ విడుదల." Archived from the original on 18 సెప్టెంబర్ 2018. Retrieved 12 September 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)