జమ్మలమడక మాధవరామశర్మ

జమ్మలమడక మాధవరామశర్మ తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యాణం జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.[1]

జనన మరణ వివరాలుసవరించు

జనన మరణ వివరాలుα
జననం: 1907/04/13
మరణం: 1988/07/13

జీవిత విశేషాలుసవరించు

ఆయన తెనాలి కి చెందినవారు. 15 అలంకార శాస్త్ర గ్రంధాలు, 15 మంత్ర, వేదాంత గ్రంథాలను తెలుగులో రాసారు. సంస్కృతంలో మమ్మటుడు రాసిన "కావ్యప్రకాశం" తో సహా అనేక గ్రంథాలను తెలుగులో రాసారు. వీరు రాసిన "నాట్యవేదం" కు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది.

ఆయన విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలొ చదివారు. అక్కడే "సాహిత్య విద్యాప్రవీణ" చేసారు. తాతా సుబ్బరాయశాస్త్రి శిష్యరికంలో నేర్చుకున్న విద్యకు వన్నె చేకూర్చారు. ఇతడు తెనాలిలోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా 12 ఏళ్ళపాటు జీతం తిసుకోకుండా పనిచేశాడు[2]. తరువాత గుంటూరులోని ఆంధ్రక్రైస్తవ కళాశాల, నెల్లూరు వేద పాఠశాల, నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు.

రచనలు[3]సవరించు

 1. నవరస గంగాధరము
 2. ధ్వని సారము
 3. కావ్య ప్రకాశము
 4. రసగంగాధరమణి
 5. అలంకార సూత్రము
 6. నాట్యవేదము (రెండు భాగాలు)
 7. శృంగార ప్రకాశము
 8. లక్షణాలంకారము
 9. రసభారతి నాటక మీమాంస
 10. ఆంధ్ర ప్రతాపరుద్రీయము(రెండు భాగాలు)[4],[5] ISBN 978-11-754-0544-9
 11. ఔచిత్య విచార చర్చ
 12. శ్రీ[6]
 13. శ్రీదేవీ కథ
 14. గీతాసూత్రనవతి
 15. వక్రోక్తి జీవితము
 16. వక్రోక్తి సారము
 17. నృత్తరత్నావలి(రెండు భాగములు)[7]
 18. ఏకావలి
 19. నటసూత్రమ్‌
 20. సహృదయాలోకలోచనమ్‌
 21. వ్యక్తివివేకసారము
 22. శారదాతనయ విరచిత భావప్రకాశనము[8]
 23. మాధవగీత
 24. తత్త్వసంగ్రహము
 25. ఉపనిషత్కథ

బిరుదములుసవరించు

 1. దర్శనాచార్య
 2. మహోపాధ్యాయ
 3. సాహిత్య విద్యాప్రవీణ
 4. శాస్త్రవిశారద
 5. సాహిత్యసమ్రాట్
 6. సాహిత్యాచార్య
 7. లాక్షణిక శిరోమణి
 8. ఆంధ్ర నయాగరా
 9. ఉపన్యాసక చక్రవర్తి

నోట్స్సవరించు

జనన మరణ వివరాలను, జమ్మలమడక మాధవరామ శర్మ బంధువులు ఐన జమ్మలమడక భవభూతి శర్మ గారి నుంచి సేకరణ జరిగినది.

మూలాలుసవరించు

 1. సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"
 2. జమ్మలమడక, మాధవరామశర్మ (1941). శ్రీ (1 ed.). తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ. p. 7. Retrieved 2 January 2015.
 3. కనక్, ప్రవాసి (1963). అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక (1 ed.). రాజమండ్రి: అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం. pp. 260, 261. Retrieved 2 January 2015.
 4. జమ్మలమడక, మాధవరామశర్మ (1946). ఆంధ్ర ప్రతాపరుద్రీయము మొదటి భాగము. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 2 January 2015.
 5. జమ్మలమడక, మాధవరామశర్మ (1946). ఆంధ్రప్రతాపరుద్రీయము రెండవభాగము. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 2 January 2015.
 6. జమ్మలమడక, మాధవరామశర్మ (1941). శ్రీ. తెనాలి: శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ. Retrieved 2 January 2015.
 7. జమ్మలమడక, మాధవరామశర్మ (1972). నృత్తరత్నావలి (1 ed.). తణుకు: శ్రీ నరేంద్రనాథ సాహిత్యమండలి. Retrieved 2 January 2015.
 8. జమ్మలమడక, మాధవరామశర్మ (1973). శారదాతనయవిరచిత భావప్రకాశనము (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ. Retrieved 2 January 2015.