జమ్మలమడుగు
జమ్మలమడుగు, వైఎస్ఆర్ జిల్లాలోని పట్టణం. ఇది పెన్నానది ఒడ్డున ఉంది. జిల్లా కేంద్రం కడపకు 70 కి.మీ దూరంలో వ్యాపార పట్టణం ప్రొద్దుటూరుకు కేవలం 20 కి.మీ దూరములో ఉంది. ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల కూడలి ప్రాంతం. మూడు జిల్లాల సంస్కృతుల సమ్మేళన ప్రాంతం.
పట్టణం | |
Coordinates: 14°54′N 78°24′E / 14.9°N 78.4°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | జమ్మలమడుగు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 24.83 కి.మీ2 (9.59 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 46,069 |
• జనసాంద్రత | 1,900/కి.మీ2 (4,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1035 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8560 ) |
పిన్(PIN) | 516434 |
Website |
పేరు వ్యుత్పత్తి
మార్చుగ్రామ అసలు నామం జంబుల మడక (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలానికి ఈ ప్రదేశం రూపాంతరం చెంది జమ్మలమడుగుగా మారింది.
చరిత్ర
మార్చుఈ ప్రాంతాన్ని పూర్వం ములికినాడు అని పిలిచేవారు.[3] సుప్రసిద్ధమైన గండికోట జమ్మలమడుగు మండలం లోనే ఉంది.
జనగణన వివరాలు
మార్చుజమ్మలమడుగు, వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలానికి చెందిన ఒక నగర పంచాయతీ. జమ్మలమడుగు నగరాన్ని 26 వార్డులుగా విభజించి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జమ్మలమడుగు నగరంలో మొత్తం 11,275 కుటుంబాలు నివసిస్తున్నాయి. జమ్మలమడుగు మొత్తం జనాభా 46,069 అందులో పురుషులు 22,636, స్త్రీలు 23,433 కాబట్టి సగటు లింగ నిష్పత్తి 1,035.
జమ్మలమడుగు నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4680, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 2457 మంది మగ పిల్లలు, 2223 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 905, ఇది సగటు లింగ నిష్పత్తి (1,035) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 74.7%. ఆ విధంగా వైఎస్ఆర్ జిల్లాలో 67.3% అక్షరాస్యతతో పోలిస్తే జమ్మలమడుగు అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. జమ్మలమడుగులో పురుషుల అక్షరాస్యత రేటు 84.29%, స్త్రీల అక్షరాస్యత రేటు 65.55%.[4]
పరిపాలన
మార్చుజమ్మలమడుగు నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
మార్చుపట్టణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి డిపో ఉంది. రైల్వే స్టేషను ఉంది.జమ్మలమడుగు రైల్వే స్టేషను నుండి విజయవాడ ధర్మవరం తిరుపతి నంద్యాల కడప ప్రొద్దుటూరు అనంతపురం పట్టణాలకు రైళ్ల సౌకర్యాలు ఉన్నాయి. జమ్మలమడుగు రైల్వే స్టేషను నంద్యాల యర్రగుంట్ల రైల్వే లైన్ లో అతి ముఖ్యమైన రైల్వే స్టేషను. జమ్మలమడుగు మీదుగా జాతీయ రహదారి 67 వెళ్తుంది., నంద్యాల వరుకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 167 కె జమ్మలమడుగు వరకు పొడిగించి నాలుగు వరుసల జాతీయ రహదారిగా నిర్మిస్తున్నారు, అలాగే జమ్మలమడుగు నుండి ముద్దనూరు పులివెందుల కదిరి గోరంట్ల హిందూపురం వరకు మరొక జాతీయ రహదారిని నిర్మించనున్నారు.ఈ జాతీయ రహదారిని జాతీయ రహదారి 44 తో అనుసంధానం చేయనున్నారు.
విద్యా సౌకర్యాలు
మార్చు- పతంగే రామన్న శతాబ్ది ఉన్నత పాఠశాల - ( పి.ఆర్.శతాబ్ది ఉన్నత పాఠశాల)
పర్యాటక ఆకర్షణలు
మార్చు- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము :ఈ పట్టణంలో శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర దేవాలయం ఉంది. నారాపురుడనే భక్తుడు నిర్మించిన దేవాలయం కనుక దీనిలో స్వామిని నారాపుర వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. ఉత్తర దిశగా నిర్మించిన ఈ ఆలయం ఇసుక తిన్నెలలో అందంగా కనిపిస్తుంటుంది.
- శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము:ఈ ఆలయం 1914 లో నిర్మితమైంది. ఈ ఆలయ శతాబ్ది ఉత్సవాలు, అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు.
- శ్రీ అంబా భవాని దేవాలయం: ఈ దేవాలయం జమ్మలమడుగు పట్టణ భావసార క్షత్రియుల ఇలవేలుపు.
- శ్రీ గణపతి దేవాలయం: ఈ ఆలయం పెన్నా నదిలో మొక్కల నర్సరీకి సమీపాన ఉంది. ఈ ఆలయ పరిసరాలలో లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శివాలయం, 15 అడుగుల ఎత్తులో శివలింగం ఉన్నాయి.
ఇక్కడ అశ్వర్థ నారాయణ వృక్షం, ఉసిరి చెట్టు, శివునికి ప్రీతి పాత్రమైన బిల్వ వృక్షం, తెల్ల జిల్లేడు, మామిడి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు ఉన్నాయి.
త్రాగునీటి సౌకర్యాలు
మార్చుపెన్నా నది లోని బోర్లు, మైలవరం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా నీరు పుష్కలంగా లభిస్తుంది.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=672296.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. p. 65. Archived from the original (PDF) on 5 April 2016. Retrieved 2 July 2018.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ "Jammalamadugu Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-04. Retrieved 2022-10-04.