జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్

జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో గల జమ్మూ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.

జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతజమ్మూ కాశ్మీరు,పంజాబ్,ఢిల్లీ
తొలి సేవజూలై 1994; 29 సంవత్సరాల క్రితం (1994-07)
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే మండలం
మార్గం
మొదలున్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ఆగే స్టేషనులు3
గమ్యంజమ్మూ
ప్రయాణ దూరం577 km (359 mi)
సగటు ప్రయాణ సమయం09గంటల 15నిమిషాలు
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12425 / 12426
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,రెండవ తరగతి,మూడవ తరగతి
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుకలదు
చూడదగ్గ సదుపాయాలుLarge Windows
వినోద సదుపాయాలుకలదు(1A)
బ్యాగేజీ సదుపాయాలుYes
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
విద్యుతీకరణSingle phase 25 kV, 50 Hz AC through overhead catenary
వేగం65 km/h (40 mph) average with halts , 140 km/h (87 mph)maximum
మార్గపటం
(New Delhi - Jammu Tawi) Rajdhani Express Route map

చరిత్ర మార్చు

జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ ను 1994 జూలై 10 న వారాంతపు సర్వీసుగా ప్రారంభించారు.1994 నుండి 2009 వరకు వారాంతపు సర్విసుగానే నడిపినప్పటికి,2009 నుండి దీనిని రోజూ నడపడం ఆరంభించారు.

ప్రయాణ మార్గం మార్చు

జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ జమ్మూ నుండి ప్రతిరోజు రాత్రి 07గంటల 40నిమిషాలకు 12426 నెంబరుతో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.ఈ రైలు 577కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి 09గంటల 20నిమిషాల కాలం తీసుకుంటుంది. జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ 12425 నెంబరుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 08గంటల 40నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05గంటల 45నిమిషాలకు జమ్మూ చేరుతుంది. జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ జమ్మూ కాశ్మీరు,పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ కతువ, పఠాన్ కోట్,లుధియానా జంక్షన్ ల మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.

కోచ్ల అమరిక మార్చు

జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,5 రెండవ తరగతి ఎ.సి కోచ్లూ,11 మూడవ తరగతి ఎ.సి కోచ్లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
EOG హెచ్1 ఎ5 ఎ4 ఎ3 ఎ2 ఎ1 PC బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG  

సమయ సారిణి మార్చు

  • 12425:జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ ( జమ్మూ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 JAT జమ్మూ ప్రారంభం 19:40 0.0 1
2 KTHU కతు 20:42 20:44 2ని 76.1 1
3 PTKC పఠాన్ కోట్ 21:20 21:25 5ని 99.2 1
4 LDH లుధియానా జంక్షన్ 00:05 00:15 10ని 264.2 2
5 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 05:00 గమ్యం 577.1 2

ట్రాక్షన్ మార్చు

జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభ సమయంలో లుధియానా లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ లోకోమోటివ్ను ఉపయోగించారు.జమ్మూ-న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రైలు మార్గం పూర్తిస్థాయి విధ్యుతీకరింపబడడంతో ప్రస్తుతం జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషేడ్ అధారిత WAP-5లేదా WAP-7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html