జమ్మూ

జమ్మూ కాశ్మీరు శీతాకాల రాజధాని

జమ్మూ, భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శీతాకాల రాజధాని.ఇది జమ్మూ జిల్లా పరిపాలానా ప్రధాన కేంద్రస్థానం.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం.ఇది 26.64 చ.కి.మీ.(10.29 చ.మై)విస్తీర్ణంతో జమ్మూనగరం తావినది ఒడ్డున ఉంది.జమ్మూకు ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన ఉత్తర-మైదానాలు ఉన్నాయి. కేంద్రపాలిత భూభాగంలో జమ్మూ రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం.జమ్మూ పురాతన దేవాలయాలు,హిందూ పుణ్యక్షేత్రాలకు నిలయమై, దేవాలయాల నగరంగా పిలువబడే జమ్మూ కాశ్మీరు కేంద్ర భూభాగంలో యాత్రికలు ఎక్కువగా సందర్శించే ప్రదేశం.జమ్మూ నగరం తన సరిహద్దులను పొరుగున ఉన్న సాంబా జిల్లాతో పంచుకుంటుంది.

జమ్మూ
హరి నివాస్ ప్యాలెస్, బాహు ఫోర్ట్, తవి వంతెన, ముబారక్ మండి ప్యాలెస్.
Nickname: 
City of Temples[1]
జమ్మూ is located in Jammu and Kashmir
జమ్మూ
జమ్మూ
జమ్మూ is located in India
జమ్మూ
జమ్మూ
జమ్మూ is located in Asia
జమ్మూ
జమ్మూ
Coordinates: 32°44′N 74°52′E / 32.73°N 74.87°E / 32.73; 74.87
దేశం భారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాజమ్మూ
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyజమ్మూ మునిసిపల్ కార్పొరేషన్, జమ్మూ డెవలప్మెంట్ అథారిటీ
 • మేయర్చంద్రమోహన గుప్త, బిజెపి[2]
విస్తీర్ణం
 • నగరం26.64 కి.మీ2 (10.29 చ. మై)
Elevation300–400 మీ (1,000−1,300 అ.)
జనాభా
 (2011)
 • నగరం5,02,197
 • Rank92
 • జనసాంద్రత45/కి.మీ2 (120/చ. మై.)
 • Metro
6,57,314
భాషలు
 • అధికారహిందీ,[4][5] డోగ్రీ,[6] ఉర్దూ,[7] ఆంగ్లం
Time zoneUTC+5:30
[[పిన్‌కోడ్]|పిన్]]
180001[8]
Vehicle registrationJK-02
లింగ నిష్పత్తి867 / 1000

పేరువెనుక చరిత్ర

మార్చు

స్థానిక సాంప్రదాయం ప్రకారం,9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించినట్లు భావిస్తున్న జమ్మూకు దాని వ్యవస్థాపకుడు రాజా జంబులోచన్ పేరు పెట్టినట్లు తెలుస్తుంది.[9] ఈ నగర స్థానిక సంప్రదాయం 3,000 సంవత్సరాల నాటిదని తెలుస్తుంది,కానీ దీనికి చరిత్రకారులు మద్దతు ఇవ్వరు.[10]

భౌగోళికం

మార్చు

జమ్మూ 32°44′N 74°52′E / 32.73°N 74.87°E / 32.73; 74.87. అక్షాంశ-రేఖాంశాలు వద్ద ఉంది.[11] ఇది సముద్రమట్టానికి 300 మీ (980 అ) సగటు ఎత్తులో ఉంది.జమ్మూ నగరం శివాలిక్ కొండల అసమాన గట్ల వద్ద తక్కువ ఎత్తులోఉంది.ఇది ఉత్తర, తూర్పు, ఆగ్నేయంలో శివాలిక్ కొండల శ్రేణి చుట్టూ ఉంది. త్రికుట కొండల శ్రేణి వాయవ్య దిశలో చుట్టుముట్టింది.ఇది దేశ రాజధాని న్యూడిల్లీ నుండి సుమారు 600 కి.మీ. (370 మైళ్లు) దూరంలో ఉంది.

పాత నగరానికి ఎదురుగా ఉత్తరాన తావినది చుట్టూ(కుడి ఒడ్డు) ఈ నగరం విస్తరించింది.కొత్త పొరుగుప్రాంతాలు నది దక్షిణవైపు (ఎడమ ఒడ్డు) చుట్టూ వ్యాపించాయి.నదిపై ఐదు వంతెనలు ఉన్నాయి.నగరం వరుస చీలికలుగా నిర్మించబడింది.

చరిత్ర

మార్చు
 
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మహారాజా గులాబ్ సింగ్

తారిఖ్-ఇ-అజ్మీ గ్రంధాల ప్రకారం సా.శ.900లో జమ్మూ నగరం ఉనికిలోకి వచ్చినట్లు తెలుస్తుంది.దుర్గరా రాష్ట్రం ప్రస్తుత పేర్లు "దుగ్గర్", " డోగ్రా "ఈ సమయంలోనే కనుగొనినట్లు ధ్రువీకరించబడ్డాయి. [12] ఆ సమయంలో దుగ్గర్ రాష్ట్ర రాజధాని వల్లపురా,దీని ప్రస్తుత ఆధునిక పేరు బిల్లావర్‌తో గుర్తించబడిందని నమ్ముతారు.కల్హనా రాజతరంగినిలో దాని పాలకులను దీనిని పదేపదే ప్రస్తావించారు.[13] బబ్బాపురా ఆధునిక పేరు బాబర్ లో పేర్కొన్న రాజతరంగిణి మరొక రాష్ట్రంలో ఉంది.వీరిలో కొందరు పాలకులు,జమ్మూ పాలకుల వంశావళి (కుటుంబ చరిత్ర)లో తరువాత ప్రస్తావించారు.ఈ పాలకులు దాదాపు స్వతంత్ర హోదాను పొందారని, డిల్లీ సుల్తాన్ రాజా భీమ్ దేవ్ ముబారా షా (1421-1434) పొత్తు పెట్టుకున్నారని నమ్ముతారు.[14]

మొఘల్ చక్రవర్తి తైమూర్ (1370-1406) వృత్తాంతాల ద్వారా జమ్మూ పేరు ప్రస్తావించబడింది.అతను1398లో డిల్లీపై దాడి చేసి జమ్మూ ద్వారా సమర్కాండ్‌కు తిరిగి వచ్చాడు.16వ శతాబ్దం ప్రారంభంలో బాబర్ మొఘల్ చరిత్రలో,పంజాబ్ కొండలలో జమ్మూ ఒక శక్తివంతమైన రాష్ట్రంగా ఉదహరించారు.దీనిని మాన్హాస్ రాజ్‌పుత్‌లు పాలించినట్లు చెబుతారు.అక్బర్ చక్రవర్తి ఈ ప్రాంతంలోని కొండ రాజ్యాలను మొఘల్ సామ్రాజ్య అధీనంలోకి తీసుకువచ్చాడు,కానీ రాజులు గణనీయమైన రాజకీయ స్వయంప్రతిపత్తిని పొందారు. జమ్మూతో పాటు ఈ ప్రాంతంలోని కిష్త్వార్,రాజౌరి వంటి ఇతర రాజ్యాలు కూడా ప్రస్తావించబడ్డాయి.ఈ కొండప్రాంతాలలోని ముఖ్యులను మొఘల్ సామ్రాజ్యంలో మిత్రులుగా, భాగస్వాములుగా భావించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. [15]

ఆధునిక చరిత్ర

మార్చు
 
కాశ్మీర్ మహారాజా, హరి సింగ్ (1895 - 1961)

18వ శతాబ్దంలో మొఘల్ శక్తి క్షీణించిన తరువాత,జామువాల్ (జామ్వాల్ ) కుటుంబానికి చెందిన రాజా ధ్రువ్ దేవ్ నేతృత్వంలోని జమ్మూ రాష్ట్రం అన్ని దుగర్ రాష్ట్రాలలో తన ఆధిపత్యాన్ని నొక్కి చెప్పింది.అతని వారసుడు రాజా రంజిత్ దేవ్ మొఘల్ పరిపాలన కాలంలో(1728-1780),కొండ రాష్ట్రాలలో విస్తృతంగా గౌరవంపొందాడు. [16] [17] రంజిత్ దేవ్ మత స్వేచ్ఛ, భద్రతను ప్రోత్సహించాడు.ఇది చాలా మంది హస్తకళాకారులను,వ్యాపారులను జమ్మూలో స్థిరపడటానికి ఆకర్షించింది.అది జమ్మూ ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడింది. [18]

రంజిత్ దేవ్ పాలన ముగిసే సమయానికి, పంజాబ్ సిక్కు వంశాలు ( మిస్ల్స్ ) ఎక్కువ ప్రాబల్యం పొందాయి.జమ్మూ భాంగి, కన్హయ్య, సుకర్చకియా మిస్లచే పోటీపడటం ప్రారంభించాయి .1770 లో భంగి మిస్ల్ జమ్మూపై దాడి చేసి,రంజిత్ దేవ్ ను సామంతరాజ్యంగా మార్చమని బలవంతం చేశాడు.రంజిత్ దేవ్ వారసుడు బ్రిజ్ లాల్ దేవ్, సుక్కర్‌చాకియా చీఫ్ మహాన్ సింగ్ చేతిలో ఓడిపోయాడు.అతను వారిని ఓడించి జమ్మూను దోచుకున్నాడు.ఆ విధంగా జమ్మూ చుట్టుపక్కల దేశంపై తన ఆధిపత్యాన్నికోల్పోయింది.[19] జమ్మూను 1808లో, మహాన్ సింగ్ కుమారుడు మహారాజా రంజిత్ సింగ్, సిక్కు సామ్రాజ్యానికి చేర్చుకున్నాడు. [20]

1818లో రాజా గులాబ్ సింగ్ తండ్రి రాజా కిషోర్ సింగ్ నియమితులయ్యాడు.జమ్మూ రాజ్య పాలకుడిగా అతనికి అభిషేకం చేశారు.అందువల్ల జామ్వాల్ రాజవంశం,లేదా డోగ్రా రాజవంశం పాలన ప్రారంభమైంది.అక్కడనుండి బ్రిటిష్ ఆధీనంలోకి జమ్మూ కాశ్మీర్ రాచరిక పాలనకిందకు వచ్చింది.పాలకులు పెద్ద దేవాలయాలను నిర్మించారు.పాత పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించారు.విద్యాసంస్థలను నిర్మించారు.మరెన్నో ఇతర కట్డడాలు నిర్మించారు.జమ్మూను సియాల్‌కోట్‌తో కలిపే 43 కి.మీ. పొడవైన రైల్వే మార్గం 1897 లో వేశారు [21] జమ్మూ చారిత్రాత్మకంగా జమ్మూ రాచరిక రాజధాని జమ్మూ,శీతాకాల రాజధాని కాశ్మీర్ (1846 – 952).భారతదేశం విభజన తరువాత,జమ్మూ భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ శీతాకాల రాజధానిగా కొనసాగుతుంది.

వాతావరణం

మార్చు
 
తవి నది

జమ్మూ, మిగతా వాయవ్య భారతదేశంలోవలె,తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం కలిగిఉంటుది.వేసవిలో గరిష్ఠ స్థాయి 4 46 °C (115 °F) చేరుకుంటుంది.శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అప్పుడప్పుడు 4 °C (39 °F) కన్నా తక్కువకు వస్తాయి.జూన్ నెలలో అత్యధికంగా 40.6 °C (105.1 °F) అత్యధికంగా ఉన్న నెల, సగటు శీతలం 7 °C (45 °F) సగటు కనిష్ఠాలు 7 °C (45 °F) చేరుకుంటాయి.సగటు వార్షిక అవపాతం 42 అంగుళాలు1,100 మి.మీ. ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకుగల నెలల్లో ఎక్కువ వర్షపాతంతో,శీతాకాలం తడిగా ఉంటుంది.శీతాకాలంలో దట్టమైన పొగమంచు చాలా అసౌకర్యానికి గురిచేస్తుంది.ఉష్ణోగ్రత 2 °C (36 °F)కి పడిపోతుంది. వేసవిలో, ముఖ్యంగా మే,జూన్ నెలలలో, చాలా తీవ్రమైన ఎండతో వేడిగాలులు ఉష్ణోగ్రతను 46 °C (115 °F)కి పెంచుతాయి.ఎండాకాలం తరువాత, రుతుపవనాలు ఉరుములతో పాటు భారీవర్షాలతో నగరాన్ని ముంచెత్తుతాయి.వర్షపాతం 669 మి.మీ.(26.3 అం.) వరకు ఉంటుంది.

రవాణా

మార్చు
 
జమ్మూ తవి స్టేషన్

జమ్మూ నగరంలో జమ్మూ తావి (స్టేషన్ కోడ్ జాట్) అనే రైల్వే స్టేషన్ ఉంది.ఇది భారతదేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది.సియాల్‌కోట్‌కు పాత రైల్వేమార్గాన్ని పాకిస్తాన్ 1947 సెప్టెంబరులో నిలిపివేసింది.దానివలన 1971 వరకు జమ్మూకు రైలు సేవలు లేవు.భారత రైల్వే పఠాన్‌కోట్- జమ్ము తావి బ్రాడ్ గేజ్ మార్గాన్ని ఏర్పాటు చేసింది.కొత్త జమ్మూ తావి స్టేషన్1972 అక్టోబరు నుండి ఎక్స్‌ప్రెస్ రైళ్లనుప్రారంభించింది.జమ్మూ-బారాముల్లా మార్గం ప్రారంభం కావడంతో, కాశ్మీర్ లోయకు వెళ్లే అన్ని రైళ్లు జమ్మూ తావి గుండా వెళతాయి.జమ్మూ-బారాముల్లా రైల్వే మార్గం ప్రాజెక్టులో కొంతభాగం రైల్వే మార్గం కత్రాకు వరకు విస్తరించారు.జలంధర్ - పఠాన్‌కోట్-జమ్మూ తావి విభాగంలో మార్గం రెట్టింపు అయ్యి విద్యుదీకరించబడింది.

జమ్మూ గుండా వెళ్ళే జాతీయ రహదారి-1ఎ దీనిని కాశ్మీర్ లోయతో కలుపుతుంది.జాతీయ రహదారి-1బి జమ్మూను పూంచ్ పట్టణంతో కలుపుతుంది.జమ్మూ,కథువా పట్టణం నుండి కేవలం 80 కి.మీ.(50 మైళ్లు),దూరంలో,ఉధంపూర్ నుండి 68 కి.మీ.(42 మైళ్లు) దూరంలో,కత్రా నుండి 49 కి.మీ (30 మైళ్లు) దూరంలో ఉంది

జమ్మూ విమానాశ్రయం జమ్మూ నగరం మధ్యలో ఉంది.జమ్మూ నుండి శ్రీనగర్, డిల్లీ, అమృత్సర్, చండీగర్, లేహ, ముంబై, బెంగళూరులకు నేరుగా ప్రయాణించే విమానాలు ఉన్నాయి.జమ్మూ విమానాశ్రయం ప్రతిరోజూ వచ్చే,పోయే 30 విమానాలను గోయిర్, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, ఇండిగో సంస్థలు రోజువారీ విమానాలను నడుపుతుంది.

నగరంలో జమ్మూ కాశ్మీరు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాహనాలు నగరంలో,కొన్ని నిర్వచించిన మార్గాల్లో తిరుగుతుంటాయి.ఇది స్థానిక రవాణా కోసం చిన్న వాహనాలు తిప్పుతుంది.ఈ మినీ బస్సులను "మెటాడోర్సు" అని పిలుస్తారు.ఈ ఆటో-రిక్షా, సైకిల్-రిక్షా సేవలు,స్థానిక టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

పరిపాలన

మార్చు
 
జమ్మూ సిటీ వ్యూ

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శీతాకాల రాజధానిగా నవంబరు నుండి ఏప్రిల్ వరకు జమ్మూలో పనిచేసేసమయంలో అన్ని కార్యాలయాలు శ్రీనగర్ నుండి మారతాయి.ప్రతి సంవత్సరం మే నుండి అక్టోబరు వరకు శ్రీనగర్ వేసవికాల రాజధానిగా పనిచేస్తుంది.[22] 2001 భారత జనాభా లెక్కల సమయంలో జమ్మూ పురపాలక సంఘంగా ఉంది. 2003 సెప్టెంబరు 5 నుండి పురపాలక సంఘం స్థాయి నుండి,నగరపాలక సంస్థ ఉన్నత స్థాయికి చేరింది.[23]

ఆర్థిక వ్యవస్థ

మార్చు

జమ్మూ పరిపాలనా విభాగానికి జమ్మూ నగరం ప్రధాన సాంస్కృతిక, ఆర్థిక కేంద్రం.నగరంలో అనేక చిన్న పరిశ్రమలు ఉన్నాయి.జమ్మూ స్థానిక జనాభా అవసరాలు తీర్చడానికి అనేక వుడ్‌గ్రెయిన్ మిల్లులు ఉన్నాయి.జమ్మూ సమీపంలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో అత్యంత స్థానిక బాస్మతి బియ్యం ఉత్పత్తిచేసే మిల్లు ఉంది.తరువాత వాటిని జమ్మూలోని రైస్ మిల్లులలో ప్రాసెస్ చేస్తారు.జమ్మూ చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న రైస్ మిల్లులతో పాటు,బారి బ్రహంనాలోని పారిశ్రామికవాడలో తివాచీలు,ఎలక్ట్రానిక్ వస్తువులు,విద్యుత్ వస్తువుల నుండి వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేసే పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి.స్థానిక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటయ్యే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను ఇస్తుంది. బరి బ్రాహ్మణకు సరుకు రవాణాకు లింకు రైలు ఉంది.ఇక్కడ తయారు చేసిన వస్తువులను భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఇది సహాయపడుతుంది.

పర్యాటకం

మార్చు

జమ్మూ నగరంలో పర్యాటకం అతిపెద్ద పరిశ్రమ. వైష్ణో దేవి,కాశ్మీర్ లోయకు వెళ్ళే యాత్రికులకు ఇది కేంద్ర బిందువు.ఎందుకంటే ఇది ఉత్తర భారతదేశంలో రెండవ చివరి రైల్వే మజిలీ.కాశ్మీర్,పూంచ్,దోడా, లడఖే వెళ్లే అన్నిమార్గాలు జమ్మూ నగరం నుండి ప్రారంభమవుతాయి. అందుచేత ఏడాది పొడవునా జమ్మూ నగరం భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో నిండి ఉంటుంది.జమ్మూ నగరంలో ముబారక్ మండి ప్యాలెస్,పురాణి మండి,రాణి పార్కు,అమర్ మహల్,బాహు ఫోర్ట్,రఘునాథ్ టెంపుల్,రణబీరేశ్వర్ టెంపుల్,కర్బాలా,పీర్ మీతా, పాత జమ్మూ నగరం ఓల్డ్ సిటీ వంటి కొన్ని ప్రదేశాలలో ఆసక్తిగల పాత చారిత్రక రాజభవనాలు ఉన్నాయి.

జనాభా

మార్చు
 
1920 లలో సింగర్ మాలికా పుఖ్రాజ్

2011 జనాభా లెక్కల ప్రకారం [24] జమ్మూ నగర మొత్తం జనాభా 50,2,197.అందులో పురుషులు 52.7% మంది ఉన్నారు.స్త్రీలు 47.3% మంది ఉన్నారు.లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 898 మహిళలు ఉన్నారు.జాతీయ సగటు 940 తో పోలిస్తే ఇది ఎక్కువ. జమ్మూ సగటు అక్షరాస్యత రేటు 89.66%,ఇది జాతీయ సగటు 74.4% కంటే చాలా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 93.13%కాగా,స్త్రీల అక్షరాస్యత 85.82%గా ఉంది.6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మొత్తం జనాభాలో 8.47% మంది ఉన్నారు.జమ్మూ పట్టణ సముదాయంలో 657,314 జనాభా ఉంది.[25] జమ్మూ కాశ్మీర్ హిందువులలో ఎక్కువ మంది జమ్మూ ప్రాంతంలో నివసిస్తున్నారు.చాలామంది డోగ్రిభాష మాట్లాడతారు.

భాషలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం డోగ్రీభాషను 55%, పంజాబీ భాషను 22%, హందీభాషను11.6%, ఇతర భాషను 11.4% మంది మాట్లాడుతారు.[26]

ముస్లిం వర్గాలు

మార్చు

భారత విభజనకు ముందు జమ్మూ జిల్లాలోని ఇతర నగరాలకన్నా జమ్మూ నగరంలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది.1941 జనాభా లెక్కల ప్రకారం ఇది 37 శాతంగా ఉంది.కాశ్మీర్‌పై పాకిస్తాన్ గిరిజన దండయాత్రకు ముందు,1947 జమ్మూ ఉచకోత జరిగిన సమయంలో చాలా మంది ముస్లింలు చంపబడ్డారు.మిగిలినవారిని పాకిస్తాన్‌కు తరలించారు.చంపబడిన వారు సుమారు 20,000 నుండి100,000 మధ్య ఇవి మారుతూ ఉంటాయి.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాల్పపడిందని ఉగ్రవాద హిందువులు ఆరోపించిగా,సిక్కులు ఈ హత్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.మహారాజా హరి సింగ్ సహాయంతో రాష్ట్ర దళాలుసహాయపడ్డాయి.[27] [28] [29] హింస, వలసల ఫలితంగా 1961 నాటికి జమ్మూ జిల్లా జనాభాలో 10 శాతం కంటే తక్కువ మంది ముస్లింలు [30] స్థానభ్రంశం చెందిన ముస్లింలు సియాల్‌కోట్ జిల్లా, పాకిస్తాన్ పంజాబ్‌లోని ఇతర ప్రాంతాలలో ఆశ్రయం పొందారు. పాకిస్తాన్లోని పలువురు పంజాబీ నివాసితులు, రాజకీయ నాయకుడు చౌదరి అమీర్ హుస్సేన్, ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్, ఎయిర్ మార్షల్ అస్గర్ ఖాన్, జర్నలిస్ట్ ఖలీద్ హసన్, గాయని మాలికా పుఖ్రాజ్ జమ్మూకు చెందినవారు.[31]

చదువు

మార్చు
 
గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జమ్మూ

2014–2015 కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్‌లో భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జమ్మూ విభాగానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను ప్రతిపాదించారు.

జమ్మూలోని కొన్ని విద్యా సంస్థలు

మార్చు

జమ్మూలోని ఇంజనీరింగ్ కళాశాలలు

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ
  • గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జమ్మూ
  • మోడల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జమ్మూ
  • యోగానంద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జమ్మూ

వైద్య సంస్థలు

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్,సిఎస్ఐఆర్
  • ప్రభుత్వ వైద్య కళాశాల, జమ్మూ

న్యాయ సంస్థలు

  • కిషెన్ చంద్ లా కాలేజీ, జమ్మూ
  • డోగ్రా లా కాలేజ్, జమ్మూ
  • కాలియోప్ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్, జమ్మూ
  • ఆర్కె లా కాలేజ్, జమ్మూ

జనరల్ డిగ్రీ కోర్సులు (కళాశాలలు): -

  • ప్రభుత్వం గాంధీ మెమోరియల్ సైన్సు కళాశాల, జమ్మూ
  • ప్రభుత్వం మామ్ పిజి కాలేజీ, జమ్మూ

విశ్వవిద్యాలయాలు

  • జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ
  • షేర్-ఎ-కాశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ జమ్మూ
  • జమ్మూ విశ్వవిద్యాలయం

పాఠశాలలు

  • కేంద్రీయ విద్యాలయ, బంటలాబ్
  • కేంద్రీయ విద్యాలయ, సుంజువాన్

వంటకాలు

మార్చు

జమ్ముూలో సుంద్ పంజీరి, పటిసా, బియ్యంతో రాజ్మా,కలరి జున్నుకు ప్రసిద్ధి చెందింది.అంబల్, ఖట్టా మాంసం, కుల్తేన్ డి దాల్, దాల్ పాట్, మా డా మద్రా, రాజ్మా, ఆరియా బంగాళాదుంపలతో చేసిన వంటకం, డోగ్రి ఆహార ప్రత్యేకతలు.జమ్మూలో కాస్రోడ్, గిర్గిల్, మామిడితో సాన్ఫు, జిమికాండ్, తయా, సెయూ, బంగాళాదుంపలతో విలక్షణమైన ఊరగాయ పచ్చళ్లు తయారు చేస్తారు. జమ్మూ వంటకాల్లో వివిధ తిని భండారాలు ఉన్నాయి. ముఖ్యంగా గోల్ గప్పాస్, కచలు, చోలే భతురే, గుల్గులే, రాజ్మా కుల్చే, దాహి పల్లా మొదలైనవి.[32]

శరణార్థులు వలస

మార్చు

తులనాత్మకంగా ఉగ్రవాదం నుండి సురక్షితంగా ఉన్నందున, జమ్మూ నగరం శరణార్థుల కేంద్రంగా మారింది. వీరిలో ప్రధానంగా 1989 లో కాశ్మీర్ లోయ నుండి వలస వచ్చిన కాశ్మీరీ హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు జమ్మూ కాశ్మీర్, జమ్మూ నగరంలో స్థిరపడ్డారు.రికార్డుల ప్రకారం సుమారు పాకిస్తాన్ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ నుండి 31,619 హిందూ కుటుంబాలు భారతదేశానికి వలస వచ్చాయి. వారిలో 26,319 కుటుంబాలు జమ్మూలో స్థిరపడ్డాయి. 2016 లో మయన్మార్ నుండి పారిపోయిన రోహింగ్యాలు కూడా ప్రస్తుతం జమ్మూలో స్థిరపడ్డారు.[33][34] రోహింగ్యా ముస్లింల పరిష్కారాలు, జమ్మూలో భద్రతా బెదిరింపులను పెంచాయి.[35][36][37] 2018 సుంజువాన్ దాడి సమయంలో,ఈ దాడిలో రోహింగ్యా ముస్లింల ప్రమేయం ఉందని గూఢచార సంస్థలు అనుమానించాయి.[38][39][40]

మూలాలు

మార్చు
  1. India, Press Trust of (30 January 2019). "Jammu-Srinagar NH reopens for one-way traffic". Business Standard India. Retrieved 28 February 2019. Jammu, the City of Temples, recorded a low of 7.7 degrees Celsius compared to the previous night's 4.1 degrees Celsius
  2. PTI (15 November 2018). "Jammu gets new mayor, deputy mayor | India News - Times of India". The Times of India. Retrieved 1 April 2020.
  3. Akhtar, Rais (2009). Regional Planning for Health Care System in Jammu and Kashmir. Concept Publishing Company. p. 1. ISBN 9788180696275.
  4. "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. Retrieved 2020-09-27.
  5. "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 2020-09-23. Archived from the original on 2020-09-24. Retrieved 23 September 2020.
  6. Pathak, Analiza (2020-09-02). "Hindi, Kashmiri and Dogri to be official languages of Jammu and Kashmir, Cabinet approves Bill". Retrieved 2020-09-08.
  7. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 14 నవంబరు 2020.
  8. Department of Posts, India Ministry of Communications (16 March 2017). "Village/Locality based Pin mapping as on 16th March 2017". data.gov.in. Retrieved 4 October 2018.
  9. "Priya Sethi lays foundation stone of statue of Jambu Lochan". Daily Excelsior. 1 August 2016. Retrieved 16 April 2019.
  10. Kapur, History of Jammu and Kashmir State 1980, p. 9.
  11. "Maps, Weather, and Airports for Jammu, India". www.fallingrain.com.
  12. Kapur, History of Jammu and Kashmir State 1980, pp. 9–10.
  13. Bamzai, Culture and Political History of Kashmir 1994, p. 184.
  14. Charak & Billwaria, Pahāṛi Styles of Indian Murals 1998, pp. 6–7.
  15. Jigar Mohammad, Raja Ranjit Dev's Inclusive Policies 2010, pp. 40–42.
  16. Jeratha, Dogra Legends of Art & Culture 1998, p. 187.
  17. Panikkar, Gulab Singh 1930, p. 10.
  18. Rai, Hindu Rulers, Muslim Subjects 2004, pp. 94–95.
  19. Panikkar, Gulab Singh 1930, p. 10–12.
  20. Panikkar, Gulab Singh 1930, p. 15–16.
  21. "Imperial Gazetteer2 of India, Volume 14, page 49 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu.
  22. "Scheme for voting by postal ballot by a person holding any office under the Govt. and verified to be moving along with the headquarters of the Govt. from Kashmir Province to Jammu Province or vice-versa" (PDF). Office of the Chief Electoral Officer, Jammu and Kashmir. p. 1. Retrieved 8 December 2008. ...the State Govt. functions for six months (November to April) in the winter capital Jammu after which it moves to the summer capital Srinagar...
  23. "History of Jammu Municipal Corporation". Official website of Jammu Municipal Corporation. Archived from the original on 10 April 2009. Retrieved 4 December 2008.
  24. "Jammu Municipal Corporation Demographics". Census of India. Retrieved 25 April 2017.
  25. "Jammu & Kashmir (India): State, Major Agglomerations & Cities – Population Statistics in Maps and Charts". City Population. Retrieved 25 April 2017.
  26. Kashmir, India Superintendent of Census Operations, Jammu and (1966). District Census Handbook, Jammu & Kashmir: Jammu.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  27. Ved Bhasin (17 November 2015). "Jammu 1947". Kashmir Life. Retrieved 4 June 2017.
  28. Chattha, Partition and its Aftermath 2009, p. 182, 183.
  29. Singh, Amritjit; Iyer, Nalini; Gairola, Rahul K. (15 June 2016). Revisiting India's Partition: New Essays on Memory, Culture, and Politics. Lexington Books. p. 149. ISBN 9781498531054.
  30. Luv Puri, Across the Line of Control 2012, p. 30.
  31. Luv Puri, Across the Line of Control 2012, pp. 3, 31.
  32. "Jammu Pincode". citypincode.in. Archived from the original on 19 మే 2014. Retrieved 19 May 2014.
  33. "As Jammu becomes home for refugees from four communities, govt has to deal with complex issue of rights". Retrieved 28 February 2019.
  34. "BBC World Service | World Agenda - Give me land". Retrieved 28 February 2019.
  35. Excelsior, Daily (11 January 2017). "Demographic changes make Jammu a "Ticking Time Bomb"". Retrieved 21 March 2019.
  36. Pioneer, The. "Rohingya refugees: A threat to Jammu" (in ఇంగ్లీష్). Retrieved 21 March 2019.
  37. IANS (19 February 2019). "Demographic changes in Assam, Bengal, J&K, Kerala aided rise of fundamentalist forces: Himanta". Business Standard India. Retrieved 21 March 2019.
  38. Sharma, Arteev (6 February 2019). "'Illegal settlement' of Rohingya to be probed by security agencies". Archived from the original on 21 మార్చి 2019. Retrieved 14 నవంబర్ 2020. After terror attack on the Sunjuwan military station in February last year, Rohingya again came under the radar of security agencies as their alleged role in assisting militants was probed. However, their involvement has not been established as yet. {{cite web}}: Check date values in: |access-date= (help)
  39. Yhome, K. "Examining India's stance on the Rohingya crisis". Retrieved 21 March 2019. In early February 2018, a terrorist attack on an army camp in Sunjuwan of Jammu city sparked a debate on the involvement of Rohingyas as many had settled around the camp.
  40. "After intelligence inputs, forces were told to be on alert - Times of India ►". Retrieved 21 March 2019.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జమ్మూ&oldid=4302877" నుండి వెలికితీశారు