అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ నుండి ఢిల్లీ ల మద్య నడుపబడుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు.అగస్టు క్రాంతి అనే మైదానం పేరు మీదుగా ఈ రైలుకు అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరు పెట్టడం జరిగింది. 

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా & ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే మండలం
మార్గం
మొదలుముంబై సెంట్రల్
ఆగే స్టేషనులు14
గమ్యంహజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం1,377 కి.మీ. (856 మై.)
సగటు ప్రయాణ సమయం
  • 17గంటల 15నిమిషాలు 12953 అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
  • 17గంటల 05నిమిషాలు 12954 అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12953 / 12954
సదుపాయాలు
శ్రేణులు
  • ఎ.సి మొదటి తరగతి
  • ఎ.సి రెండవ తరగతి
  • ఎ.సి మూడవ తరగతి
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఎల్.హెచ్.బీ కోచ్లు
సాంకేతికత
రోలింగ్ స్టాక్LHB Rake, Rake sharing with 12951/52 Mumbai Rajdhani Express
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగంTop Speed - 130.00 km/h (80.78 mph) , 79 km/h (49 mph) average with halts
మార్గపటం
August Kranti Rajdhani Express route map

చరిత్ర

మార్చు

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా 1992 లోప్రవేశపెట్టడం జరిగింది.12953 నెంబరుతో బయలుదేరు ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ నుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు,12954 నెంబరుతో ప్రయాణించు ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి ముమబై సెంట్రల్ వరకు ప్రయాణిస్తుంది

పద ఉత్పత్తి

మార్చు

మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై లో ప్రసిద్ధ మైదానం అయిన ఆగస్టు క్రాంతి పేరు మీదుగా ఈ రైలును ప్రవేశపెట్టారు.ఆగస్టు క్రాంతి మైదానం యొక్క పూర్వ నామం గోవాలియ టాంక్ మైదానం.ఇక్కడే జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ క్విట్ ఇండియా కి పిలుపునిచ్చాడు.ఈ మైదానంలోనే ఆగస్టు 8న సత్యాగ్రహంతో చావో-బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఉద్యమంమీద ఆయన నమ్మకానికి మచ్చుతునక. ఆ ఉపన్యాసంలో ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటీష్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని పిలుపునిచ్చారు.తరువాత ఈ మైదానం యొక్క పేరును క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆరంభించిన నెల అయిన ఆగస్టు నెల మీదుగా ఆగస్టు క్రాంతి గా మార్చడం జరిగింది.

ప్రయాణ మార్గం

మార్చు

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ నుండి సాయంత్రం 05గంటల 40నిమిషాలకు 12953 నెంబరుతో బయలుదేరి సూరత్,వడోదర్,కోట,సవాయ్ మాధోపూర్,మధుర లమీదుగా హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ మరుసటి రోజు ఉదయం 10గంటల 55నిమిషాలకు చేరుతుంది. ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 04గంటల 50నిమిషాలకు 12954 నెంబరుతో బయలుదేరి మరునాడు ఉదయం 09గంటల 45నిమిషాలకు ముంబై సెంట్రల్ చేరుతుంది. ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ తన మార్గంలో మహారాష్ట్ర,గుజరాత్,రాజస్థాన్,మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,హర్యానా,ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.

కోచ్ల అమరిక

మార్చు

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1మొదటి తరగతి ఎ.సి భోగీ,2 రెండవ తరగతి ఎ.సి భోగీలు,11 మూడవ తరగతి ఎ.సి భోగీలు,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
EOG ఎ5 ఎ4 ఎ3 ఎ2 ఎ1 హెచ్1 PC బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG  

సమయ సారిణి

మార్చు
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MMCT ముంబై సెంట్రల్ ప్రారంభం 17:40 0.0 1
2 ADH అంధేరీ 18:02 18:03 1ని 17.1 1
3 BVI బోరవెలి 18:16 18:19 3ని 29.5 1
4 VAPI వాపి 19:40 19:42 2ని 168.0 1
5 BL వల్సాడ్ 20:02 20:05 3ని 194.2 1
6 ST సూరత్ 20:50 20:55 5ని 263.2 1
7 BH బారూచ్ జంక్షన్ 21:32 21:33 1ని 322.4 1
8 BRC వడోదర 22:21 22:31 10ని 392.9 1
9 DHD దాహోడ్ 00:37 00:39 2ని 539.8 2
10 RTM రత్లం జంక్షన్ 02:18 02:20 2ని 653.4 2
11 KOTA కోట 05:10 05:20 10ని 920.4 2
12 SWM సవాయ్ మధోపూర్ 06:26 06:28 2ని 1028.1 2
13 MTJ మధుర 09:00 09:02 2ని 1244.5 2
14 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 10:55 గమ్యం 1378.5 2

ట్రాక్షన్

మార్చు

ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన సమయంలో ముంబై సెంట్రల్ నుండి వడోదర వరకు కల్యాణ్ లోకోషెడ్ అధారిత WCAM 2/2P లోకో ఇంజన్లను ఉపయోగించేవారు.అక్కడినుండి ఘజియాబాద్ లేదా వడోదర లోకోషెడ్ల అధారిత WAP 5 లేదా WAP 7 ఇంజన్లను హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉపయోగించేవారు. 2012 వ సంవత్సరంలో పశ్చిమ రైల్వే జోన్ 1500v DC ట్రాక్షన్ ను 25000v AC ట్రాక్షన్ గా మర్చడంతో ఇంజన్ల్ను మార్చకుండానే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరడం వీలయింది.ప్రస్తుతం ముంబై సెంట్రల్ నుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు వడోదర లోకోషెడ్ అధారిత WAP 7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html