జరదొడ్డి సుధాకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

జరదొడ్డి సుధాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జరదొడ్డి సుధాకర్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 06 మే 1974
ఎస్‌హెచ్‌ ఎర్రగుడి గ్రామం, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బాలనాగమ్మ, ఆనందం
జీవిత భాగస్వామి విజయలలిత
సంతానం శుక్రుత, సాకేత్‌ ఆనంద్‌

జననం, విద్యాభాస్యం మార్చు

జరదొడ్డి సుధాకర్ 06 మే 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, క్రిష్ణగిరి మండలం, ఎస్‌హెచ్‌ ఎర్రగుడి గ్రామంలో బాలనాగమ్మ, ఆనందం దంపతులకు జన్మించాడు. ఆయన బీడీఎస్‌ (యుహెచ్‌ఎస్‌), ఎండీఎస్‌ (ఉస్మానియా) నుండి పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్ బాబు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై 36045 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  3. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  4. Sakshi (2019). "కోడుమూరు నియోజకవర్గం విజేత 2019". Archived from the original on 6 జనవరి 2022. Retrieved 6 January 2022.