జలాశయంను ఆంగ్లంలో రిజర్వాయర్ అంటారు. రిజర్వాయర్ అనే పదం ఫ్రెంచ్ పదాల నుంచి ఉద్భవించింది (etymology: from French réservoir a "storehouse"). రిజర్వాయర్ అనేది మానవ నిర్మిత కృత్రిమ సరస్సు, నీటిని నిల్వ ఉంచే కొలను లేదా ఆనకట్టను ఉపయోగించి నిల్వ ఉంచిన నీరు. జలాశయాలను సాగునీరు, తాగునీరు కొరకు ఉపయోగిస్తారు. రిజర్వాయర్లు నది లోయలలో ఆనకట్టలు నిర్మించడం ద్వారా రూపొందిస్తారు లేదా భూమిలో తవ్వకం ద్వారా తయారు చేస్తారు లేదా ఇటుక పనితనము లేదా పోత కాంక్రీటు వంటి సంప్రదాయ నిర్మాణ పద్ధతులు ద్వారా నిర్మిస్తారు. అంతేకాకుండా రిజర్వాయర్ అనే పదం సహజంగా సంభవించే భూగర్భ జలాశయాలను అనగా భూగర్భంలో ఉండే నూనె లేక నీటి బావులను వివరించడానికి ఉపయోగిస్తారు

చరిత్రసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

చెరువు

సరస్సు

మూలాలుసవరించు


బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జలాశయము&oldid=2880677" నుండి వెలికితీశారు