జాంజ్‌గిర్ చంపా జిల్లా

ఛత్తీస్గఢ్ లోని జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 27 జిల్లాలలో జాంజ్‌గిర్- చంపా జిల్లా ఒకటి. అలాగే రాష్ట్రంలో తక్కువగా అభివృద్ధి చెందిన జిల్లాలలో ఇది ఒకటి. జిల్లాకేంద్రగా జాజ్ంజ్‌గిర్ పట్టణం ఉంది. కుల్చురీ సామ్రాజ్యానికి చెందిన మహారాజా జాజ్వల్యదేవ్ రాజ్యంలో జాంజ్‌గిర్- చంపా ఒక నగరం. ఇది గతంలో బిలాస్‌పూర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1998లో జాంజ్‌గిర్ జిల్లా ఏర్పాటు చేసినప్పుడు సరికొత్తగా రూపొందించబడిన జిల్లాకు పేరు నిర్ణయించే విషయంలోరాజకీయంగా వివాదాలు తలెత్తాయి. అందువలన ఈ జిల్లాకు రెండు పేర్లను ఒకటిగా చేర్చి జాంజ్‌గిర్- చంపా అని నామకరణం చేసారు. జిల్లాలో నివసించేవారు అధికంగా సమీపగ్రామాల నుండి వసలస వచ్చి స్థిరపడిన వారే.

జాంజ్‌గిర్ చంపా జిల్లా
जांजगीर-चाम्पा जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో జాంజ్‌గిర్ చంపా జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో జాంజ్‌గిర్ చంపా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంజాంజ్‌గిర్
మండలాలు10
Government
 • లోకసభ నియోజకవర్గాలు1
 • శాసనసభ నియోజకవర్గాలు6
విస్తీర్ణం
 • మొత్తం3,853 కి.మీ2 (1,488 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం16,20,632
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
 • Urban
2,25,199
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.7%
 • లింగ నిష్పత్తి986
సగటు వార్షిక వర్షపాతం1157.1 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
జంజ్‌గిర్లోని ఆలయం

చరిత్ర

మార్చు

జాంజ్‌గిర్ జిల్లా 1998 మే 25న స్థాపించబడింది. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి హృదయం వంటిదని భావిస్తుంటారు. ఇది రాష్ట్రానికి మధ్యభాగంలో ఉండడమే ఇందుకు కారణం. ఈ జిల్లా గత వైభవాన్ని స్వర్ణయుగానికి విష్ణుమందిరం సాక్ష్యంగా ఉంది.

భౌగోళికం

మార్చు

జిల్లా ప్రజల జీవన ఉపాధికి సహకరించడానికి అనుకూలంగా " ది హస్డియో - బాంగో " ప్రాజెక్ట్ ద్వారా కాలువ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా జిల్లాలోని 0.75% వ్యవసాయభూములకు నీటిపారుదల వసతి కల్పించబడింది. జాంజ్‌గిరి చంపా నగరం జాతీయరహదారి 49 పక్కన ఉంది. జాంజ్‌గిరి చంపా రహదారి మార్గంద్వారా బిలాస్‌పూర్కు 43 కి.మీ, రాష్ట్రరాజధాని రాయగఢ్కు 152కి.మీ దూరంలో ఉంది.

విభాగాలు

మార్చు
  • 'జాంజ్‌గిర్ - చంపా జిల్లా 5 ఉపవిభాగాలుగా విభజించబడింది: చంపా, దభరా, జాంజ్‌గిర్, పాంగర్, శక్తి.
  • జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి : అకల్తర, బలోడా, చంపా, దభరా, జైజైపూర్, జాంజ్‌గిర్, మల్ఖరోడా, నవగర్, పంగర్, శక్తి.
  • జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి : అకలతర, బలోడా, బంహిందిహ్, చంపా, చంద్రపూర్, దభర, హసొద్, జైజైపుర్, జాంజ్‌గిర్, మల్కరొడా, నవగర్, పంగర్, రాహిద్, శక్తి, షివారినారాయణ్.
  • జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి : అకలతర, బలోడా, బంహిందిహ్, దభర, జైజైపూర్, మల్ఖరొడ, నవగర్, పంగర్, శక్తి.[1]

ఆర్ధికరంగం

మార్చు

జాంజ్‌గిర్ జిల్లా వ్యవసాయం, వ్యాపారాలకు కేంద్రం. జాంజ్‌గిర్ జిల్లా రాష్ట్రంలో ఆహారధాన్యం అధికంగా జిల్లాగా గుర్తింపు పొందింది.జిల్లా మారెట్ వ్యవసాయ ఉత్పత్తులు, తోట ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. జిల్లాలో సున్నపురాయి కూడా అధికంగా లభిస్తుంది.

భారతదేశంలో జాంజ్‌గిరి జిల్లా త్వరితగతిలో అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటి. జిల్లాలో 52 పవర్ ప్లాంటులు ఆరంభించబడ్డాయి. దేశంలో జాంజ్‌గిరి విద్యుదుత్పత్తి కేంద్రంగా అభివృద్ధిచెందుతూ ఉంది. జాంజ్‌గిరి దేశంలోని ఇతర ప్రాంతాలకు 15-20 వేల మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. జిల్లాలో ప్రధాన ప్రైవేట్ విద్యుదుత్పత్తి కేంద్రమైన వార్ధా పవర్ ప్లాంటు (6 x 600 మెగావాట్లు) కు 2 శాఖలు ఉన్నాయి. ఇది ఆసియాలో బృహత్తర పవర్ ప్లాంటుగా గుర్తింపు పొందింది. అలాగే జిల్లాలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.

ప్రయాణసౌకర్యాలు

మార్చు

రైల్వే

మార్చు

రైల్వే రవాణా

మార్చు

జిల్లా ప్రధాన కేంద్రము, రాష్ట్ర రాజధాని అయిన జంజ్ గిర్ పట్టణం దక్షిణ-తూర్పు రైల్వేలోని హౌరా-ముంబయి ప్రధాన మార్గము పైన యున్నది. ఇది రాయి పూరుకు 152 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో ప్రధాన రైల్వే స్టేషనులు [[చంపా, చత్తీస్ ఘర్-చంపా]], నైలా, అకల్తార. జంజ్ గిర్ లోవున్న రైల్వే స్టేషను పేరు నైలా. ఈ పట్టణ ప్రాంత ప్రజలు ఈ స్టేషను పేరును జంజ్ గిర్ గా మార్చమని చాల కాలంనుండి ఆందోళన చేస్తున్నారు.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,620,632, [2]
ఇది దాదాపు. గునియా బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 308వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 421 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.01%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 991:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.7%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

సంస్కృతి

మార్చు

జిల్లాలో వైష్ణవ సంప్రదాయం ప్రతిబింబించే కళాత్మకమైన విష్ణుమందిరం ఉంది.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

జాంజ్‌గిర్ నగరం పురాతన ఙాపకాలకు చిహ్నంగా నిలిచింది.

  • జాంజ్‌గిర్ నగరంలో క్రైస్తవ మిషనరీకి చెందిన " అన్నీ ఫంక్ " నివాసం ఉంది. అన్నీ ఫంక్ టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది. ఆమె ఇల్లు ఇప్పుడు నిర్జనంగా ఉన్నా పలువురు పర్యాటకులు ఇప్పటికీ ఈ శిథిల నివాసాన్ని సందర్శిస్తూనే ఉన్నారు.
  • తరువాత పర్యాటకులు అధికంగ దర్శించే ఆలయాలలో " నహారియా బాబా ఆలయం " ఒకటి. ఈ ఆలయంలోని ప్రధాన దైవం హనుమంతుడు.
  • జాంజ్‌గిర్ ఆలయానికి సమీపంలో ఉన్న సుకలి గ్రామం మధ్యలో ఉన్న దుర్గాదేవి ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది.
  • ఖోఖ్రాలో ఉన్న మంకాదేవి ఆలయం ప్రశాంతమైన ప్రదేశం. ఇది జిల్లాలోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి ఇరువైపులా 2 నీటి మడుగులు ఉన్నాయి.
  • మదంపూర్గర్, రిషబ్‌తీర్ధ్, విష్ణు ఆలయం ప్రధానమైనవి.
  • షివారినారాయణన్, పితంపూర్ వద్ద ఉన్న కాళేశ్వర్‌నాథ్, చంద్రపూర్ వద్ద ఉన్న చంద్రహాసిని ఆలయం, అభభర్ వద్ద ఉన్న అష్టభుజి, ఖరోడ్ వద్ద ఉన్న అష్టభుజి ఆలయం.

విద్య

మార్చు

కళాశాలలు

మార్చు
  • చేనేత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ చంపా
  • గవర్నమెంటు . ఎం.ఎం.ఆర్. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్, చంపా
  • టి, సి.ఎల్ గవర్నమెంటు కళాశాల, జాంజ్గిర్
  • గవర్నమెంటు . పాలిటెక్నిక్ కళాశాల, జాంజ్గిర్
  • జాజ్వల్యదేవ్ గవర్నమెంటు . నవీన్ గర్ల్ కాలేజ్ జాంజ్గిర్
  • గవర్నమెంటు. ఇంజినీరింగ్ కళాశాల, జాంజ్గిర్
  • శాంతి స్కూల్, చంపా ప్రిన్స్.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "About District: Administrative Information". Janjgir–Champa District. Archived from the original on 2012-10-15. Retrieved 20 జూలై 2014.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

వెలుపలి లింకులు

మార్చు



[[వర్గం:జాంజ్‌గిర్ - చంపా జిల్లా| ]]