బిలాస్పూర్
బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న నగరం. దీన్ని "ఉత్సవాల నగరం" అని పిలుస్తారు. ఇది బిలాస్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం, బిలాస్‌పూర్ డివిజన్‌కు యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు, బిలాస్‌పూర్ లోని బోద్రి వద్ద ఉంది, దీనిని రాష్ట్రంలోని న్యాయధానీ (లా క్యాపిటల్) అని అంటారు. ఈ నగరం ఈశాన్య ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి వాణిజ్య కేంద్రం. ఇది భారతీయ రైల్వే కు చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ (SECR) కు, బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌కూ ప్రధాన కార్యాలయం. బిలాస్‌పూర్ రైల్వే స్టేషను భారతదేశంలో 3 వ పరిశుభ్రమైనది, 4 వ అత్యంత పొడవైన ప్లాట్‌ఫారం కలిగిన రైల్వే స్టేషన్.
బిలాస్‌పూర్ | |
---|---|
మెట్రోపాలిటన్ నగరం | |
ఉత్సవాల నగరం | |
Nickname: న్యాయధాని | |
Coordinates: 22°05′N 82°09′E / 22.09°N 82.15°E | |
దేశం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | బిలాస్పూర్ |
విస్తీర్ణం | |
• మెట్రోపాలిటన్ నగరం | 137 కి.మీ2 (53 చ. మై) |
• Rank | 2nd |
Elevation | 207 మీ (679 అ.) |
జనాభా | |
• Rank | 137th |
• Urban | 6,89,154 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 495XXX |
Telephone code 31221Bold text | 07752 |
Vehicle registration | CG-10 |
బిలాస్‌పూర్ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం కూడా. NTPC నిర్వహిస్తున్న అతిపెద్ద పవర్ ప్లాంటు సీపట్‌లో ఉంది. సీపట్‌లోని పవర్‌గ్రిడ్ ఈ ప్రాంతంలోని ఇతర విద్యుత్ ప్లాంట్ల నుండి విద్యుత్తును పూల్ చేస్తుంది. HVDC లైన్ ద్వారా ఢిల్లీకి విద్యుత్తును సరఫరా చేస్తుంది.
బిలాస్పూర్ 100 భారతీయ నగరాల్లో ఒకటి ఒక అభివృద్ధి ఉంది స్మార్ట్ నగరం క్రింద స్మార్ట్ నగరాలు మిషన్ . [1]
చరిత్ర
మార్చుచారిత్రికంగా బిలాస్పూర్, రత్నాపూర్‌కు చెందిన కాలచూరి రాజవంశ పాలనలో ఉండేది. అయితే, 1741 లో మరాఠా సామ్రాజ్యం పాలనలో మరాఠా అధికారి ఇక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నపుడు ఈ నగరం ప్రాచుర్యం పొందింది.
గురు ఘాసీదాస్ (1756-1836) 1820, 1830 మధ్య సోనాఖన్ అటవీ ప్రాంతంలో సత్నామీ (సత్నాం ఆరాధకులు అని అర్ధం) అనే ఒక మత ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. దేవుడు సత్యానికి పర్యాయపదమని అతను నొక్కి చెప్పాడు. బిలాస్‌పూర్‌లోని విశ్వవిద్యాలయానికి అతని పేరిట గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయంగా అని పేరు పెట్టారు .
బెంగాల్ నాగపూర్ రైల్వే రాకతో 1880–90 దశాబ్దంలో బిలాస్‌పూర్ రైలు వచ్చింది. 1888 లో మిస్త్రీ జగ్మల్ గాంగ్‌జీ, ఇతర మిస్త్రీ రైల్వే కాంట్రాక్టర్లు రాజ్ నంద్ గావ్ నుండి ఇక్కడీకి మొదటి రైలు మార్గం వేసారు. అదే ఏడాది తోటి లో కుచ్చి కాంట్రాక్టర్ ఖోడా రాంజీ తదితరులు బిలాస్పూర్ నుండి ఝార్సుగూడాకు రైలు మార్గం, చంపా నదిపై వంతెనతో సహా, నిర్మించారు.
1890 లో, ప్రస్తుత రైల్వే స్టేషన్ను, గుజరాతీ రైల్వే కాంట్రాక్టర్ జగ్మల్ గాంగ్జీ నిర్మించాడు. అతని కుమారుడు ముల్జీ జగ్మల్ సవారియా, పట్టణం అభివృద్ధికి, రైల్వేల, జిల్లా అభివృద్ధికీ చేసిన కృషికి గాను బ్రిటిషు వారు "రావు సాహిబ్" బిరుదును ఇచ్చారు. నగరంలో జగ్మల్ బ్లాక్, జగ్మల్ చౌక్ అనే పేర్లు జగ్మల్ గంగ్జీ సవారియా పేరిట వచ్చాయి.
1901 లో, బిలాస్‌పూర్ జనాభా 18,937. ఇది బ్రిటిష్ ఇండియాలోని సెంట్రల్ ప్రావిన్స్‌లలో ఎనిమిదవ అతిపెద్ద పట్టణం. 1908 నాటికి, తాసార్ పట్టు, పత్తి దుస్తులను నేయడం బిలాస్‌పూర్ లోని ప్రధాన పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి.
భౌగోళికం
మార్చుబిలాస్పూర్ 22°05′N 82°09′E / 22.09°N 82.15°E వద్ద, [2] సముద్రమట్టం నుండి సగటున 264 మీటర్ల ఎత్తున ఉంది.
బిలాస్‌పూర్ వర్షాధారమైన అర్పా నది ఒడ్డున ఉంది. ఇది మధ్య భారతదేశంలోని మైకాల్ పర్వతాల్లో ఉద్భవించింది. ఇది డోలమైట్ సమృద్ధిగా లభించే ప్రాంతం. దీనికి ఉత్తరాన దట్టమైన అడవులు, తూర్పున హస్దేవ్ లోయ బొగ్గు గనులూ ఉన్నాయి.
శీతోష్ణస్థితి
మార్చుశీతాకాలంలో శీతోష్ణస్థితి ఆహ్లాదకరంగా, తేలికగా ఉంటుంది (కనిష్ట ఉష్ణోగ్రత 10°C). వర్షాకాలంలో మధ్యస్థంగా వర్షాలు కురుస్తాయి. వేసవికాలాలు సాపేక్షంగా వేడిగా, పొడిగా ఉంటాయి, గరిష్ట ఉష్ణోగ్రత 45 °C మించుతుంది.
జనాభా
మార్చు2011 జనగణన ప్రకారం, బిలాస్‌పూర్ మునిసిపల్ కార్పొరేషను పరిధి లోని జనాభా 3,65,579.[3] బిలాస్‌పూర్ పట్టణ ప్రాంత జనాభా 4,52,851 . [4] జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. బిలాస్‌పూర్ సగటు అక్షరాస్యత 91.29%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 92.94% స్త్రీల అక్షరాస్యత 88.33%. జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 15% ఉన్నారు. 2019 ఆగస్టులో, ప్రక్కనే ఉన్న 18 పట్టణాలు, ఉప పట్టణ ప్రాంతాలను బిలాస్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో చేర్చారు.
నగర ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలు ఛత్తీస్‌గఢీ, హిందీ, ఇంగ్లీషు, ఒడియా .
వాతావరణ వివరాలు
మార్చుశీతోష్ణస్థితి డేటా - Bilaspur | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 23 (73) |
25 (77) |
30 (86) |
35 (95) |
40 (104) |
38 (100) |
28 (82) |
27 (81) |
28 (82) |
28 (82) |
25 (77) |
23 (73) |
29 (84) |
సగటు అల్ప °C (°F) | 10 (50) |
12 (54) |
16 (61) |
21 (70) |
30 (86) |
26 (79) |
22 (72) |
22 (72) |
21 (70) |
17 (63) |
12 (54) |
10 (50) |
18 (65) |
సగటు అవపాతం mm (inches) | 20 (0.8) |
30 (1.2) |
20 (0.8) |
20 (0.8) |
20 (0.8) |
200 (7.9) |
370 (14.6) |
360 (14.2) |
200 (7.9) |
70 (2.8) |
10 (0.4) |
0 (0) |
1,320 (52.2) |
Source: Bilaspur Weather |
రవాణా వ్యవస్థ
మార్చురైలు
మార్చుబిలాస్పూర్ రైల్వే స్టేషను రైలు రవాణా వ్యవస్థకు ప్రాంతీయ కేంద్రంగా ఉంది.
బిలాస్‌పూర్ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత రద్దీగా ఉండే జంక్షను. ఇటార్సీ తర్వాత మధ్య భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షను ఇదే. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లలో సూరత్, రాజ్‌కోట్ తర్వాత 3 వ స్థానంలో ఉంది. బిలాస్‌పూర్, ఆగ్నేయ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం.
ఇక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కటి రైలు సౌకర్యాలున్నాయి. గోరఖ్‌పూర్, కొల్లం, ఖరగ్‌పూర్ తర్వాత బిలాస్‌పూర్ రైల్వే స్టేషనులో భారతదేశంలో 4 వ పొడవైన రైల్వే ప్లాట్‌ఫారం ఉంది. భొపాల్ గుండా వెళ్ళే బిలాస్‌పూర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు సార్లు నడుస్తుంది. ఈ స్టేషను హౌరా-నాగ్‌పూర్-ముంబై లైన్‌లో టాటానగర్-బిలాస్‌పూర్ సెక్షన్‌లో ఉంది. ఈ జంక్షను గుండా వెళ్ళే మరొక మార్గం కట్నీ మీదుగా ఢిల్లీ వైపు వెళ్తుంది.
రోడ్డు
మార్చుబిలాస్పూర్కు జాతీయ రహదారుల ద్వారా ముంబై, కోల్‌కతాలతో రోడ్డు సౌకర్యం ఉంది. జాతీయ రహదారి-130 బిలాస్‌పూర్‌ను రాయ్‌పూర్, అంబికాపూర్ లతో కలుపుతుంది. జాతీయ రహదారి-49 బిలాస్‌పూర్ నుండి ప్రారంభమై ఖరగ్‌పూర్‌లో ముగుస్తుంది. మరో జాతీయ రహదారి 130 A కొత్తగా ప్రకటించారు. ఇది బిలాస్‌పూర్ నుండి మొదలై ముంగేలి, కవర్ధా మీదుగా పోడి కి వెళ్తుంది. జాతీయ రహదారి-45 బిలాస్‌పూర్‌ని జబల్‌పూర్, భోపాల్ లతో కలుపుతుంది. రాష్ట్ర రహదారులు SH 7, SH 5 లు కూడా నగరం గుండా వెళ్తాయి.
సమీపంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
వైమానిక
మార్చుసమీప వాణిజ్య విమానాశ్రయం బిలాస్‌పూర్ విమానాశ్రయం. ఇది నగరానికి దాదాపు 11 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, భోపాల్, జబల్‌పూర్, ప్రయాగ్‌రాజ్ లకు విమాన సేవలను ప్రకటించారు.
చకర్‌భట్టలోని ఈ విమానాశ్రయం విఐపిలకు, సైనిక కార్యకలాపాలకూ కూడా ఉపయోగిస్తారు.
పర్యాటక ఆకర్షణలు
మార్చుబిలాస్పూర్లోని వివిధ పురావస్తు ప్రదేశాలు, దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రఖ్యాత పర్యావరణ పర్యాటక ప్రదేశాలలో అచనక్మార్ వన్యప్రాణుల అభయారణ్యం ఒకటి. హస్‌దేవ్ బాంగో డ్యామ్ బిలాస్‌పూర్ నుండి 105 కి.మీ. దూరంలో ఉంది. మల్హర్, రతన్పూర్ లు పురావస్తు శాస్త్రానికి కేంద్రం. పురాతన దేవాలయాలు, కోటల శిధిలాలు ఇక్కడ కనిపిస్తాయి.
తాళగ్రామ్ "దేవరాణి-జెథానీ" దేవాలయానికి స్థానం. బబుల్ ఐలాండ్, రాధిక వాటర్ పార్క్ స్థానిక ప్రజలను, పర్యాటకులను అలరించే పార్కులు. బెల్పాన్‌లో ఒక పెద్ద చెరువుతో పాటు సమాధి కూడా ఉంది . ఖుతాఘాట్ అడవులు, ఆనకట్ట, కొండలతో ఒక సుందరమైన ప్రదేశం.
బిలాస్‌పూర్ అర్పా ఒడ్డున ఉంది. లీలాగర్, మణియారి జిల్లాలోని ఇతర చిన్న నదులు. లోయలు, కొండలు, అటవీప్రాంతంలో విశాలమైన దృశ్యాన్ని అందించే మరొక పర్యాటక ఆకర్షణ సోన్ముడా. సోన్ముడా నుండి సోన్ నది ఉద్భవించింది. బిలాస్‌పూర్ లోను, చుట్టుపక్కలా ఉన్న ఆసక్తికరమైన ప్రదేశాలు:
- చారిత్రక ప్రాముఖ్యత కలిగిన మల్హార్. దీనిని చైనా చరిత్రకారుడు జువాన్జాంగ్ సందర్శించారు. ఇది బిలాస్‌పూర్ నుండి రోడ్డు మార్గంలో 40 కి.మీ. దూరంలో ఉంది. మల్హార్‌లో, పాతాళేశ్వర్ దేవాలయం, దేవ్రి దేవాలయం, దిండేశ్వరి ఆలయం వంటి అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. నాలుగు చేతుల విష్ణువు విగ్రహం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మల్హార్‌లో మ్యూజియం కూడా ఉంది.
- అమర్‌కంటక్: నర్మదా నది, సోన్ నదులు అమర్‌కంటక్ నుండి ఉద్భవించాయి.
- కనన్ పెండారి జూ. (నగర పరిధిలో)
- తాలా, నగరం నుండి 20 కి.మీ దూరంలో ఉంది. ఇది రుద్ర శివునికి ప్రసిద్ధి.
- రతన్పూర్ మహామాయ దేవాలయం రామ్ టెక్రి మందిర్.
- టిఫ్రా ఓవర్ బ్రిడ్జి (భారతీయ నగర్) దగ్గర శ్రీ అయ్యప్ప మందిర్ (సాని దోష హారక్).
- ముంగేలి మా మహామాయ దేవాలయం.
- పాలి - మహాదేవ్ ఆలయం
- ఆనకట్టలు ఖుడియా ఆనకట్ట, లోర్మి, ఖుతాఘాట్ ఆనకట్ట, రతన్పూర్.
- రాణి సతి ఆలయం, బిలాస్‌పూర్ నగరంలో మార్వాడీలు నిర్మించిన మతపరమైన ఆలయం
- రెండు వినోద పార్కులు కూడా ఇక్కడ ఉన్నాయి. (బబుల్ ఐలాండ్, రాధిక వాటర్ పార్క్)
విద్యా సౌకర్యాలు
మార్చుబిలాస్పూర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ల పోటీ పరీక్షలకు సిద్ధంఅయ్యేందుకు బిలాస్‌పూర్‌కు వస్తారు. 2012 నాటికి బిలాస్‌పూర్‌లో 5 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. బిలాస్‌పూర్‌లో ఉన్న వివిధ విద్యాసంస్థల వివరాలు:
విశ్వవిద్యాలయాలు
మార్చు- గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయ - సెంట్రల్ యూనివర్సిటీ
- బిలాస్‌పూర్ విశ్వవిద్యాలయం - శ్రీ అటల్ బిహారీ అటల్ వాజ్‌పేయి విశ్వవిద్యాలయం
- పండిట్ సుందర్‌లాల్ శర్మ (ఓపెన్) యూనివర్సిటీ
- డాక్టర్ సివి రామన్ విశ్వవిద్యాలయం
- మహర్షి యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
గ్రాడ్యుయేట్ కళాశాలలు
మార్చు- ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గురు గాసిదాస్ యూనివర్సిటీ
- ప్రభుత్వం బిలాస బాలికల PG కళాశాల, బిలాస్‌పూర్
- ప్రభుత్వం E. రాఘవేంద్రరావు PG సైన్స్ కళాశాల ('A' గ్రేడ్)
- ఛత్తీస్‌గఢ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
- ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, బిలాస్‌పూర్
- SLT ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, గురు ఘసిదాస్ యూనివర్సిటీ
- ఠాకూర్ చెడిలాల్ బారిస్టర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ & రీసెర్చ్ స్టేషన్, బిలాస్‌పూర్
- న్యూ హారిజన్ డెంటల్ కాలేజి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- CM దూబే పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, బిలాస్‌పూర్
- ప్రభుత్వం బిలాస బాలికల PG కళాశాల, బిలాస్‌పూర్
ఆర్థిక వ్యవస్థ
మార్చుబిలాస్పూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. బిలాస్‌పూర్ పరిసర ప్రాంతాలు 10,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. బిలాస్‌పూర్ చుట్టుపక్కల ఉన్న మూడు ప్రతిపాదిత రైల్వే కారిడార్లలో రూ .5,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఇంధన రంగ సంస్థలు సిద్ధంగా ఉండడంతో రైల్వే పెద్ద ఊపును పొందింది. [5]
బిలాస్‌పూర్ వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం. నగర పరిసర ప్రాంతంలో సుమారు 500 ధాన్యం, పప్పు మిల్లులు ఉన్నాయి. భారతీయ రైల్వేల 17 జోన్లలో బిలాస్‌పూర్ (సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే) అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే జోన్. బిలాస్‌పూర్ రైల్వే జోన్‌లో బిలాస్‌పూర్, నాగపూర్, రాయ్‌పూర్ విభాగాలు ఉన్నాయి.
ప్రభుత్వ రంగం లోని మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ప్రధాన కార్యాలయం బిలాస్‌పూర్‌లో ఉంది. SECL అనేది బొగ్గు మంత్రిత్వ శాఖ క్రింద ఒక మినీరత్న సంస్థ. దీనికి 1997-98లో ఉత్తమ PSU పురస్కారం లభించింది.
హైటెక్ వాటర్ ప్యూరిఫయర్ సిస్టమ్, సరైన డ్రైనేజీ సౌకర్యాలు, పరిశుభ్రతతో సహా అనేక మౌలిక పౌర సదుపాయాల అభివృద్ధికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తీంది. వచ్చే ఏడు సంవత్సరాలలో బిలాస్‌పూర్ జిల్లాలోని అర్పా నదీ తీరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .2,000 కోట్ల ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. దీని కోసం, బిలాస్‌పూర్ నగరానికి సమీపంలో ఉన్న అర్పా నది తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 'ప్రత్యేక ప్రాంత అభివృద్ధి సంస్థ' (SADA) ని ఏర్పాటు చేసి, చర్యలు చేపట్టింది.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు బిలాస్‌పూర్‌లో కలిగి ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద కోర్టు ఆవరణ.
- పరిశ్రమలు: బిలాస్పూర్ చుట్టూ, టిఫ్రా, సిర్గిట్టి సిల్పహ్రీ పారిశ్రామిక వృద్ధి కేంద్రాలతో సహా అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. సిర్గిట్టి పారిశ్రామిక కేంద్రం సుమారుగా 338 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాదాపు 324 పరిశ్రమలతో ఇది 4431 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. సిలాపహరి పారిశ్రామిక కేంద్రం అనేక స్పాంజ్ ఇనుము పరిశ్రమలకు నిలయం. బిలాస్‌పూర్ నగర శివార్లలో ఉన్న టిఫ్రా పారిశ్రామిక ప్రాంతం సుమారుగా 65 హెక్టార్లలో విస్తరించి ఉంది. అనేక రసాయన, PVC పాదరక్షలు, HDPE నేసిన బస్తాలు, పాలిథిన్ సంచులు, షీట్లు, శీతల పానీయాలు, ఇతర యూనిట్లు ఇక్కడ ఉన్నాయి.
- విద్యుత్ ప్లాంట్లు - భారతదేశంలో రెండవ అతిపెద్ద NTPC పవర్ ప్లాంటు బిలాస్‌పూర్ స్సమీపం లోని సీపట్‌లో ఉంది. ఇది 2980 మెగావాట్ల సామర్థ్యం కలది. బిలాస్‌పూర్ పరిసర ప్రాంతంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లలో నోవా, KSK, గీతాంజలి, మహానది మొదలైనవి కూడా గుర్తించదగినవి.
మూలాలు
మార్చు- ↑ "Why only 98 cities instead of 100 announced: All questions answered about smart cities project". firstpost.com. 28 August 2015. Retrieved 25 November 2016.
- ↑ Falling Rain Genomics, Inc – Bilaspur
- ↑ "Bilaspur City Population Census 2011". www.realtimes.in. Archived from the original on 25 November 2018.
- ↑ "Table 3 PR UA Citiees 1Lakh and Above" (PDF). Census of India.
- ↑ http://indiatoday.intoday.in/story/cash-strapped-railways-gets-big-coal-boost/1/203474.html