అరుంధతీయ

(జాంభవులు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 5వ[1] కులం. దళితుల్లో ఉపకులస్తులైన అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లును అమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అరంధతీయులకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. మొత్తం దళితులకు 18 శాతం రిజర్వేషన్‌ ఉండగా అందులో అరుంధతీయులకు 3 శాతం వర్తింపచేశారు. జాంబవులు అనేది భారత ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డుకులాల జాబితాలో 29 వ కులం గా కనిపిస్తుంది,[2] జాంభవులు, జాంబవాన్, అరుంధతీయ, అరుంధతీయులు అని వివిధ పేర్లతో పిలిచే షెడ్యూల్డు కులాల్లోని ఒక ఉపకులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కులస్థులు కనిపిస్తున్నారు. వీరు షెడ్యూల్డుకులాల జాబితాలో ఉన్నారు.[3] వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. అయితే, మాదిగలకు పూజారులుగా వ్యవహరించేవారు. సాంస్కృతికంగా వీరికి చాలా చరిత్ర ఉంది. రామాయణంలో జాంబవంతుడుని వీరి వంశపురుషుడుగా చెప్పుకుంటారు. జాంబవపురాణం వీరి జీవితవిశేషాల్ని తెలుపుతుంది.

అరుంధతీయ కులం వంశపురుషునిగా భావించే జాంబవంతుడు

మూలాలు

మార్చు
  1. [భారత ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డుకులాల జాబితాhttp://socialjustice.nic.in/writereaddata/UploadFile/Scan-0001.jpg]
  2. http://socialjustice.nic.in/writereaddata/UploadFile/Scan-0001.jpg
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-18. Retrieved 2016-11-20.
"https://te.wikipedia.org/w/index.php?title=అరుంధతీయ&oldid=3866145" నుండి వెలికితీశారు