జాకీ క్లార్క్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

జాక్వెలిన్ క్లార్క్ (జననం 1963, మార్చి 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఎడమచేతి ఓపెనింగ్ బ్యాటర్‌గా రాణించింది.[1]

జాకీ క్లార్క్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాక్వెలిన్ క్లార్క్
పుట్టిన తేదీ (1963-03-14) 1963 మార్చి 14 (వయసు 61)
న్యూ ప్లైమౌత్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 82)1984 జూలై 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1985 ఫిబ్రవరి 7 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1992 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81–1989/90సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1990/91–1994/95వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 11 31 60 67
చేసిన పరుగులు 482 875 2,545 1,644
బ్యాటింగు సగటు 26.77 29.16 29.59 24.90
100లు/50లు 0/2 0/7 2/11 0/12
అత్యుత్తమ స్కోరు 79 85 119* 85
వేసిన బంతులు 6 270 12
వికెట్లు 0 8 0
బౌలింగు సగటు 18.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/2
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 5/– 19/– 11/–
మూలం: CricketArchive, 6 May 2021

క్రికెట్ రంగం మార్చు

1984 - 1992 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 11 టెస్ట్ మ్యాచ్‌లు, 31 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఇందులో 1988 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ తరపున ఆడింది.[2][3] సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[4]

1984 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ అరంగేట్రంలో, క్లార్క్ రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగులతో న్యూజీలాండ్ టాప్ స్కోరర్ గా నిలిచింది.[5] 1986 జనవరిలో ఆస్ట్రేలియా న్యూజీలాండ్‌లో మూడు-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ని ఆడినప్పుడు, క్లార్క్ న్యూజీలాండ్ తరపున ప్రతి మ్యాచ్‌లో 81, 59, 36 నాటౌట్‌లతో అత్యధిక స్కోరు చేసింది.[6] నెదర్లాండ్స్‌పై 85, ఐర్లాండ్‌పై 76తో సహా 44.33 సగటుతో 266 పరుగులతో 1988 మహిళల ప్రపంచ కప్‌లో అగ్రశ్రేణి స్కోరర్‌లలో క్లార్క్ ఒకరు.[7][8]

మూలాలు మార్చు

  1. McLeod, Marian (26 December 1987). "Stumping a myth". The Listener. pp. 26–28.
  2. "Jackie Clark". ESPN Cricinfo. Retrieved 13 April 2014.
  3. Bell, Jamie (2017-05-23). "The 1988 Women's Cricket World Cup | New Zealand Cricket Museum". NZ CRICKET MUSEUM (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 7 April 2020. Retrieved 2020-03-15.
  4. "Jackie Clark". CricketArchive. Retrieved 6 May 2021.
  5. "2nd Test, Worcester, July 14 - 17, 1984, New Zealand Women tour of England". Cricinfo. Retrieved 5 August 2022.
  6. "Australia Women in New Zealand 1985/86". Cricinfo. Retrieved 5 August 2022.
  7. Wisden 1990, p. 1139.
  8. "Batting and Fielding in Shell Bicentennial Women's World Cup 1988/89". CricketArchive. Retrieved 5 August 2022.

బాహ్య లింకులు మార్చు