కోటు
(జాకెట్ (కోటు) నుండి దారిమార్పు చెందింది)
కోటు లేదా జాకెట్ అనునది వెచ్చదనానికి గానీ ఫ్యాషన్ కి గానీ స్త్రీ పురుషులిరువురిచే సాధారణంగా షర్టు/టి-షర్టు పై ధరింప బడే ఒక వస్త్రం. బహు అరుదుగా కోటు షర్టు లేకుండా కూడా ధరిస్తారు. కోటు లలో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా వీటికి పొడవాటి చేతులున్ననూ స్లీవ్ లెస్ (చేతులు లేని) జాకెట్ లు కూడా లభ్యం.
కోటు లో రకాలు
మార్చు- సూటు: సూటులో భాగంగా గల కోటు ప్యాంటు కుట్తిన వస్త్రంతోనే కుట్టబది ఉంటుంది.
- బ్లేజరు : బ్లేజరు ఏ రంగులోనైనా ఉండవచ్చును. ఇది అసాంప్రదాయికం. ఒక్కోమారు బ్లేజరుని జీంసు ప్యాంటు పై కూడా వేస్తారు. కొన్ని బ్లేజర్లు జీంసుతో చేసినవి కుడా ఉంటాయి.
- నోర్ఫోక్ జాకెట్: వదులుగా ఉండే, బెల్టుగల, ముందు వైపు, వెనుక వైపు బాక్సు ప్లీటులు గల సింగిల్ బ్రెస్టెడ్ జాకెట్. పూర్వం ఇది బాగా జనాదరణ పొందినది. ఇప్పటికీ ఇంకా కొన్ని మిలిటరీ, పోలీసు యూనిఫారంలకి ఇదే ఉపయోగిస్తారు. వేట సమయంలో తుపాకీ పేల్చే సమయంలో మోచేతికి ఆడ్డం రాకుండా ఉండేట్లు దీనిని రూపొందించారు.
- డిన్నర్ కాలర్ జాకెట్
- షర్ట్ కాలర్ జాకెట్: ఈ జాకెట్కి ల్యాపెల్ కాకుండా షర్టు వలె కాలరు ఉంటుంది
- సింగిల్ బ్రెస్ట్: బొత్తాలు సరిగ్గా మధ్యన (చొక్కాకి ఉన్నట్టు) ఉన్నదానిని సింగిల్ బ్రెస్ట్ అంటారు
- డబుల్ బ్రెస్ట్: బొత్తాలు కొద్దిగా పక్కకు ఉన్నదానిని డబుల్ బ్రెస్ట్ అంటారు. అంటే కోటు ముందు భాగం, మొదట ఒక వైపు కప్పి దాని పై రెండవది కప్పి బొత్తా పెట్టటం. ఎక్కువ చలి ఉన్నప్పుడు డబులు బ్రెస్ట్ వాడతారు.
- బుష్ కోటు: బుష్ కోటుకి ముందు వైపు ఐదు బొత్తాలు ఉంటాయి. ఇంకనూ షోల్డర్ స్ట్రాప్స్, బాక్స్ ప్లీటులు గల నాలుగు ప్యాచ్ పాకెట్లు, నడుముకి వెనుక భాగంలో రెండు వెంట్లు, బొత్తాలు గల కఫ్ లు ఉంటాయి. దీనిని ప్రస్తుతము ఎవరూ వాడుట లేదు.
కోటుల ల్యాపెల్ లు
మార్చుకోటుకు మూడు రకాల ల్యాపెల్ లు ఉంటాయి. ఒక్కోమారు ఎటువంటి ల్యాపెల్ లేని కోటులు కూడా ధరిస్తారు. ఇది అసాంప్రదాయికం.
- నాచ్డ్ ల్యాపెల్
- పీక్డ్ ల్యాపెల్
- షాల్ ల్యాపెల్
-
నాచ్డ్ ల్యాపెల్
-
పీక్డ్ ల్యాపెల్
-
షాల్ ల్యాపెల్
కోటు జేబులు
మార్చు- బ్రెస్ట్ పాకెట్: కోటు పై ఛాతీ ఎడమ వైపుకు ఉండేది.
- ప్యాచ్ పాకెట్స్: జేబు ముక్క తెచ్చి అతికించినట్టు ఉంటుంది
- ఫ్ల్యాప్ పాకెట్స్: జేబు లకి పైన ఆచ్ఛాదన ఉంటుంది
- జెట్టెడ్ పాకెట్స్:
-
ప్యాచ్ పాకెట్
-
ఫ్ల్యాప్ పాకెట్
-
బౌండ్ లేదా జెట్టెడ్ పాకెట్
కోటు వెంట్ లు
మార్చుకోటు క్రింది భాగంలో కత్తిరించినట్టు ఉన్న భాగం. ఇవి మూడు రకాలు.
- వెంట్ లెస్: అసలు వెంట్ ఉండదు (ఇటలీ శైలి)
- సింగిల్-వెంటెడ్ స్టైల్: వెనుక వైపు ఒకే ఒక వెంటు ఉంటుంది
- డబుల్ వెంటెడ్ స్టైల్: నడుముకిరువైపులా రెండు వెంట్లు (బ్రిటీషు శైలి)
డిన్నర్ జాకెట్ కి యే శైలిలోనూ వెంట్ లు ఉండవు
కోటులలో ఇతరాలు
మార్చు- ఫాల్స్ బటన్ - ల్యాపెల్ కు ఛాతీ పై ఉన్న తప్పుడు బొత్తా, కాజా. ఇవి అలంకారప్రాయాలే. కానీ కాజాలో ఒక్కోమారు రోజా పువ్వు ఒకటి పెడతారు. పువ్వు నిలబడటానికి ల్యాపెల్ వెనుక వైపు ఒక చిన్ని కొండీ కుడా పెడతారు.
- పాకెట్ స్క్వేర్ - జేబులో కనబడేట్టు ఉంచే కర్చీఫు వంటి గుడ్డ. ఇది కూడా అలంకారమే. వీటిని కర్చీఫులుగా వాడరు.
- కఫ్ బటన్స్ - అవసరము, ఉపయోగము లేకున్నను ముంజేయి వద్ద ఉండే బొత్తాలు. ఫ్రెంచి సైనికులు తమ చెమటని కోటు కఫ్ల క్రింద భాగాన్ని తుడుచుకొంటుంటే, ఆ మరకలు నచ్చని నెపోలియన్ ఆ అలవాటుని కట్టడి చేయటానికి ఇలా కుట్టించేవాడు. తర్వాత ఇవే అలంకారప్రాయాలైనాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- బాల్ & కో, బొంబాయి వారు 1958, 1959 లలో ప్రచురించిన, ఎం.బి. జువేకర్ చే రచించబడ్డ కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ పుస్తకం