జాజికాయ నూనె ఒక ఆవశ్యక నూనె.ఒక సుంగంధ తైలం. జాజికాయ నూనెను జాపత్రి కాయ విత్తనాలనుండి తీస్తారు.జాజికాయ నూనెను ఆరోమథెరపీలో ఉపయోగిస్తారు.కీళ్ళవాపు వాత నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.అలాగే జీర్ణ కోశ వ్యవస్థలోని అవకతవకలను సరిదిద్దును.అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థను వృద్ధి పరచును.అలాగే జాజికాయ నుండి జాజికాయ యొక్క ఎండ బెట్టిన ఎర్రటి కండగల బాహ్య కవచం నుండి తీసిన నూనెను మేస్ ఆయిల్ (mace) అంటారు, దీన్నిసుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు.జాజికాయ యొక్క ఎండ బెట్టిన ఎర్రటి కండగల బాహ్య కవచాన్ని మసలాగా వంటల్లో ఉపయోగిస్తారు.[1]

జాజికాయ

జాపత్రి/జాజి చెట్టు

మార్చు

జాజికాయ చెట్టును జాపత్రి చెట్టు అనికూదా అంటారు.జాజికాయ చెట్టు మిరిస్టికేసి కుటుంబానికి, మిరిస్టికా జాతికి చెందినది.జాజికాయ చెట్టులో 100 రకాలు ఉన్నాయి.వాటిలో కొని రకాలు

  • మిరిస్టికా అర్జెంటియా
  • మిరిస్టికా ఫ్రాగ్రాన్స్
  • మిరిస్టికా ఇన్యూటిలిస్
  • మిరిస్టికా లెప్టోఫిల్లా
  • మిరిస్టికా మలబారికా
  • మిరిస్టికా మేక్రోఫిల్లా
  • మిరిస్టికా అటోబా
  • మిరిస్టికా ప్లాటిస్పర్మా
  • మిరిస్టికా సిన్‌క్లైరీ

జాజికాయ నూనెను ఎక్కువగా మిరిస్టికా ఫ్రాగ్రాన్స్ నుండిఉత్పత్తి చేస్తారు.జాజి చెట్టు సతతహరిత వృక్షం.చెట్టు దాదాపు 20 మీటర్ల ఎత్తు (65 అడుగులు) పెరుగును.దట్టమైన ఆకులు కల్గి, చిన్నని మెరుపు తగ్గిన పసుపు రంగు పూలను పూయును.ఈ చెట్టు మూలస్థావరం మొలుక్కా ద్వీపాలు.అయితే పెనెంగ్, జావా, శ్రీలంకల్లో కూడా గుర్తించారు.పండు చిన్న పీచ్ (peach) పందు ఆకారంలో (దొండపండువలె యెర్రగా వుండే ఒక పండు) వుండును.భారతీయులు జాజి నూనెను ప్రేగుల్లోని అస్వస్థతతగ్గించుటకు ఉపయోగించేవారు. ఈజిప్టియనులు శవాలను కుళ్లి పోకుండవ వుంచు ద్రవ్యాలతో ఈ నూనెను కలిపి వాడేవారు.మధ్య యుగం కాలంలో లార్డ్/పండీకొవ్వుతో కలిపి ఆయింట్ మెంట్/పూతమందుగా మూలశంకకు వాడేవారు, వర్తమాన కాలంలో సబ్బులలో, కొవ్వొత్తులలో, దంతసంరక్షణ క్రీములలో,, కేశ లేపనాలలోజాజినూనెను ఉపయోగిస్తున్నారు.[1]

నూనె సంగ్రహణం

మార్చు

ఎండబెట్టిన జాజికాయ విత్తనాలనుండి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతిలో సంగ్రహణ చేస్తారు.విత్తనాలలో నూనె 6-7%వరకు వుండును.

జాపత్రి/జాజికాయ నూనె

మార్చు

జాజికాయ నూనె జాజి కాయ వాసన వంటి సువాసన కల్గి ఉంది.జీజికాయ నుండే కాకుండా జాజికాయ పొట్టు నుండి కూడా maceఅనే నూనెను తయారు చేస్తారు.ఇది జాజికాయ విత్తనం నుండి తీసిన నూనె కన్నా తక్కువ నాణ్యమైనది. కాయలోని kernal/ కెర్నల్ (గుజ్జు, గుంజు) అనబడు విత్తన భాగం నుండి జాజి నూనెను సంగ్రహిస్తారు.

నూనెలోని రసాయనాలు

మార్చు

జాజి తైలంలో 30 కి పైగా పలు రసాయన సమ్మేళనాలు (ఆల్కహాలులు, కీటోనులు, టేర్పేనులు, పీనేనులు, అల్ది హైడులు, ఆరోమాటికి రసాయనాలు) ఉన్నాయి.అందులో ముఖ్యమైనవి ఆల్ఫా పినేన్, కాంపెన్, బీటా పూనేన్, సబినేన్, మైర్సేన్, ఆల్ఫా పిలాన్డ్రెన్, ఆల్ఫా టెర్పినేన్, లిమోనెన్,1,8-సినోల్ (cineole), యే-టెర్పినేన్, లినలూల్, టెర్పినేన్-4-ఒల్, సఫ్రోల్, మైథైల్ యుజెనోల్,, మిరిస్టిసిన్లు[1]. నూనెలో ఆల్కలాయిడ్స్, స్టెరాయిడ్స్, టానిన్స్, పెనోలిక్స్, గ్లైకోసిడ్స్, ఫ్లేవనోయిడ్స్‌ ఉన్నాయి.[2]

  • మిరిస్టికా ఫ్రగ్రాన్స్ చెట్టు విత్తనంలోని రసాయన సమ్మేళనాల పట్టిక[3]
వరుస సంఖ్య రసాయనసమ్మేలన పదార్థం శాతం
1 ఆల్ఫా-థుజేన్ 0.78
2 అల్పా-పైనేన్ (పినేన్) 10.23
3 కాంపేన్ 0.16
4 సబినేన్ 21.38
5 ఆల్పా మైర్సినా 2.38
6 అల్పా-టెర్పినేన్ 2.72
7 లిమొనేన్ 5.57
8 బిటా ఒసిమేన్ 0.03
9 γ-టెర్పినేన్ 3.98
10 ట్రాన్స్-సబినెన్ హైడ్రేట్ 0.03
11 టెర్పినోలేన్ 1.62
12 లినలూల్ 0.75
13 ఫెంచైల్ ఆల్కహాలు 0.05
14 సిస్-సబినెన్ హైడ్రేట్ 0.06
15 4-టెర్పినియోల్ 13.92
16 అల్పా-టెర్పినియోల్ 3.11
17 సిట్రోనెల్లొల్ 0.77
18 లినలైల్ అసిటేట్ 0.06
19 బోర్నైల్ అసిటేట్ 0.24
20 సాఫ్రోల్ 4.28
21 మిథైలు యూజనోల్ 0.77
22 ఐసో యూజనోల్ 1.74
23 మిరిస్టిసిన్ 13.57
24 ఎలిమిసిన్ (Elimicin) 1.42
25 మెటోక్షి యూజనోల్ 0.10
26 బిటా అసరోన్ 0.03
27 మిరిస్టిక్ ఆమ్లం 0.11
28 ఇథైల్ మిరిస్టేట్ 0.04
29 పామిటిక్ ఆమ్లం 0.03
30 ఇథైల్ పామిటేట్ 0.07
31 స్టియరిక్ ఆమ్లం 0.01
32 ఇథైల్ ఓలియేట్ 0.01

నూనె భౌతిక ధర్మాలు

మార్చు

జాజికాయ నూనె నూనె భౌతిక ధర్మాల పట్టిక (మిరిస్టియా ఫ్రాగ్రాన్స్ చెట్టు విత్తనాల నూనె) [4]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువలమితి
1 రంగు లేత పసుపు, పారదర్శకం
2 సాంద్రత 25 °C వద్ద 0.88000 - 0.91000
3 వక్రీభవన సూచిక 20 °C వద్ద 1.47500 - 1.48800
4 దృష్టి/దృశ్య భ్రమణం +8.00 - +30.00
5 బాష్పీభవన స్థానం 165.00 °C./ 760.00 mm Hgవద్ద
6 ఫ్లాష్ పాయింట్ 109.00 °F. TCC ( 42.78 °C. )
7 నిల్వ వుండు కాలం 24నెలలు
8 ద్రావణీయత ఆల్కహాల్ లో, పారఫిను ఆయిల్లో కరుగును.నీటిలో కరగదు

వైద్యపరంగా గుణాలు

మార్చు

జాజి నునే లోని ఔషద లక్షణాలు:బాధానాశకౌషధము, (కీళ్ళ) వాతనిరోధి, చెడకుండ కాపాడు ఔషధము, కండర సంకోచ/ ముకుళన నిరోధి, వాయుహరమైన ఔషధము, జీర్ణకారియైన ఔషధము, మృదు విరేచనకారి, సుఖప్రసవానికి సహకరించే గుణం, ఉల్లాసకారి, బలవర్ధకౌషధం.[5]

నూనె ఉపయోగాలు

మార్చు
  • హృదయ స్పందన, రక్త ప్రసరణను ఉత్తేజ పరుస్తుంది.మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తుంది. జీర్ణాకారిగా పనిచేయును.మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
  • హృదయ స్పందన, రక్త ప్రసరణను ఉత్తేజ పరుస్తుంది.మానసిక ఉల్లాశాన్ని కల్గిస్తుంది.జీర్ణకారిగా పనిచేయును.నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది. పిత్తాశయంలో రాళ్ళను తగ్గించును. ప్రత్యుత్పత్తి వవస్థలో టానిక్ గా పనిచేయును.జడత్వాన్ని నివారిస్తుంది.[5]
  • యాంటి ఇన్ఫ్లమేటరిగా (తాపజనకమైన నొప్పిని తగ్గించెడి) పనిచేయును.[6]
  • యాంటీ మైక్రో బైయల్ (సూక్ష్మ క్రిమి నాశని) గుణాలు కల్గి ఉంది.ముఖ్యంగా వంTi వ్యాధులను వ్యాపింపచేయు బాసిల్లాస్ సబ్టిలిస్, బాసిల్లాస్ ఎసిరిచియా కోలి వ్యాధిజనక రకాలను నాశనం చేయును.[5]
  • కిడ్నీ రాళ్ళు, మూత్రాశయం, మూత్ర మార్గము మంటను తగ్గించును. నిద్రలేమిని తగ్గించును.[7]
  • క్యాన్సరును తగ్గించును, నపుంసకత్వాన్ని తగ్గించును.[7]

ముందు జాగ్రత్తలు

మార్చు

సాధారమంగా జాజి నూనె విష లక్షణాలు లేని, ఇరిటేసను /ప్రేరక గుణం కల్గించని నూనె. కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్న వాంతులు రావచ్చు, మైకము కల్గవచ్చును. దీనికి కారణం నూనెలో వున్న మిరిస్టిన్ కారణం అయ్యే అవకాశం ఉంది. తక్కువ నాణ్యతవున్న mace/మాసే నూనెలో ఈ మిరిస్టిన్ శాతం ఎక్కువ.అలాగే గర్భవతిగా వున్నప్పుడు స్త్రీలు వాడరాదు.

బయటి వీడియోల లింకులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Nutmeg oil (Myristica fragrans) - the origin, source, extraction method, chemical composition, therapeutic properties and uses". web.archive.org. 2018-02-26. Archived from the original on 2018-02-26. Retrieved 2023-01-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://web.archive.org/web/20171120092946/https://articles.mercola.com/herbal-oils/nutmeg-oil.aspx
  3. "Identification of Compounds in the Essential Oil of Nutmeg Seeds". ncbi.nlm.nih.gov. Archived from the original on 2018-09-01. Retrieved 2018-09-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. https://web.archive.org/web/20180213101514/http://www.thegoodscentscompany.com/data/es1009111.html
  5. 5.0 5.1 5.2 Nutmeg essential oil information. "Nutmeg essential oil information". Archived from the original on 2018-02-26. Retrieved 2018-09-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. https://web.archive.org/web/20180226233743/https://essentialoils.co.za/essential-oils/nutmeg.htm
  7. 7.0 7.1 "NUTMEG AND MACE". webmd.com. Archived from the original on 2018-09-01. Retrieved 2018-09-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)