మిరిస్టిక్ ఆమ్లం

రసాయనిక సమ్మేళనం

మిరిస్టిక్ ఆమ్లం (Myristic acid, also called tetradecanoic acid) ఒక సాధారణమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది 14 కార్బనులను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 12COOH[3]

మిరిస్టిక్ ఆమ్లం[1]
పేర్లు
IUPAC నామము
tetradecanoic acid
ఇతర పేర్లు
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [544-63-8]
పబ్ కెమ్ 11005
SMILES CCCCCCCCCCCCCC(=O)O
ధర్మములు
C14H28O2
మోలార్ ద్రవ్యరాశి 228.37092
సాంద్రత 0.8622 g/cm3
ద్రవీభవన స్థానం 54.4 °C[2]
బాష్పీభవన స్థానం 250.5 °C at 100 mmHg
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే జాజికాయ (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనేపేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్‌ ఆమ్లం అధికశాతము సింపుల్‌ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తలనూనెలో మిరిస్టిక్ ఆమ్లం 15% ఉంది.[4] అధికముగా (excess) మిరిస్టిక్ ఆమ్లాన్ని ఆహారములో తీసుకున్నచో ఫ్లాస్మా కొలెస్ట్రాల్‌ పెరిగె ప్రమాదమువున్నది. సంతృప్త కొవ్వు ఆమ్లాలలో మిరిస్టిక్‌ ఆమ్లం మాత్రమే కణ మాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్‌ లింకు ఏర్పరచగలదు. పాల కొవ్వులలో ఈఆమ్లం 8-12% వరకు ఉంది. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలో కూడా 1-5% వరకు వుండును. ఈకొవ్వు ఆమ్లం నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్‌ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారుచెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ ఆమ్లాన్ని క్షయికరణచర్య (reduction) కు గురికావించి మిరిస్టిల్ అల్డిహైడ్ (myristyl aldehyde), మిరిస్టిల్‌ అల్కహల్ (myristyl alcohol) ను ఉత్పన్నం చేయుదురు. మిరిస్టిక్ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.

ధర్మాలు మార్చు

మిరిస్టిక్‌ ఆమ్లం భౌతిక, రసాయనిక ధర్మాలు[5]

గుణము విలువలమితి
భౌతిక స్థితి తెల్లని ఘనస్దితి
ద్రవీభవన ఉష్ణోగ్రత 52-540C
మరుగు ఉష్ణోగ్రత 2500C,100mm/Hg వద్ద
సాంద్రత 0.86
సపొనిఫికెసన్ విలువ 245-249
కలరు 2Y+0.2R (5.25" cell)

మిరిస్టిక్ కొవ్వుఆమ్లాన్ని కలిగివున్న కొన్ని నూనెలు/కొవ్వులు

నూనె శాతం నూనె శాతం
జాజికాయ 70-75 khakan fat 28-45
పామ్‌కెర్నల్‌ నూనె 14-18 మరోటి నూనె 10-12
కొబ్బరి నూనె 13-19 పామాయిల్ 0.5-2.0
మొక్కజొన్న నూనె 0.5-1.0 జట్రొఫా నూనె 0.5-1.5
తవుడు నూనె 0.5-1.0 కొకమ్ >1.0
పత్తిగింజల నూనె >1.0 ఒడిసలు 1.5-3.5

మిరిస్టిక్ అమ్లమున్ననూనెలను ఆహారంలో అధికంగా తీసుకున్న ఫ్లాస్మా కొలెస్ట్రాల్‌పెరిగే అవకాశమున్నది.

వినియోగాలు మార్చు

  • రబ్బరు, ప్లాస్టికులు, గ్రీజులు, ద్రవకందెనలు, మందులతయారి, కాస్మోటిక్స్‌ తయారిలలో వినియోగిస్తారు[6]
  • టాయ్‌లెట్ సబ్బుల తయారిలోను వినియోగిస్తారు.

మూలాలు మార్చు

  1. Merck Index, 11th Edition, 6246
  2. "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. 2001. doi:10.1351/pac200173040685.
  3. "What Is Myristic Acid?". wisegeek.com. Retrieved 2015-03-01.
  4. "Myristic Acid". truthinaging.com. Archived from the original on 2014-08-05. Retrieved 2015-03-01.
  5. "Myristic acid". chemicalbook.com. Retrieved 2015-03-01.
  6. "MYRISTIC ACID". chemicalland21.com. Retrieved 2015-03-01.