జాత్రా భగత్
జాత్రా భగత్ (2 అక్టోబరు 1888 - 1916) జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక వేత్త. ఒరాన్ తెగలో తానా భగత్ ఉద్యమాన్ని స్థాపించాడు.[3][4][5][6]
జాత్రా భగత్ | |
---|---|
జననం | 2 అక్టోబరు 1888 చింగారి నవతోలి, గుమ్లా జిల్లా, జార్ఖండ్ |
మరణం | 1916 |
జాతీయత | భారతదేశం |
ఇతర పేర్లు | తానా భగత్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తానా భగత్ ఉద్యమం భగతిజం[2] |
జననం
మార్చుజాత్రా భగత్ 1888 అక్టోబరు 2న కోహ్రా భగత్ - లివరీ భగత్ దంపతులకు జార్ఖండ్ రాష్ట్రం, గుమ్లా జిల్లాలోని చింగారి నవతోలి గ్రామంలో జన్మించాడు.[7] ఇతడికి బుధ్ని భగత్ తో వివాహం జరిగింది.
ఉద్యమం
మార్చుఇతడిని తానా భగత్ అని, ఇతడు ప్రారంభించిన ఉద్యమాన్ని 'తానా భగత్ ఆందోళన్' అని పేరుతో పిలిచేవారు. తానా భగత్ ఉద్యమం అనేది ఒక రకమైన సంస్కృతీకరణ ఉద్యమం. బ్రిటీష్ ప్రభుత్వ దురాగతాలతో బాధపడుతున్న గిరిజన సమాజానికి, భూస్వాముల బలవంతపు శ్రమ, మూఢనమ్మకాలు మొదలైన వాటిపై జాత్రా భగత్ పోరాడాలని నిశ్చయించుకున్నాడు. ఇది 1914 ఏప్రిల్ 21న మతపరమైన, ఆర్థిక ఉద్యమంగా ప్రారంభమై, తరువాత భారత స్వాతంత్ర్య ఉద్యమంతో కలిసి రాజకీయ ఉద్యమంగా మారింది.[8]
మరణం
మార్చుజాత్రా భగత్ 1916లో మరణించాడు.
గుర్తింపు
మార్చుఒరాన్ తెగ కోసం జాత్రా భగత్ చేసిన ఉద్యమానికి గుర్తుగా అతని జ్ఞాపకార్ధం జార్ఖాండ్ రాష్ట్రం, రాంచీ జిల్లాలో అతని విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
మూలాలు
మార్చు- ↑ "तीर्थ स्थल बनकर रह गया जतरा टाना भगत का पैतृक गांव ¨चगरी" (in Hindi). Dainik Jagran. 12 August 2018.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ A. R. N. Srivastava (2007). Tribal Freedom Fighters of India. Ministry of Information and Broadcasting (India). ISBN 9788123025216.
- ↑ Ravi, Salman. "जिनके लिए तिरंगा भगवान है" (in Hindi). BBC.com.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Venerating the tricolour". Deccan Herald. August 15, 2009.
- ↑ "जतरा भगत एवं टाना आन्दोलन" (in Hindi). Vikaspedia.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Pal, Sanchari (August 13, 2016). "14 Forgotten Folk Uprisings That Prepared the Ground for Indian Independence". Thebetterindia.com.
- ↑ "सदियों पहले टाना भगत ने लड़ी थी 'सामाजिक न्याय' की लड़ाई, अंग्रेजों के छूटते थे पसीने" (in Hindi). Eenadu. 15 August 2018. Archived from the original on 28 నవంబరు 2018. Retrieved 7 అక్టోబరు 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Kumar, Akshay (2021-06-18). "Tana Bhagat Movement | Jharkhand". Edvnce (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-07.