గుమ్లా జిల్లా

ఝార్ఖండ్ లోని జిల్లా

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో గుమ్లా జిల్లా (హిందీ: गुमला जिला) ఒకటి. జిల్లాకు కేంద్రగా గుమ్లా పట్టణం ఉంది.

గుమ్లా జిల్లా
गुमला जिला
జిల్లా
గుమ్లా జిల్లా
గుమ్లా జిల్లా
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుదక్షిణ ఛోటా నాగ్‌పూర్
ముఖ్యపట్టణంగుమ్లా
విస్తీర్ణం
 • Total5,327 km2 (2,057 sq mi)
జనాభా
 (2011)
 • Total10,25,656
 • జనసాంద్రత193/km2 (500/sq mi)
భాషలు
Time zoneUTC+5:30 (IST)
లోక్‌సభలోహార్‌దాగా
Websitehttp://gumla.nic.in/

పేరువెనుక చరిత్ర

మార్చు

శతాబ్ధాల కాలం నుండి ఈ ప్రాంతం వదుమార్పిడి వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు ఇలా మార్చుకుంటూ ఉంటారు. హిందీ పదాలైన " గా- మేళా " (ఆవుల సంత) . గా- మేళా లను కలిపి ఈ ప్రాంతం గామేళా అని పిలువ బడిందని కాలక్రమేణా ఇది గుమ్లాగా రూపాంతరం చెందిందని భావిస్తున్నరు.

చరిత్ర

మార్చు

బ్రిటిష్ పాలనా కాలంలో గుమ్లా లోహార్‌దాగా జిల్లాలో ఉండేది. 1843లో ఈ ప్రాంతం బిష్ణుపూర్ రాజాస్థానంలో ఉండేది. తరువాత 1899లో రాంచీ జిల్లా ఏర్పాటు చేయబడింది. 1902లో గుమ్లా రాంచీ జిల్లాలో ఉపవిభాగంగా చేర్చబడింది. 1984 మే 18న గుమ్లాకు జిల్లా అంతస్తు వచ్చింది. శ్రీ జగదీష్ మిశ్రా (అప్పటి బిహార్ ముఖ్య్మంత్రి) దీనిని ప్రారంభించారు. ద్వారకానాథ్ సింహా దీనికి తొలి డెఫ్యూటీ కమీషనర్‌గా నియమించబడ్డాడు.

గుమ్లా హిందూ దైవం హనుమంతునికి జన్మస్థానమని విశ్వసిస్తున్నారు. గుమ్లాకు కొన్ని కి.మీ దూరంలో ఘాఘ్రా బ్లాకులో హనుమంతునికి ఆయన తల్లి అంజనాదేవికి ఆయలాలు ఉన్నాయి. ఈ జిల్లాలో రామాయణంలో వర్ణించబడిన ౠష్యమూక పర్వతం ఉంది. జిల్లా ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[1] గుమ్లా జిల్లాలోని బజార్ త్నర్ వద్దకు ఇప్పుడు కూడా జంతువులను గాల్- మేళాకు తీసుకు వస్తుంటారు.

భౌగోళికం

మార్చు

గుమ్లా జిల్లా చోటానాగపూర్ మైదానం దక్షిణ ప్రాంతంలో ఉంది.

 • గుమ్లాజిల్లాలో ప్రధానంగా 3 నదులు ప్రవహిస్తున్న ప్రాంతాలు : సౌత్ కోయల్ నది, నార్త్ కోయల్ నది, శంఖ్ నది. జిల్లాలో పలు సెలఏర్లు, ఉపనదులు, సద్ని జలపాతం వంటి జలపాతాలు ఉన్నాయి.
 • జిల్లాలోని భూభాగం అధికంగా ఎగుడు దిగుడుగా ఉంది. అంతేకాక నదులు, సెలఏర్లు ఉన్నాయి. జిల్లాలో 5.21 హెక్టార్ల భూభాగంలో 1.35 లక్షల హెక్టార్లలో (27%) అరణ్యాలు ఉన్నాయి.

వాతావరణం

మార్చు

గుమ్లా జిల్లాలో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ఉంది. గుమ్లా జిల్లా వాతావరణం ఉపౌష్ణమండల వాతావరణం వర్గానికి చెంది ఉంది. వేసవి ఉష్ణోగ్రత 40 నుండి 20 ° సెల్షియస్ ఉంది. శీతాకాల కనిష్ఠ ఉష్ణోగ్రత 21 నుండి 3 °సెల్షియస్ ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 1450 మి.మీ ఉంటుంది. .

ఆర్ధికరంగం

మార్చు

గుమ్లా జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది. జిల్లాలో 23 బాక్సైట్, 68 రాళ్ళ గనులు ఉన్నాయి. అంతేకాక జిల్లాలో నాణ్యమైన ఇటుకల తయారీదారులు ఉన్నారు. జిల్లాలోని ఆంకిపానీ, లంగ్దాతంర్, చిరొధ్, నర్మ, బహగర, బిష్ణుపూర్ బ్లాకులోని గుర్దారి, లుపంగ్పాత్, చైంపూర్ బ్లాకులోని చోటా - అజియటు, హార్ప్, సెరంగ్డాగ్, గంగ్రా బ్లాకులోని జలిం లలో బాక్సైట్, అల్యూమినియం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో చైనాక్లే నిలువలు కనుగొనబడ్డాయి. అదనంగా స్టోన్ క్రషర్, బ్రిక్‌క్లిన్, స్టోన్ చిపింగ్ గనులు కూడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి.

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గుమ్లా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఈ జిల్లా ఒకటి..[2]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,025,656,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 439 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 193 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.21%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 993:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 66.92%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాల ప్రకారం [6] గుమ్లా జిల్లా జనసంఖ్య 1,025,656. జార్ఖండ్ రాష్ట్ర జనసంఖ్యలో ఇది 3.11% . పురుషుల సంఖ్య 514,730, స్త్రీల సంఖ్య 510,926 ఉంది. స్త్రీ: పురుషుల నిష్పత్తి 993:1000.అక్షరాస్యత 66.92%. జిల్లాలో 6 వయసు లోబడిన పిల్లల శాతం 15% ఉన్నారు.

భాషలు

మార్చు

జిల్లాలో నాగపురి (సద్రి), హిందీ, ఒరియా, కురుఖ్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఆస్ట్రోయాసియాటిక్ భాష అయిన అసురి భాష కూడా జిల్లాలో వాడుకలో ఉంది. ఈ భాషను దాదాపు 17,000 మంది మాట్లాడుతున్నారు.[7] జిల్లాలోని గిరిజన ప్రజలలో కొర్తా, ఒరాన్, కుడుఖ్, ముందరి భాషలు వాడుకలో ఉన్నాయి.

సంస్కృతి

మార్చు

గుమ్లా జిల్లా ఆదివాసుల సంస్కృతి, వర్ణరంజితమైన ప్రకృతితో సుసంపన్నమై ఉంది. " చోటానాగపూర్ కి రాణి " హిల్ స్టేషను ఈ జిల్లాలోనే ఉంది.

 • కర్మ - జిల్లా ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది.
 • సర్హుల్ - గుమ్లా పట్టణంలో జకీలు, రాలీలు పెద్ద సంఖ్యలో నిర్వహించే ఉత్సాహభరితం, వర్ణరంజితం అయిన ఈ ఉత్సవంలో ప్రజలంతా పాల్గొంటారు. ఈ ఉత్సవంలో స్త్రీలు తలలో గులైచి పూలను ధరిస్తుంటారు పురుషులు వాటిని చెవిలో ధరిస్తుంటారు.
 • శ్రీరామనవమి - ఇది హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ. పండుగ సందర్భంలో పలు ఉత్సవాలు, ఊరేగింపులు చోటు చేసుకుంటాయి.
 • గుమ్లాలో సుసంపన్నమైన గిరిజన సంప్రదాయం ఉంది. 80% ప్రజలు నాగపురి భాషను మాట్లాడుతుంటారు. గిరిజనేతర ప్రజలతో మాట్లాడడానికి హిందీని ఉపయోగిస్తుంటారు.

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 • నెటర్హాత్ - గుమ్లాకు కొన్ని కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రశాంతమైన ప్రదేశం సూర్యోదయం, స్ర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికుల చేత ఇది స్వర్గ ధామంగా ప్రశసించబడుతుంది.
 • రాంరేఖ - ఇక్కడ సీతామాత నివసించిందని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద సీతామాత పాదముద్రలు ఉన్నాయని భక్తుల విశ్బాసం. ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.
 • రాణిడ - ఇది అద్భుతమైన విహారకేంద్రం. ఇక్కడ రాళ్ళను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న జలప్రవాహాల శబ్దం పర్యాటకులను పరవశానికి గురిచేస్తుంది. శీతాకాలంలో ఇది మరింత మనోహరంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు ఇక్కడ అమాష్యమైన శక్తులు ఉన్నట్లు భావించి భయాందోళనకు గురౌతున్నారు.
 • పాంపూర్ - ఇది బహు ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రాంతానికి సమీపంలో శీతల్పూర్, మల్మల్పూర్, ఘొడ్లత, పంచుకుఖి వంటి ప్రదేశాలు ఉన్నాయి.

ఇక్కడ సీతామాత పసుపు అరగదీసిందని భావిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద బండ ఇప్పటికీ పసుపు వర్ణంలో ఉంది.

 • రాకాస్ రాక్ (రాకాసి బండ) (ప్రాంతీయ భాషలో రాకాస్ తంగ్ర ) ఇక్కడ వాలి సుగ్రీవులు యుద్ధం చేదుకున్నారని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద ఇప్పటికీ రక్తపు మరకలతో కనిపిస్తుంటాయి.
 • నింఝర్ - ఇక్కడ ప్రవహిస్తున్న జలానికి మూలం ఏమిటో తెలియని మర్మం కొనసాగుతుంది.
 • అంజన్ - హనుమంతుని తల్లి అంజనాదేవి నివసించిన ప్రదేశమని భావిస్తున్నారు. అందుకనే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ నిర్వహించిన పురాతత్వ పరిశోధనలో లభించిన వస్తువులు పాట్నా మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఇది హనుమతుడి జన్మస్థలం.
 • 'బఘ్‌ముండ - ఇక్కడ మతపరమైన శిలామూర్తులు ఉన్నాయి. (అజంతా గుహల వంటివి).
 • రాజేంద్ర - ఇది సుందర ప్రదేశం. ఇక్కడ కొండలు, లోయలతో నిండిన ప్రకృతి కనిపిస్తుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో లాగా ఇది సుందర, ప్రశాంత వాతావరణం కలిగి ఉంది.
 • దేవకి - ఇది మతప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివపార్వతి ఆలయం ఉంది. శ్రావణ మాసంలో భక్తులు నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి శివునికి జలాభిసేకం చేస్తుంటారు.

శ్రావణమాసంలో ఈ ప్రాంతం ఉత్సవశోభను సంతరుంచుకుంటుంది.

 • హంపముని - ప్రబలమైన, పురాతన గ్రామంలో మాహామాయ ఆలయం ఉంది.
 • నాగ్ఫెని - ఇక్కడ ప్రముఖ జగన్నాథ్ ఆలయం ఉంది. ఇక్కడ పెద్ద నాగుపాము శిలారూపం ఉంది. అంతేకాక ఇక్కడి ప్రకృతి కూడా శోభాయమాయంగా ఉంది.
 • బిర్సా ముండా అగ్రోపార్క్.
 • రాక్ గార్డెన్.

వృక్షజాలం , జంతుజాలం

మార్చు

జిల్లాలో వివిధ వృక్షజాలం, జంతుజాలం ఉంది.

మూలలు

మార్చు
 1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
 6. "Gumla Census 2011 Highlights". Registrar General, India, Ministry of Home Affairs. Archived from the original on 2011-09-12. Retrieved 2011-05-05.
 7. M. Paul Lewis, ed. (2009). "Asuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు

మార్చు