జాన్ కెన్నెత్ గాల్‌బ్రెయిత్

అమెరికన్ ఆర్థికవేత్త
(జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ నుండి దారిమార్పు చెందింది)


John_Kenneth_Galbraith_1982

జె.కె.గాల్‌బ్రెయిత్ (అక్టోబరు 15, 1908 - ఏప్రిల్ 29, 2006) అమెరికన్ ఆర్థికవేత్త.

టూకీగాసవరించు

1908 లో అక్టోబరు 15కెనడా లోని అంటారియో లో జన్మించాడు. టొరాంటో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి హార్వర్డ్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేశాడు. 1949 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంకి ప్రొఫెసర్ గా వచ్చాడు. జాన్ కెన్నడీ ఈయనని, 1961-63 మధ్య కాలంలో, భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమించాడు. జవాహర్‌లాల్ నెహ్రూ తన అంతరంగిక స్నేహితుడని ఈయన చెప్పుకునేవాడు. చైనా-భారత్ యుద్ధంలో అమెరికా భారత్ కి అండగా నిలబడడానికి ఈయన తీవ్రంగా పని చేసేడు. ఈయన యొక్క ముఖ్య రచనలు The Affluent Society, The New Industrial State, The Great Crash:1929.