జాన్ జాక్విస్ రూసో
జీన్ జాక్విస్ రూసో (ఆంగ్లం : Jean Jacques Rousseau) (జెనీవా, 1712 - ఎర్మెనోవిల్లె, 1778 జూలై 2) 18వ శతాబ్దం విజ్ఞానకాలానికి చెందిన ఒక ప్రసిద్ధ తత్వవేత్త, రచయిత, కంపోజర్. ఇతడి రాజనీతి తత్వం ఫ్రెంచి విప్లవం, నవీన రాజనీతి, విద్యపై తీర్వమైన ప్రభావాన్ని చూపగలిగినది. ఇతడి రచనలలో ప్రసిద్ధ నవల, ఎమిలీ, లేదా ఆన్ ఎడుకేషన్,[1] ఫిక్షన్ లోరొమాంటిసిజం.[2] రూసో స్వీయచరిత్రల (autobiographical writings) రచనలు: కాన్‌ఫెష్షన్స్, ఇది నవీన స్వీయచరిత్ర రచన విధానాలను ప్రారంభించినది, రెవరీస్ ఆఫ్ ఎ సాలిటరి వాకర్ (along with the works of జర్మనీలో Lessing, గేథే, ఇంగ్లాండులో రిచర్డ్‌సన్, స్టెర్నే ల రచనలతో సహా), 18వ శతాబ్దపు సున్నిత సిద్ధాంతాల కాలంనాటి రచనలుగా ప్రసిద్ధి గాంచినవి. రూసో ఒక డ్రామాను రెండు ఒపేరాలను కూడా రచించాడు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో రూసో ప్రసిద్ధ తత్వవేత్తగా గుర్తింపబడ్డాడు. ఇతడు మరణించిన 16 సంవత్సరాల తరువాత 1794 ప్యారిస్ లోని పాంథియాన్ లో జాతీయ హీరోగా గుర్తింపబడ్డాడు.
పాశ్చాత్య తత్వవేత్తలు 18వ శతాబ్దపు తత్వశాస్త్రం (నవీన తత్వశాస్త్రం) | |
---|---|
1766, రూసో చిత్రం - అల్లాన్ రాంసే | |
పేరు: | {{{name}}} |
జననం: | (జెనీవా, స్విట్జర్లాండ్) | 1712 జూన్ 28
మరణం: | 1778 జూలై 2 (Ermenonville, ఫ్రాన్స్) | (వయసు 66)
సిద్ధాంతం / సంప్రదాయం: | సోషల్ కాంట్రాక్ట్ థియరీ, విజ్ఞాన కాలం |
ముఖ్య వ్యాపకాలు: | రాజనీతి తత్వం, సంగీతం, విద్య, సాహిత్యము, ఆటోబయోగ్రఫీ |
ప్రముఖ తత్వం: | సాధారణ ఉద్దేశ్యం, అమోర్ ప్రాప్రే, మానవ నైజం |
ప్రభావితం చేసినవారు: | నికోలో మాకియవెల్లి, మైకేల్ డె మోంటైన్, థామస్ హొబ్బెస్, జాన్ లాకె, డెనిస్ డిడెరాట్ |
ప్రభావితమైనవారు: | కాంట్, రోబేస్పియెర్రే, లూయిస్ డే సెయింట్-జస్ట్, ఫెచ్‌టే, హెగెల్, గేథే, రొమాంటిసిజం, పైన్, కామ్‌టే, బోలివర్, కార్ల్ మార్క్స్, ఏంజెల్స్, డెర్రిడా, పాల్ డి మాన్, బెనెడెట్టో క్రోసె, Galvano Della Volpe, Claude Lévi-Strauss, Émile Durkheim, Mikhail Bakunin, లియో టాల్‌స్టాయ్, జాన్ రాల్స్ |
విద్య, పిల్లల wపెంపకం
మార్చురూసో సిద్ధాంతాలు
మార్చుమానవ స్వభావము
రూసో అభిప్రాయములో మానవుడి స్వభావములో రెండు ప్రధాన గుణాలున్నాయి. అవి ఆత్మరక్షణ, సాంఘిక స్వభావము. సమూహంలో జీవించాలనే కోరిక సాంఘిక స్వభావము నుంచి జనిస్తుంది. అదిలేకపోయినట్లయితే మానవుని జీవితం దుర్భరం అయ్యేది. ఆత్మరక్షణ, ఇతరుల పట్ల సానుభూతి ఈ రెండూ ఒక్కొక్కప్పుడు పరస్పరం ఘర్షణ పడే సందర్భాలు ఏర్పడవచ్చును అంటాడు రూసో. కుటుంబ శ్రేయస్సుకోసం ఉన్న ఆతృత సమాజ ప్రయోజనంకోశం చేయవలసిన ప్రయత్నాన్ని పరిమితం చేయొచ్చు; లేదా వ్యతిరేకించవచ్చును.అందువలన ఇటువంటి విభిన్న ప్రయోజనాల మర్ధ స్పర్ధకు దారితీస్తాయి. అందువలన వీటిమధ్య రాజీ ఏర్పరచడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. ఇటువంటి రాజీ ఫలితంగానే మరొక భావం ఎర్పడుతుంది. దానిని అంతరాత్మ అంటాడు. ఇది మానవుడికి ఏది మంచి ఏది చేడు అనేది చెప్పదు. ఏడి మంచి అని మానవుడు తెలుసుకుంటాడో దానిని చేయమని అంతరాత్మ ప్రోత్సహిస్తుంది. మంచిని మానవుడు మరొక భావం ద్వారా తెలుసుకుంటాడు.ఆ భవమే హేతువు(Reason). ఏమి చేయవలెనో హేతువు మానవునికి చెబుతుంది. అయితే అతనిని ఆపని చేయటానికి పూర్తిగా పురికొల్పలేదు. అతనిచే మంచి పని చేయించగలిగేది ఒక్క అంతరాత్మ మాత్రమే. మానవుడు వివేకంచే పరిపూర్ణుడు కాగలడు.అయితే వివేకం అతనిని పూర్తిగా ప్రభావైతం చేయలేదు.అతనిని కార్యోన్ముఖుని చేయడానికి కొంత ప్రేరణ లేదా ఉద్యేగం అవసరం. మానవుడు పూర్తిగా హేతుబద్ధంగా వ్యవహరించడానికి, మానసిక భావాలు, ఉద్రేకాలు, రాగద్వేషాలు అతనిని కార్యాచరణకు ప్రోత్సహిస్తాయని, మానవ సంబంధాలలో రాగద్వేషాల ప్రాముఖ్యాన్ని వివరించిన రాజనీతి తత్త్వవేత్త రూసో.
స్వేచ్చ
ప్రాకృతిక వ్యవస్థ(State of Nature) మానవుడు స్వేచ్ఛా జీవి. అంటే మనకు కావలసిన జీవన విధానాన్ని ఎంచుకోవటం.అదే జంతువులనుండి వేరు చేస్తుంది. అందువల్ల రూసో Social Contract అనే ఉపోద్ఘాతములో మనవుడు జన్మత: స్వేచ్చా జీవి అని ప్రకటిస్తాడు.రూసో స్వేచ్చకు స్వాతంత్ర్యానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాడు. స్వాతంత్ర్యం ఎటువంటి చట్టాలకు పరిమితం కాదు.ఇది ఒకరకమైన అపరిమితమన స్వేచ్చ. విధులు లేని హక్కులు ఒకరకమైన అరజకాన్ని సృష్టిస్తాయి. ఇది మానవ ప్రగతిలో మొదటి దశ. దీని తరువాత రెండవ దశ పౌర సమజము. ఇందులో చట్టం అనే పరిధిలో స్వేచ్చను అనుభవిస్తాడు.ఇదే ప్రాకృతిక వ్యవస్థ.మానవుడు తన ఇచ్చను చట్టాన్ని, చట్టంద్వారా హేతువుకు అనుగుణంగా రూపొందించుకున్నప్పుడే అతడు నిజమైన స్వేచ్చను అనుభవిస్తాడు.వ్యత్కి ఇచ్చను సంఘ శ్రేయస్సుతో ఏవిధంగా సమ న్వయం చేయాలనేది ఒక ప్రధాన ప్రశ్న అంటాడు రూసో. Man is born fre, but every where he is in chains. మానవుడు స్వేచ్చా జీవిగా జన్మించినా అతడు ప్రతిచోటా బంధితుడై ఉన్నాడు.నాగరిక వ్యవస్థ ఏర్పడక ముండు మానవుడు ఏవిధంగా స్వాభావింకంగా మంచిచేదు తెలుసుకొని జీవించాడో అటువంటి స్వేచ్చా జీవితాన్ని అలవరుచుకోవాలని రూసో బోధిస్తాడు.
సాంఘిక ఒడంబడిక
సంఘంలో ప్రతి సభ్యుడు తన హక్కులు, అధికారాలను మొత్తం సమాజానికి అర్పించాలి. సమాజ శ్రేయస్సుకోసం కృషి చేయాలి. ప్రతి వ్యకికి వ్యక్తిగతమైన కొన్ని స్వెచ్చలు ఉండాలి. సాంఘిక ఒడంబడిక అభికారులకు సభ్యులకు మధ్య సముచితంగా ఉండాలి. ఒడంబడిక వలన ఏర్పడినది ఒక సజీవమైన సమాజం అయి ఉండాలి. రూసో మానవుని ఒక వ్యక్తిగా కాక ఒక పౌరునిగా భావిస్తాడు.రాజకీయాధికారికి పౌరుడు నైతిక కారణాల వలన బద్దుడౌతాడు.Political Obligation.
జనేచ్చ సిద్ధాంతం' రూసో ప్రతిపాదించిన జనేచ్చ (General Will) సిద్ధాంతం అతని రాజకీయ భావాలలో అత్యంత ప్రధానమైనది. రాజకీయాధికారం ప్రయోజనం, అధికారం ఏర్పడే పద్దతులకంటె రాజకీయాదికారానికి మానవుడు ఎందుకు బద్ధుడై ఉంటాడన్న ప్రశ్నను రూసో ప్రధానంగా చర్చిస్తాడు. రాజకీయాధికారాన్ని మానవులు కొన్ని పరిమిత ప్రయోజనాలను సాధించటానికి మాత్రమే రూపొందించుకోలేదు.పౌర సమాజం ప్రజలందరి సమ్మతిపై ఏర్పడుతుంది. దీనికి సభ్యులందరిని శాసించే అధికారం ఉంది. వీరు సమాజం ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు. అధికారాన్ని శిరసావహిస్తారు. రాజకీయాధికారాన్ని ఎందుకు పౌరులు అంగీకరిస్తారు అనేదాని సంధానం రూసో తన జనేచ్ఛ సిద్ధంతంలో కనిపిస్తుంది.వ్యక్తిగత స్వేచ్ఛ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాస్తవ ఇచ్చ (Actual Will), రెండు నిజమైన ఇచ్ఛ (Real Will). వాస్తమికమైన ఇచ్చ వ్యక్తిని కేవలం తన ప్రయోజనాలను మాత్రమే సాధించేటట్లు చేస్తుంది. నిజమైన ఇచ్చ తత్త్కాలిక ప్రయోజనాలను అదుపులో ఉంచి పరిపూర్ణతను సాధించుకొని, నైతిక ఔన్నత్యాన్ని పెంపొందించుకోమని చెబుతుంది. ప్రతివ్యక్తి తన నిజమైన ఇచ్చద్వారా ప్రభావితుడైనప్పుడు అటువంటి మొత్తం ప్రజల జనేచ్చగా రూపొందుతుంది. జనేచ్చ అంటే ప్రజల ఇచ్చ కాదు లేదా అధిక సంఖ్యాకుల ఇచ్చ కాదు. ప్రతివ్యక్తి ప్రయోజనాన్ని సాధించే ఇచ్చగా మొత్తం సమాజ ప్రయోజనాన్ని కాపాడే ఇచ్చగా జనేచ్చ రూపొందుతుంది.
ఇవీ చూడండి
మార్చు
- జార్జెస్ హెర్బర్ట్, a physical culturist influenced by Rousseau's teachings
- ప్రాకృతిక హక్కులు
- రూసో విద్యా తత్వము
- రూసో సంస్థ
- సోషల్ కాంటాక్ట్
- స్టేట్ ఆఫ్ నేచర్
పాదపీఠికలు
మార్చు- ↑ "Preromanticism Criticism". Enotes.com. Archived from the original on 2010-04-06. Retrieved 2009-02-23.
- ↑ See also Robert Darnton, The Great Cat Massacre, chapter 6: "Readers Respond to Rousseau: The Fabrication of Romantic Sensitivity" for some interesting examples of contemporary reactions to this novel.
మూలాలు
మార్చు- Abizadeh, Arash (2001). "Banishing the Particular: Rousseau on Rhetoric, Patrie, and the Passions" Political Theory 29.4: 556-82.
- Cassirer Ernst, Rousseau, Kant, Goethe, Princeton University Press, Princeton, 1945.
- Conrad, Felicity (2008). "Rousseau Gets Spanked, or, Chomsky's Revenge." The Journal of POLI 433. 1.1: 1-24.
ప్రసిద్ధ పుస్తకాలు
మార్చు- Dissertation sur la musique moderne, 1736
- Discourse on the Arts and Sciences (Discours sur les sciences et les arts), 1750
- Narcissus, or The Self-Admirer: A Comedy, 1752
- Le Devin du Village: an opera, 1752, score PDF (21.7 MB)
- Discourse on the Origin and Basis of Inequality Among Men (Discours sur l'origine et les fondements de l'inégalité parmi les hommes), 1754
- Discourse on Political Economy, 1755
- Letter to M. D'Alembert on Spectacles, 1758 (Lettre à d'Alembert sur les spectacles)
- Julie, or the New Heloise (Julie, ou la nouvelle Héloïse), 1761
- Émile: or, on Education (Émile ou de l'éducation), 1762
- The Creed of a Savoyard Priest, 1762 (in Émile)
- The Social Contract, or Principles of Political Right (Du contrat social), 1762
- Four Letters to M. de Malesherbes, 1762
- Pygmalion: a Lyric Scene, 1762
- Letters Written from the Mountain, 1764 (Lettres de la montagne)
- Confessions of Jean-Jacques Rousseau (Les Confessions), 1770, published 1782
- Constitutional Project for Corsica, 1772
- Considerations on the Government of Poland, 1772
- Essay on the origin of language, published 1781 (Essai sur l'origine des langues)
- Reveries of a Solitary Walker, incomplete, published 1782 (Rêveries du promeneur solitaire)
- Dialogues: Rousseau Judge of Jean-Jacques, published 1782
ఆంగ్ల పుస్తకాలు
మార్చు- Basic Political Writings, trans. Donald A. Cress. Indianapolis: Hackett Publishing, 1987.
- Collected Writings, ed. Roger D. Masters and Christopher Kelly, Dartmouth: University Press of New England, 1990-2005, 11 vols. (Does not as yet include Émile.)
- The Confessions, trans. Angela Scholar. Oxford: Oxford University Press, 2000.
- Emile, or On Education, trans. with an introd. by Allan Bloom, New York: Basic Books, 1979.
ఆన్‌లైన్ పుస్తకాలు
మార్చుగురించి/చే రచింపబడిన మూల కృతులున్నాయి.
- A Discourse on the Moral Effects of the Arts and Sciences English translation
- Confessions of Jean-Jacques Rousseau English translation, as published by Project Gutenberg, 2004 [EBook #3913]
బయటి లింకులు
మార్చు- Jean-Jacques Rousseau Bibliography Archived 2008-05-05 at the Wayback Machine
- Jean-Jacques Rousseau page at Internet Encyclopedia of Philosophy
- Rousseau Association/Association Rousseau Archived 2008-07-12 at the Wayback Machine, a bilingual association devoted to the study of Rousseau's life and works
- Edward Winter, Jean-Jacques Rousseau and Chess
- Jean-Jacques Rousseau, at the Internet edition of Encyclopedia Britannica.