జారే ఆది నారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన అశ్వారావుపేట నియోజకవర్గం నుండి 2023లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

జారే ఆది నారాయణ

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు మెచ్చా నాగేశ్వరరావు
నియోజకవర్గం అశ్వారావుపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1983
గండుగులపల్లి గ్రామం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ, భారతదేశం[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు సత్యనారాయణ

రాజకీయ జీవితం మార్చు

జారే ఆది నారాయణ తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత జరిగిన 2018లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి అవకాశం రాకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేశాడు.

జారే ఆది నారాయణ 2023లో భారత్ రాష్ట్ర సమితి పార్టీని విడి జులై 26న న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి[4], నవంబర్ 6న కాంగ్రెస్ ప్రకటించిన నాల్గొవ జాబితాలో టికెట్ దక్కించుకొని 2023లో శాసనసభ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28905 ఓట్ల భారీ మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[5][6]

మూలాలు మార్చు

  1. Andhrajyothy (4 December 2023). "ఒకే ఊరు నుంచి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. "Jare Adinarayana Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. Andhrajyothy (3 December 2023). "తొలి ఫలితం ఏ పార్టీ ఖాతాలో పడిందంటే?." Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.
  4. V6 Velugu (26 June 2023). "కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న లీడర్స్ వీరే." Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Mana Telangana (3 December 2023). "అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు". Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.