జార్గోస్ సెఫెరిస్
జార్గోస్ సెఫెరిస్ (మార్చి 13, 1900 - సెప్టెంబర్ 20, 1971) 20వ శతాబ్ధంలోని గ్రీకు కవి, దౌత్యవేత్త. 1963లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్నాడు.[2]
జార్గోస్ సెఫెరిస్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | జార్గోస్ సెఫిరియాడిస్ మార్చి 13, 1900 ఉర్లా, టర్కీ |
మరణం | 1971 సెప్టెంబరు 20 ఏథెన్స్, గ్రీస్ | (వయసు 71)
వృత్తి | కవి, దౌత్యవేత్త |
జాతీయత | గ్రీకు |
పూర్వవిద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ పారీస్ |
సాహిత్య ఉద్యమం | ఆధునికవాదం[1] |
పురస్కారాలు | నోబెల్ బహుమతి 1963 |
సంతకం |
జననం విద్యాభ్యాసం
మార్చుజార్గోస్ సెఫెరిస్ 1900, మార్చి 13న ఆసియా మైనర్ (ప్రస్తుత టర్కీ)లోని స్త్మ్రర్ని నగరంలో జన్మించాడు. ఏథెన్స్లోని జిమ్నాజియంలో విద్యను అభ్యసించి, 1918లో తన కుటుంబంతో కలిసి ప్యారిస్‌కు వలస వెళ్లి న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేశాడు.
ఉద్యోగం
మార్చుగ్రీకు దేశపు విదేశీ వ్యవహారాల ప్రతినిధిగా, దౌత్యవేత్తగా, రాయబారిగా 1931-34 మధ్య ఇంగ్లాండ్ లో, 1936-38 మధ్య అల్బేనియాలో, 1948-50 మధ్య అంకారాలో, 1951-53 మధ్య లండన్ లో, 1957-61 మధ్య యునైటెడ్ కింగ్‌డమ్ లో వంటి దేశాల్లో, నగరాల్లో పనిచేశాడు.
రచనా ప్రస్థానం
మార్చురెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో గ్రీస్ నుంచి వెళ్ళిపోయి ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, ఇటలీ వంటి దేశాలలో గడిపాడు. ఆ అనుభవాలను క్రోడీకరించి తన కవిత్వాన్ని రాశాడు. అంతేకాకుండా, దౌత్యవేత్తగా, రాయబారిగా వివిధ దేశాలలో పనిచేసిన అనుభవం జార్గోస్ సెఫెరిస్ సాహిత్య రచనకు ఎంతగానో ఉపయోగపడింది.
కవిత్వం
మార్చు- స్ట్రోఫే (1931)
- ది సిస్టెర్న్ (1932)
- మైథికల్ నరేటీవ్ (1935)
- బుక్ ఆఫ్ ఎక్సర్సైజేస్ (1940)
- షిప్స్ లాగ్ బుక్ I (1940)
- లాగ్ బుక్ II (1944)
- థ్రష్ (1947)
- లాగ్ బుక్ III (1955)
- త్రీ సీక్రెట్ పోయెమ్స్ (1966)
- వ్యాయామాలు బుక్ ఆఫ్ ΙΙ (1976)
మరణం
మార్చుజార్గోస్ సెఫెరిస్ 71ఏళ్ళ వయసులో 1971, సెప్టెంబర్ 20న గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరంలో మరణించాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Eleni Kefala, Peripheral (Post) Modernity, Peter Lang, 2007, p. 160.
- ↑ నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (11 March 2019). "జార్గోస్ సెఫెరిస్". మామిడి హరికృష్ణ. Archived from the original on 23 March 2019. Retrieved 23 March 2019.
- ↑ "George Seferis Dies at 71; Poet W on '63 Nobel Prize". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 1971-09-21. ISSN 0362-4331. Retrieved 23 March 2019.