జార్జ్ డికిన్సన్

న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు, రగ్బీ యూనియన్ ఆటగాడు

మూస:Infobox rugby biography

జార్జ్ రిచీ డికిన్సన్ (1903, మార్చి 11 - 1978, మార్చి 17) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు, రగ్బీ యూనియన్ ఆటగాడు. 1930 - 1932 మధ్యకాలంలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున మూడు టెస్టులు ఆడాడు. 1922లో న్యూజీలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆల్ బ్లాక్స్ కోసం ఐదు మ్యాచ్‌లు ఆడాడు.

క్రీడా జీవితం

మార్చు

ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. డికిన్సన్ 1924-25 సీజన్‌లో విక్టోరియాతో జరిగిన క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు "డబుల్ ఆల్ బ్లాక్ " అని పిలవబడే మొదటి ఆటగాడు అయ్యాడు.[1] 1927-28లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాడు. తర్వాత న్యూజీలాండ్ మొదటి రెండు అధికారిక టెస్టులు, 1929-30లో ఇంగ్లాండ్‌తో, 1931-32లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడాడు. తన మూడు టెస్టుల్లో 30.62 సగటుతో ఎనిమిది వికెట్లు తీశాడు.

1920-21 నుండి 1937-38 వరకు ఒటాగో తరపున ఆడాడు. 1943-44 సీజన్‌లో వెల్లింగ్టన్ తరపున ఒక మ్యాచ్ ఆడాడు. 1928 ఫిబ్రవరిలో టూరింగు ఆస్ట్రేలియన్‌లతో ఒటాగో ఆడిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాడు. మొదటి ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌లలో ఏడుగురిని అవుట్ చేశాడు. ఒక దశలో ఐదు ఓవర్లలో మూడు పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. 96 పరుగులకు 7 వికెట్లతో తీశాడు.[2] 1924-25లో కాంటర్‌బరీపై 43 పరుగులకు 6 వికెట్లు, 46 పరుగులకు 5 వికెట్లు, తరువాతి సీజన్‌లో వెల్లింగ్‌టన్‌పై 90 పరుగులకు 7 వికెట్లు, 55 పరుగులకు 4 వికెట్లు తీశాడు. 1927-28లో వెల్లింగ్టన్‌పై ఒక సెంచరీతో (104 పరుగులు) లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు.[3]

తరువాతి జీవితం

మార్చు

డికిన్సన్ సేల్స్‌మ్యాన్‌గా,[4] స్టోర్ మేనేజర్‌గా,[5] క్లర్క్‌గా పనిచేశాడు.[6]

1978, మార్చి 17న లోయర్ హట్‌లో మరణించాడు.[3] అతని చితాభస్మాన్ని టైటా లాన్ స్మశానవాటికలో ఖననం చేశారు.[6]

మూలాలు

మార్చు
  1. Meikle, Hayden (16 September 2011). "Greatest moments in Otago sport - number 53". Otago Daily Times. Retrieved 21 January 2017.
  2. . "Dickinson's Bowling Feat".
  3. 3.0 3.1 Knight, Lindsay. "George Dickinson". New Zealand Rugby Union. Retrieved 21 January 2017.
  4. Electoral district of Dunedin West: general roll of persons entitled to vote for Members of Parliament of New Zealand. 1928. p. 49.
  5. "New Zealand, World War II ballot lists, 1940–1945". Ancestry.com Operations. 2014. Retrieved 21 January 2017.
  6. 6.0 6.1 "Deceased search". Hutt City Council. Archived from the original on 2 February 2017. Retrieved 21 January 2017.