జింకా రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, పాత్రికేయుడు. గ్రామీణ జీవన శైలి నేపథ్యంలో చిత్రాలు గీసే రామారావు, గీతాంజలి కావ్యంలోని 103 ఖండికల పరమార్థాన్ని వివరిస్తూ వివిధ చిత్రాలు గీసాడు.[1]

జింకా రామారావు
జింకా రామారావు చిత్రకారుడు
జననం(1946-11-29)1946 నవంబరు 29
సత్తెనపల్లి, గుంటూరు జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు
తండ్రికోటయ్య
తల్లిసుబ్బమ్మ

ఇతను 1946, నవంబరు 29న గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కోటయ్య, తల్లి సుబ్బమ్మ.[1]

చిత్రకళా ప్రస్థానం

మార్చు

తన కుటుంబంలో ఎవరికీ చిత్రకళలో అనుభవం లేదు. రామారావు తన మూడవ తరగతి నుంచే ప్రతి రోజు కొత్తకొత్త బొమ్మలను వేయడానికి ప్రయత్నించేవాడు. పాఠశాలో బలపంతో పలక బొమ్మలు గీస్తే రామారావు పక్కన వున్న పిల్లలు ఆ బొమ్మలను మాష్టారుకి చూపించేవారు. అది చూసిన మాష్టారు 'నువ్వు బాగా గీస్తున్నావురా, నీకు మంచి భవిష్యత్తుంటుంది' అని ప్రోత్సహించేవాడు. నాలుగో తరగతిలో పలక మీద గీసిన బుద్ధుడి బొమ్మ ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కలకత్తాలోని శాంతినికేతన్‌లో చిత్రకళను అభ్యసించిన మల్లం గురవయ్య దగ్గర చిత్రకళలో మెళుకువలు నేర్చుకున్నాడు. గీతాంజలి కావ్యంలోని ప్రతి ఖండిక భావాన్ని తన చిత్రాలలో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ 103 గీతాలకు గీయడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది.[1]

పురస్కారాలు

మార్చు

ఇప్పటివరకు దాదాపుగా 400లకు పైగా పెయింటింగ్స్ వేసిన రామారావు అనేక పురస్కారాలు అందుకున్నాడు.[1]

  1. భోగరాజు పట్టాభి సీతారామయ్య సంస్థ పురస్కారం
  2. అంతర్జాతీయ యునెస్కో పురస్కారం
  3. సత్తెనపల్లిలోని ప్రగతి కళాభవన్ పురస్కారం
  4. 2015 సం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం

ఇతర విషయాలు

మార్చు

సినీ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా జింకా రామారావు బొమ్మలు వేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 మన తెలంగాణ, దునియా (3 January 2019). "జింకా జీవకళ". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.
  2. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపన్ పేజీ) (16 August 2020). "నాలో దాగిన చిత్రకళ నాతో పాటే ప్రయాణించింది!". www.andhrajyothy.com. Archived from the original on 28 September 2020. Retrieved 12 December 2020.

వెలుపలి లంకెలు

మార్చు