సత్తెనపల్లి
ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం లోని పట్టణం
సత్తెనపల్లి గుంటూరు జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641. ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం.
ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప, ప్రత్తి విరివిగా పండిస్తారు.
మండలంలోని పట్టణాలుసవరించు
- సత్తెనపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
శ్రీ శరభయ్య గుప్తా పాఠశాల.
ప్రముఖులుసవరించు
- వావిలాల గోపాలకృష్ణయ్య
- ఉన్నవ లక్ష్మీనారాయణ
- బ్రహ్మానందం
- మనో (నాగూర్ బాబు)
- గుర్రం హరికృష్ణ
- పుతుంబాక భారతి
- పుతుంబాక వెంకటపతి
- డి.వి.నరసరాజు
ప్రముఖుల విశేషాలుసవరించు
- కన్నెగంటి బ్రహ్మానందాచారి ఉరఫ్ కన్నెగంటి బ్రహ్మానందం సొంతవూరు సత్తెనపల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల. సత్తెనపల్లి 'ప్రగతి కళామండలి' సంస్థ వెన్నుదన్నుతో మిమిక్రీ కళాకారుడిగా జన్మ తీసుకున్నారు. ప్రగతి కళామండలి వ్యవస్థాపకులు పత్రి జగన్నాథరావు గారు, వెంకట్రావు గారు తదితరుల సాయంతో కళాకారుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'పకపకలు' కార్యక్రమంతో దూరదర్శన్ ద్వారా యావదాంధ్రకూ పరిచయమయ్యారు, చాలాకాలంపాటు దూరదర్శన్‌లో ఆ ఫీచర్ నడిచిన విషయం మీలో చాలామందికి గుర్తుండేవుంటుంది. అనంతరం అత్తిలి కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తూ సినిమారంగంలోకి ప్రవేశించారు. వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం 1987లో సినిమారంగ ప్రవేశం చేసిననాటినుంచీ ఈనాటి దాకా (1996, 2000, 2001 సంవత్సరాలు మినహాయించి) ప్రతి ఏటా నందిఅవార్డుల్లో స్థానం సంపాదించుకుంటూనేవచ్చారు. ఆయన కెరియర్ మొత్తం సత్తెనపల్లి తోనే ముడిపడివుంది.
- జానీ లీవర్ అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జనుముల జాన్ ప్రకాశరావు' ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్యక్రమంలో ప్రముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవర్ జానీ లీవర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయన సినిమా పేరుగా స్థిరపడింది. కుటుంబం ఆర్థికంగా అనేక కష్టనష్టాలు అనుభవించిన సమయంలో జానీలీవర్‌ను సత్తెనపల్లికి చెందిన ఆయన మిత్రులు ఆదుకున్నారు. ఆయన స్నేహితుడు, శరభయ్య ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ వెలుగూరి విజయ వెంకట లక్ష్మీనారాయణ జానీలీవర్ కళాకారుడిగా ముంబయిలో స్థిరపడడానికి ఎంతో సాయపడ్డారు. ఇవ్వాళ్టికీ చాలా తరచుగా జానీలీవర్ సందర్శించే రెండు తెలుగు ప్రాంతాలు కనిగిరి, సత్తెనపల్లి మాత్రమే. జానీలీవర్‌కూ సత్తెనపల్లిలో మంచి మిత్రులున్నారు. తన కెరియర్‌కి సత్తెనపల్లి చాలా సాయపడిందని అనేక సందర్భాల్లో జానీలీవర్ చెప్పారు. బ్రహ్మానందం ఒకేఒక్క హిందీ చిత్రం 'వెల్‌కమ్‌బాక్'లో చేస్తే, జానీలీవర్ ఒకేఒక్క తెలుగు చిత్రం 'క్రిమినల్' (మహేష్‌భట్)లో చేశారు.
- జింకా రామారావు, చిత్రకారుడు, పాత్రికేయుడు.[1]
విద్యుత్తు విశేషాలుసవరించు
జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసినది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి, ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు. [1]
మూలాలుసవరించు
- ↑ మన తెలంగాణ, దునియా (3 January 2019). "జింకా జీవకళ". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.