జింకు అయోడైడ్ ఒక రసాయన సంయోగ పదార్థము.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం.జింకు/యశదం, అయోడిన్ మూలకాల సమ్మేళనం వలన ఈ సంయోగ పదార్థం ఏర్పడినది.ఒక అణువు జింకు అయోడైడ్ లో ఒక పరమాణువు జింకు, రెండు పరమాణువుల అయోడిన్ ఉండును. జింకు అయోడైడ్ యొక్క రసాయన సాంకేతిక పదం ZnI2.

జింకు అయోడైడ్
పేర్లు
IUPAC నామము
Zinc iodide
ఇతర పేర్లు
Zinc(II) iodide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10139-47-6]
పబ్ కెమ్ 66278
SMILES I[Zn]I
ధర్మములు
ZnI2
మోలార్ ద్రవ్యరాశి 319.22 g/mol
స్వరూపం white solid
సాంద్రత 4.74 g/cm3
ద్రవీభవన స్థానం 446 °C (835 °F; 719 K)
బాష్పీభవన స్థానం 1,150 °C (2,100 °F; 1,420 K) decomposes
450 g/100mL (20 °C)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal, tI96
I41/acd, No. 142
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము External MSDS
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Cadmium iodide
Mercury(I) iodide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఉత్పత్తి మార్చు

జింకు, అయోడిన్ లను నేరుగా రిప్లక్సింగ్ ఈథర్ లో రసాయన చర్య నొందించడం ద్వారా ఉత్పత్తి చెయ్యవచ్చును.[1] సజల ద్రావణ స్థితిలో జింకును అయోడిన్‌తో చర్య జరిపించడం వలన కూడా జింకు అయోడైడ్ సంయోగ పదార్థాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును:[2] Zn + I2→ ZnI2

భౌతిక లక్షణాలు మార్చు

జింకు అయోడైడ్ తెల్లని ఘనపదార్థం. ఇది ఆర్ద్రతాకర్షణ (hydroscopic) సంయోగపదార్థం.అందువలన అనార్ద్ర (anhydrous ) పదార్థం గాలిలోని చెమ్మను త్వరగా గ్రహించి ఆర్ద్ర రూపాన్ని సంతరించు కుంటుంది. జింకు అయోడైడ్ యొక్క అణుభారం 319.22 గ్రాములు/మోల్. సాధారణ ఉష్ణోగ్రత వద్ద జింకు అయోడైడ్ సాంద్రత 4.74 గ్రాములు/ సెం.మీ3[3]. జింకు అయోడైడ్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 446 °C(835 °F;719 K).జింకు అయోడైడ్ సమ్మేళనపదార్థం బాష్పీభవన స్థానం 1,150 °C (2,100 °F; 1,420K).అయితే బాష్పీభవన ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును.జింకు అయోడైడ్ నీటిలో కరుగుతుంది.20 °C వద్ద 100 మి.లీ నీటిలో 450 గ్రాముల జింకు అయోడైడ్ కరుగుతుంది. జింకు అయోడైడ్ యొక్క ఫ్లాష్ పాయింట్ 625 °C (1,157 °F; 898K) [4]

రసాయన చర్యలు మార్చు

1150 °C వద్ద జింకు అయోడైడ్ ఆవిరులు(vapours) జింకు, అయోడిన్ గా విఘటన చెందును.

నిర్మాణం మార్చు

సజల ద్రవణులలో అష్ట భుజ సౌష్టవమున్న Zn(H2O)62+, [ZnI(H2O)5]+ ను, చతుర్భుజ సౌష్టవమున్న ZnI2(H2O)2, ZnI3(H2O) −and ZnI42−.లను గుర్తించారు.

వినియోగం మార్చు

  • ఇండస్ట్రీయల్ రేడియోగ్రఫిలో తరచుగా ఎక్సు-రే ఒపక్యు పెనేట్రాంట్(opaque penetrant) గా జింకు అయోడైడ్ ను ఉపయోగిస్తారు.
  • ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిలో ఒస్మియం టెట్రాక్సైడ్ తో కలిపి జింకు అయోడైడ్ ను స్టైన్(stain) గా ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి మార్చు

అధారాలు/మూలాలు మార్చు

  1. Eagleson, M. (1994). Concise Encyclopedia Chemistry. Walter de Gruyter. ISBN 3-11-011451-8.
  2. DeMeo, S. (1995). "Synthesis and Decomposition of Zinc Iodide: Model Reactions for Investigating Chemical Change in the Introductory Laboratory". Journal of Chemical Education. 72 (9): 836. doi:10.1021/ed072p836.
  3. "Zinc iodide". sigmaaldrich.com. Retrieved 2016-02-17.
  4. Wells, A. F. (1984). Structural Inorganic Chemistry (5th ed.). Oxford Science Publications. ISBN 0-19-855370-6.