జింకు బ్రోమైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక అకర్బన సమ్మేళనపదార్థం.జింకు, బ్రోమిన్ మూలకాల సమ్మేళనం వలన ఏర్పడిన రసాయన పదార్థం.జింకు బ్రోమైడ్‌ రసాయనిక సంకేత పదంZnBr2.

జింకు బ్రోమైడ్
Zinc bromide
Zinc bromide
పేర్లు
IUPAC నామము
Zinc bromide
ఇతర పేర్లు
Zinc(II) bromide,
Zinc dibromide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7699-45-8]
పబ్ కెమ్ 24375
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య ZH1150000
SMILES Br[Zn]Br
ధర్మములు
ZnBr2
మోలార్ ద్రవ్యరాశి 225.198 g/mol
స్వరూపం white crystalline powder
hygroscopic
సాంద్రత 4.20 g/cm3 (20 °C)
4.22 g/cm3 (25 °C)
ద్రవీభవన స్థానం 394 °C (741 °F; 667 K)
బాష్పీభవన స్థానం 697 °C (1,287 °F; 970 K)
311 g/100 mL (0 °C)
447 g/100 mL (20 °C)[1]
538 g/100 mL (100 °C)[2]
ద్రావణీయత very soluble in alcohol, ether, acetone, tetrahydrofuran
వక్రీభవన గుణకం (nD) 1.5452
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము External MSDS
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Cadmium bromide,
Mercury(II) bromide,
Calcium bromide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

జింకు బ్రోమైడ్ రంగులేని ఘనపదార్థం. జింకు క్లోరైడ్ తో పలు గుణాలలో, లక్షణాలలో పోలిక కలిగి ఉంది.ఇది నీటిలోనూ, సేంద్రియ ద్రావణాలలో కరుగుతుంది.నీటిలో కరగడం వలన ఆమ్లద్రావణులను ఏర్పరచును.జింకు బ్రోమైడ్ అర్ద్రతాకర్షణ(hygroscopic) గుణం కలిగిన రసాయన సంయోగ పదార్థం. అర్ద్రతాకర్షణవలన రెండు జలాణువులనుకలిగిన జింకు బ్రోమైడ్ (ZnBr2• 2H2O) ను ఏర్పరచును.జింకు బ్రోమైడ్ అణుభారం 225.198 గ్రాములు /మోల్.20 °C వద్ద జింకు బ్రోమైడ్ సాంద్రత 4.20గ్రాములు/సెం.మీ3.జింకు బ్రోమైడ్ ద్రవీభవన స్థానం/ద్రవీభవన ఉష్ణోగ్రత 394 °C (741 °F; 667K)., బాష్పీభవన స్థానం 697 °C (1,287 °F; 970K).నీటిలో కరుగుతుంది. జింకు బ్రోమైడ్ 100 మి.లీ నీటిలో 20°Cవద్ద 447 గ్రాములు,100°Cవద్ద 538గ్రాములు కరుగుతుంది.అలాగే ఆల్కహాల్, ఈథర్, అసిటోన్, టెట్రాహైడ్రోఫురాన్ లలో కరుగుతుంది.బ్రోమైడ్వక్రీభవన గుణకం/ వక్రీభవనసూచిక 1.5452.

ఉత్పత్తి

మార్చు

జింకు ఆక్సైడ్ లేదా జింకు లోహాన్ని హైడ్రోబ్రోమిక్ ఆమ్లంతో రసాయనికచర్య జరపరడం వలన రెండు జలాణువులను కలిగిన జింకు బ్రోమైడ్ ఏర్పడును.

ZnO + 2HBr + H2O →ZnBr2•2H2O

ఇలా ఏర్పడిన ఆర్ద్ర జింకు బ్రోమైడ్‌ను కార్బన్ డైఆక్సైడ్ నిర్జలికరణ(dehydrate) చెయ్యడం వలన లేదా జింకు లోహంతో బ్రోమిన్మూలకాన్ని చర్య జరిపిం చడం వలన కూడా అనార్ద్ర జింకు బ్రోమైడ్ ఉత్పత్తి అగును.

అణునిర్మాణం

మార్చు

అణునిర్మాణం సౌష్టవ పరంగా జింకు అయోడైడ్ను పోలి ఉంది.

ఉపయోగాలు

మార్చు
  • సేంద్రియ రసాయన శాస్త్రంలో లేవిస్ ఆమ్లంగా ఉపయోగిస్తారు.
  • జింకు బ్రోమైడ్ బ్యాటరిలలో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.
  • ఆయిల్, నాచురల్ గ్యాస్ బావులలో డ్రిల్లింగ్‌మడ్ కు ప్రత్యామ్నాయముగా వాడెదరు.
  • జింకు బ్రోమైడ్ ద్రావణాన్ని రెడియేసన్ కు నిరోధించుటకు పారదర్శక షీల్డ్ గా ఉపయోగిస్తారు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. Patnaik, P. (2003). Handbook of Inorganic Chemicals. McGraw-Hill Professional. ISBN 0-07-049439-8.
  2. "Zinc Bromide". Chemicalland21.