జిగర్ మురాదాబాదీ
అలీ సికందర్ (1890 ఏప్రిల్ 6 - 1960 సెప్టెంబరు 9), జిగర్ మొరాదాబాదీ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన భారతీయ ఉర్దూ కవి, గజల్ రచయిత. ఆయన తన కవితా సంకలనం "అతిష్-ఎ-గుల్" కోసం 1958లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. ఆయన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన రెండవ కవి (మొహమ్మద్ ఇక్బాల్ తరువాత).[1]
జిగర్ మురాదాబాదీ | |
---|---|
జననం | సికిందర్ అలీ 1890 ఏప్రిల్ 6 |
మరణం | 1960 సెప్టెంబరు 9 గొండా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | (వయసు 70)
వృత్తి | కవి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సాంప్రదాయ ఉర్దూ కవిత్వం గజల్ |
గుర్తించదగిన సేవలు | డాగ్-ఎ-జిగర్(1928) షోలా-ఎ-తుర్ (1932) ఆతీష్-ఎ-గుల్ (1954) దివాన్-ఎ-జిగర్ |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | సాహిత్య అకాడమీ అవార్డు (1958) |
జీవితచరిత్ర
మార్చుఅతను మొరాదాబాద్ లో అరబిక్, పర్షియన్, ఉర్దూలలో ఓరియంటల్ విద్యను పొందాడు. ఆ తరువాత, ఆయన ట్రావెలింగ్ సేల్స్ మాన్ గా పనిచేయడం ప్రారంభించాడు.[2]
వారసత్వం
మార్చుఆయన సూఫీ కవిత్వం యే హై మైకాడా సాబ్రీ బ్రదర్స్, అజీజ్ మియాన్, మున్ని బేగం, అత్తాఉల్లా ఖాన్ ఇసాఖేల్వి వంటి అనేక మంది సూఫీ గాయకులు పాడారు.
ప్రశంసలు
మార్చుజిగర్ మొరాదాబాది గజల్ రచన శాస్త్రీయ పాఠశాలకు చెందినవాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ గీత రచయితగా మారి ఉర్దూలో అనేక ప్రసిద్ధ పాటలను రాసిన మజ్రూహ్ సుల్తాన్పురి కి గురువు.[3]
ప్రముఖ ఉర్దూ కవి, విద్యావేత్త అయిన ఫైజ్ అహ్మద్ ఫైజ్, జిగర్ మొరాదాబాదీని తన రంగంలో నైపుణ్యం కలిగిన హస్తకళాకారుడిగా కొనియాడారు.[4]
జిగర్ ఫెస్ట్-2018
మార్చుజిగర్ పుట్టినరోజును జరుపుకోవడానికి ప్రోగ్రెసివ్ ఫౌండేషన్ 2018లో మొరాదాబాద్ లో మూడు రోజుల జిగర్ ఫెస్ట్ ను నిర్వహించింది.
మొదటిరోజు-ముషాయిరా బై రాహత్ ఇందోరి, వాసిమ్ బరేల్వి మొదలైనవి, రెండవరోజు-కవ్వాలి నైట్స్ బై చాంద్ ఖాద్రి డే వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, చివరిరోజు షీబా ఆలం చేత మ్యూజికల్ నైట్ ఆలరించింది.
మూలాలు
మార్చు- ↑ "Jigar Moradabadi - Profile & Biography". Rekhta (in ఇంగ్లీష్). Retrieved 2024-03-21.
- ↑ 2.0 2.1 Amaresh Datta (1988). Encyclopaedia of Indian Literature. New Delhi: Sahitya Akademi. p. 1838. ISBN 978-81-260-1194-0. Retrieved 10 December 2017.
- ↑ Service, Tribune News. "Pluralism in verse". Tribuneindia News Service (in ఇంగ్లీష్).
- ↑ "An afternoon with Faiz". The Hindu. 2011-03-06. Retrieved 2017-12-09.