జితన్ రమేష్ (జననం 1982 అక్టోబరు 23) భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత.[1] తమిళ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను ప్రముఖ నిర్మాత ఆర్. బి. చౌదరి కుమారుడు.

జితన్ రమేష్
జననం
రమేష్ చౌదరి

(1982-10-23) 1982 అక్టోబరు 23 (వయసు 41)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లురమేష్
వృత్తినటుడు, సినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
తల్లిదండ్రులుఆర్. బి. చౌదరి
బంధువులుజీవా (సోదరుడు)

కెరీర్ మార్చు

జితన్ రమేష్ గా ప్రసిద్ది చెందిన రమేష్ చౌదరి తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో నటుడిగా 2005లో అడుగుపెట్టాడు. అతని తండ్రి ఆర్. బి. చౌదరి, ప్రముఖ సినీనిర్మాత. అలాగే సోదరుడు జీవా(అమర్ చౌదరి) తమిళ నటుడు.

2006లో విడుదలైన జితన్ చిత్రంలో రమేష్ చౌదరి ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2011లో వచ్చిన వానం సినిమాతో నిర్మాతగా మారాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

జితన్ రమేష్ తండ్రి ఆ. బి. చౌదరి మార్వాడీ మాట్లాడే రాజస్థానీ వలసదారులకు చెన్నైలో జన్మించిన మార్వాడీ. జితన్ రమేష్ చెన్నైలో రాయపేటలోని గిల్ ఆదర్శ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదివాడు. అతను డి.జి వైష్ణవ్ కళాశాల నుండి తన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పూర్తి చేశాడు. అతను ఫిబ్రవరి 2006లో శిల్పాను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె తోష్నా, కుమారుడు ప్రిషాన్ ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "Actor Jithan Ramesh again re entry to industry - Sakshi". web.archive.org. 2023-01-12. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)