ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.[1] తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు, తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు జీవా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.

ఆర్. బి. చౌదరి
వృత్తిసినీ నిర్మాత
జీవిత భాగస్వామిమహెజబీన్
పిల్లలు
  • సురేష్ చౌదరి
  • జీవన్ చౌదరి
  • జీవా
  • జితన్ రమేష్

నేపథ్యం

మార్చు

ఈయన అసలు పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. ఈయన రాజస్థానీ కుటుంబానికి చెందిన వాడు.[2] ఈయన ఉక్కు, ఎగుమతులు, నగలు మొదలైన వ్యాపారాలు చేసి తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు.

నిర్మాత

మార్చు

మొదటగా మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించాడు. సూపర్ అనే పేరుతో సినిమాలు నిర్మించాడు. 1989 నుంచి తమిళ సినిమాల నిర్మాణం మొదలు పెట్టాడు. చౌదరి తన నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ ద్వారా నిర్మించబడిన నాలుగు సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. ఈ సంస్థ ద్వారా అనేకమంది నూతన దర్శకులను, నటీ నటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాడు.[3]

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్. బి. చౌదరి". tollywoodtimes.com. టాలీవుడ్ టైమ్స్. Retrieved 15 November 2016.[permanent dead link]
  2. "Jiiva: I traveled from Kashmir to Kanyakumari for 'Gypsy'!". Sify (in ఇంగ్లీష్). 21 May 2019. Archived from the original on 21 May 2019. Retrieved 2022-10-11. My mom is a Tamilian, dad is a Rajasthani and wife is a Punjabi.
  3. "Team 'Dwaraka' speaks". indiaglitz.com. Archived from the original on 2 జనవరి 2017. Retrieved 15 November 2016.
  4. "Dwaraka Gets U/A from Censor". deccanreport.com. దక్కన్ రిపోర్ట్. Retrieved 15 November 2016.[permanent dead link]

బయటి లింకులు

మార్చు