శ్రీపాద జిత్ మోహన్ మిత్ర

గాయకుడు, నటుడు
(జిత్ మోహన్ మిత్రా నుండి దారిమార్పు చెందింది)

శ్రీపాద జిత్ మోహన్ మిత్రా ఒక సుప్రసిద్ధ గాయకుడు. గాయకునిగా తన స్వరంతో ఆరు దశాబ్దాలకు పైగా అలరిస్తూ, నటుడిగా, క్రీడాకారునిగా, రాజకీయ కార్యకర్తగా, సహకారవాదిగా, సంఘసేవకునిగా, మానవతావాదిగా, న్యాయవాదిగా విభిన్న అంశాల్లో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వివిధ రంగాల్లో ఆయన కృషికిగాను రాజమహేంద్రవరంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

బాల్యం మార్చు

ఆంధ్రా కిషోర్‌కుమార్‌గా పేరొందిన జిత్‌ మోహన్‌ మిత్ర నటునిగా, గాయకునిగా గోదావరి జిల్లాల వాసులకే గాక యావత్‌ సినీ లోకానికి పరిచయం. జిత్‌ విద్యార్థి దశ నుంచే మంచి గాయకుడిగా రాణించిన మన జిత్‌ హిందీ పాటల ఆలాపనలో దక్షిణాదివారినే గాక ఉత్తరాది ప్రముఖులను ఆకట్టుకుంటున్నారు. జిత్‌ సోదరు లైన శ్రీపాద పట్టాభి నాటక రంగానికి ఎరుకే. బాపు, రమణలు, పట్టాభి ఏరా అంటే ఏరా అని సంబోధించుకునేవారట.

జననం మార్చు

శ్రీపాద కృష్ణమూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు 30 మార్చి 1943లో రాజమహేంద్రవరంలో జన్మించిన శ్రీ జిత్ కు 5గురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెళ్లు. శ్రీ జిత్ భార్య ఆర్ అండ్ బిలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేసి రిటైరయ్యారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. బికాం బి ఎల్ చదివి కొంతకాలం హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసారు.

గాయకుడిగా మార్చు

మున్సిపల్ హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అంటే 1954లో "ఓ దునియాకే రఖ్ వాలే" (బైజు బావురా) అనే హిందీ పాటతో గాయకునిగా పరిచయం అయిన శ్రీ జిత్ 1970లో సొంతంగా జిత్ మోహన్ ఆర్కెస్ట్రా ఏర్పాటుచేసుకుని, దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 6వేల ప్రదర్శనలు ఇచ్చారు. 73ఏళ్ళ వయస్సు దాటినా ఇంకా కుర్రాడిగా స్టెప్పులువేస్తూ, శ్రోతలను ఉర్రుతలూగించడం ఈయన ప్రత్యేకత.హిందీ గాయకుడు కిషోర్ కుమార్ ని బాగా అభిమానించే ఈయన కిషోర్ పాటలనే ఎక్కువగా పాడడం విశేషం.

ఎందరికో సత్కారం మార్చు

  1. జిత్‌ అనేక మందిని ఆయా సందర్భాల్లో రాజమహేంద్రవరం తీసుకొచ్చి సత్కరించారు. గానకోకిలలు లీల, జిక్కీ, దర్శకుడు కె.విశ్వనాధ్‌, జంధ్యాల, సంగీత దర్శకుడు జె.వి .రాఘవులు, మిమిక్రీ ఆర్టిస్టు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్‌, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలు, కోటి, తదితరులను సత్కరించారు. చలనచిత్ర వందేళ్ల పండుగ రాజమహేంద్రవరంలో నిర్వహించి, సినీ గానవిశారద ఎస్వీ రామారావు తదితరులను తీసుకొచ్చారు.

నిర్వహించిన కార్యక్రమాలు

  1. 1995లో జిత్ గానానికి 25 ఏళ్ళు నిండిన సందర్భంగా సిల్వర్‌ జుబ్లీ.
  2. 1999లో నవరస నట సమాఖ్య స్థాపన.
  3. 2000 సంవత్సరంలో చలనచిత్ర సంగీత సప్తాహం,
  4. 2001లో శ్రుతిలయ సమాఖ్య స్ధాపన.
  5. 2004, 2005 సంవత్సరంలో గాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తయినందుకు నవాంబరాలు, డిసెంబరాలు, కనకాంబరాలు కార్యక్రమాల నిర్వహణ.
  6. 2014లో జిత్ గాన వజ్రోత్సవం

సినీ రంగ ప్రవేశం మార్చు

బాపు దర్శకత్వంలో 1975లో వచ్చిన ముత్యాలముగ్గు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన జిత్ దాదాపు 210 సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, వంశ వృక్షం, ఆనంద భైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నం గారబ్బాయి, సర్ గమ్, సుర్ సంగమ్, బెండు అప్పారావు ఆర్ఎంపి ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. ముద్దమందారం సినిమాలో 'నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి' పాటను ఈయనే పాడారు. ఇక శంకరాభరణంలో 'హల్లో శంకరశాస్త్రి' పాటలో నటించింది ఈయనే.

సినిమా వాళ్లకు బాసటగా మార్చు

ముఖ్యంగా గోదావరి అందాలను తెరకెక్కించడంలో ఈయన పాత్ర విశిష్టమైంది. సినీ దర్శకులకు, నిర్మాతలకు జిత్‌ ఆపద్భాందవుడు. ఆయన భరోసాతోనే ఈ ప్రాంతంలో ఎన్నో సినిమాలు షూటింగ్‌ చేసుకున్నాయి. గోదావరి తీరాన అవుట్ డోర్ షూటింగ్ లకు సంబంధించి, బాపు, కె విశ్వనాధ్, ఈవీవీ సత్యనారాయణ తదితరులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. ఇక తన ఆర్కెష్ట్రా ద్వారానే నూతన్ ప్రసాద్‌, ఆలీని చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఇప్పటికే ఆలీ అనేక సభలో "మా గురువు జిత్‌ మోహన్‌ మిత్రాయే"నని చెప్పడం అందుకు నిదర్శనం. సినీ రంగంలో తనకున్న పరిచయాలతో ఎందరినో ఎందరినో కళా రంగానికి పరిచయం చేయగా, వారు ఉన్నత స్ధానాల్లో ఉన్నారు. కళా రంగానికి, సినీ రంగానికి ఎంతో సేవ చేసిన జిత్‌కు ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు రాలేదు.

అవార్డులు-రివార్డులు మార్చు

  1. ఇక కాలేజీ రోజుల్లో క్రీడాకారుడైన జిత్ 1970నుంచి వరుసగా నాలుగుసార్లు బంగారు పతకాలు సాధించారు. జాతీయ స్థాయి బాల్ బాడ్మింటన్, కబడ్డీ పోటీల్లో విన్నర్ గా నిలిచారు. వెటరన్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి పోటీల్లో షాట్ ఫుట్, హేమార్ త్రో, జావెలిన్, ఈవెంట్లలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు.

సన్మానాలు-సత్కారాలు[1][2] మార్చు

  1. ఆంధ్రదేశంలో పలు చోట్ల అవార్డులు రివార్డులు అందుకున్న జిత్ 1992లో ముంబైలో ఆంధ్ర మహాసభ వారు విశిష్ట పురస్కారంతో సత్కరించారు.
  2. మధ్య ప్రదేశ్ తెలుగు అకాడమీ కిరండోల్ లో 1988లో ప్రత్యేక సన్మానం చేసి, గౌరవించింది.
  3. 1986లో ఒరిస్సాలో తెలుగు సంఘం ఖుర్దా రోడ్ లో సత్కారం చేసింది.
  4. తమిళనాడు - కర్ణాటక లలో కూడా పలు సన్మానాలు అందుకున్నారు.
  5. 2004లో పట్టపగలు అనంత రామలక్ష్మి, ప్రతిభా పురస్కారం.
  6. 2014లో గాయకునిగా వజ్రోత్సవం సందర్భంగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతులమీదుగా సత్కారం.
  7. సెప్టెంబర్ 2016లో హైదరాబాద్ లో ఘన సన్మానం.
  8. 25సెప్టెంబర్ 2016లో రాజమహేంద్రవరం జీవిత సాఫల్య పురస్కారం.

పదవులు మార్చు

  1. రాజమహేంద్రవరం ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బాంక్ డైరెక్టర్ గా నాలుగుసార్లు, ఆలాగే వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసారు.
  2. రాజమహేంద్రవరం కాస్మాపాలిటన్ క్లబ్ అధ్యక్షునిగా 3దఫాలు పనిచేసారు
  3. వెటరన్ అథ్లెట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా 15 ఏళ్ళు పనిచేసారు.
  4. సినీ జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా 12 ఏళ్ళు సేవలందించారు.
  5. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ సభ్యునిగా 2014వరకూ పనిచేసారు.
  6. కేంద్ర సెన్సార్ బోర్డు (ప్రాంతీయ విభాగం) మెంబర్ గా 2005 నుంచి పనిచేసారు.
  7. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ గా పనిచేసారు.
  8. ఎపి కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం సారథిగా పనిచేసారు.

ఇష్టమైన వాళ్ళు : డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, హిందీ గాయకుడు కిషోర్ కుమార్, కళాతపస్వి కె విశ్వనాధ్ అందుకే జిత్ గురించి పద్మశ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఇలా అన్నారు 'మేమిద్దరం మిత్రులం. గాయ'కులం'. స్వగోత్రీ'కులం'. వారి ఇంటిపేరు 'శ్రీ'పాద వారు. మా ఇంటిపేరు 'శ్రీ'పతి పండితారాధ్యులవారు. మా ఇద్దరికీ ఇంతటి విశేష సంబంధముంది. సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు, సామాజిక ప్రముఖులు, సాదాసీదా శ్రోతలు ఇలా అందరికి జిత్ ఆత్మీయుడే'

ఇతర లింకులు మార్చు

[3] [4]

మూలాలు మార్చు