ఎస్.ఎం.జియాఉద్దీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన 24 ఏళ్ళు వయస్సులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జియాఉద్దీన్
తరువాత షేక్ సుభాని

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 – 2004
నియోజకవర్గం గుంటూరు-1 నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
బంధువులు లాల్‌జాన్ బాషా

రాజకీయ జీవితం

మార్చు

జియాఉద్దీన్ 1994లో గుంటూరు-1 నియోజకవర్గం ప్రస్తుత గుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ జానీ పై 26795 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ జానీ పై 6097 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జియాఉద్దీన్ 2004లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సుభాని చేతిలో 35964 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజన గుంటూరు-1 నియోజకవర్గం నుండి గుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది, దీంతో కొన్ని కారణాల వాళ్ళ ఆయనకు 2009లో, 2014లో టికెట్ దక్కలేదు. ఆయన 2018లో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశాడు. జియాఉద్దీన్‌ 2021 మే 18న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, [1][2] ఆయన 20 జూలై 2021న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ లో చేరాడు.[3]

మూలాలు

మార్చు
  1. Sakshi (18 May 2021). "మీ రాజకీయం మరణ శాసనం.. టీడీపీకి గుడ్‌బై". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
  2. The Times of India (17 May 2021). "Former minorities commission chairman SM Ziauddin quits TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
  3. Sakshi (20 July 2021). "వైఎస్సార్‌సీపీలో చేరిన గుంటూరు మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 20 జూలై 2021. Retrieved 22 July 2021.