జి.ఎస్.అనూష (జననం 11 ఏప్రిల్ 1995) భారతదేశానికి చెందిన చలనచిత్ర, బుల్లితెర నటీమణి.[1] ఆమె 2020లో కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది.[2] అలాగే పలు తెలుగు, తమిళ టీవి సీరియళ్ళలో నటించింది.

జి.ఎస్.అనూష
జననం11 ఏప్రిల్ 1995
వృత్తిచలనచిత్ర, బుల్లితెర నటి
తల్లిదండ్రులుజి.కోటేశ్వర్ రావు, జి. చంఢీరాణి

జీవిత విషయాలు

మార్చు

చెన్నై నగరంలో 11 ఏప్రిల్ 1995లో అనుషా జన్మించింది. అనూష తాతయ్య దివంగత ఎస్.సాంబశివరావు తెలుగు సినిమాల్లో ఫైట్ మాస్టర్ గా, అమ్మమ్మ దివంగత ఎస్.భారతి లక్ష్మి డాన్స్ మాస్టర్ గా, తండ్రి జి.కోటేశ్వర్ రావు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాతగా, మామ బాలు ఆనంద్ తమిళ సినిమా దర్శకుడు, నటుడిగా, పెద్దమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా, మావయ్య బాబు ఫైట్ మాస్టర్ గా, రెండో మావయ్య నాగేశ్వర్ రావు తమిళ సినిమా ఎడిటర్ గా, మూడో మావయ్య శ్రీనివాసన్ సౌండ్ ఇంజనీర్ ఆర్టిస్ట్ గా, కజిన్ సోదరి నోమినా తారా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అనూష తల్లి జి. చంఢీరాణి గృహిణి. అనూష బీకాం వరకు చదివింది.

గార్మెంట్ స్టోర్ కోసం 3 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రకటన షూట్ చేసింది. ఆ తరువాత అనేక టీవి సీరియళ్ళలోనూ, ప్రకటనలనూ, షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్లు, ప్రైవేటు పాటలలో నటించింది. కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా దేవి పాత్రలో నటించింది.[3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష పేరు
2020 కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర [4] దేవి తెలుగు

నటించిన సీరియళ్ళు

మార్చు
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర పేరు టివి ఛానల్ పేరు
2020 బంగారు గాజులు అనూష జీ తెలుగు
2021 అభిషేకం గజ లక్ష్మి ఈటివి
2022 హంసగీతం వరలక్ష్మి జెమినీ టీవీ
2022 మట్టి గాజులు సుశీల జెమినీ టీవీ
2022 పూవే పూచూడవా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ జీ తమిళ

వెబ్ సిరీస్లు

మార్చు
వెబ్ సిరీస్ పేరు పాత్ర పేరు
బన్ బటర్ జామ్ పెరియ పాప
నాటీ గర్ల్
స్వీట్ రివెంజ్
జాజి మళ్ళి లా (పాట)

అవార్డులు

మార్చు
  • వంశీ టివి & సిద్ధ వేత మల్టీవర్సిటీ సంస్థల నుండి 2022 అక్టోబర్ 9 నాడు తెలంగాణ సారస్వత పరిషత్తులో మహాత్మాగాంధీ సేవా రత్న అవార్డు 2022

మూలాలు

మార్చు
  1. krishna (2022-02-25). "ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని తెలియజేస్తూ..." Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  2. Sri Dharmavyadhudi Charitra Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2023-01-10
  3. "Anusha : Actress Wiki, Bio, Filmography, Anusha Movies List, Songs, Age, Videos". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  4. "Cinema News: కర్మయోగి చరిత్ర". EENADU. Retrieved 2023-01-10.

బాహ్య లింకులు

మార్చు