జి.రత్న
జి.రత్న(19జనవరి1948) దక్షిణ భారత సినిమా నటి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాలలో నటించింది.[1]
జి.రత్న | |
---|---|
జననం | జి.రత్న(ప్రసన్నలక్ష్మి),నాగరత్న 19-01-1948 (age 56–57) |
మరణం | 2002 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1961-1980 |
బంధువులు | జి.వరలక్ష్మి (మేనత్త) |
వ్యక్తిగత జీవితం
మార్చుజి.రత్న, నాగరత్న గా పిలవబడే ఈమె అసలు పేరు ప్రసన్నలక్ష్మి.ఈమె 19,జనవరి1948లో జన్మించారు. సినిమాల కోసం రత్న,ఉరఫ్ నాగరత్న గా పేరుమార్చుకొని తెరంగేట్రం చేసింది.ఈమె మొదటగా అన్నగారి దర్శకత్వంలో వచ్చిన గులేబకావళి కథ(1962)లో గులేబకావళి యువరాణి గా అప్సరస పాత్ర లో అలరించేనాటికి ఈమె వయసు 14ఏళ్లే. తరువాత1964లో వచ్చిన తమిళ చిత్రం "తొజిలాలి" తో తమిళంలో రత్నగా 16ఏళ్ల వయసులో నటించారు. ఈమెను ఎమ్.జి.ఆర్ గారు బాగానే ప్రమోట్ చేశారు.ఈమె శ్రీకృష్ణ పాండవీయం(1966)లో అందమైన రాక్షసి హిడింబి పాత్ర లో 'ఛాంగురే బంగారు రాజా' అని భీముడుని ఆటపట్టిస్తూ ఆడిపాడింది.ధనమా దైవమా(1973)లో హాయ్ రామ్ అంటూ హస్కీ వాయిస్ తో ఎన్.టి.ఆర్ ని వలలో వేసుకొనే క్లయింట్ గాను,మనుషుల్లో దేవుడు(1974)లో వాంపిష్ విలన్ మేడం గాను అలరించినప్పటికీ ఈమెకు తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.తరువాత కాలంలో ఈమె బొంబాయి వ్యాపార వేత్త షేక్ ఉమర్ ను పెళ్ళి చేసుకుని 'జొహరాబేగం' గా పేరు మార్చుకొని బొంబాయిలో స్థిరపడిన ఈమె 2002లో మరణించారు. ఈమె నటి జి.వరలక్ష్మి గారికి స్వయానా మేనకోడలు అయినప్పటికీ ఈమె కు వరలక్ష్మి గారికి వచ్చినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.
సినిమారంగం
మార్చు15 సంవత్సరాల వయసులో 1964లో తోజిలాలి అనే తమిళ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించిన రత్న,[2] 1965లో వచ్చిన ఎంగా వీట్టు పిళ్ళై సినిమాలోని గ్రామీణ అమ్మాయి పాత్రతో గుర్తింపు పొందింది.[3] తెలుగులో గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, మొనగాళ్ళకు మొనగాడు[4] వంటి సినిమాలలో నటించింది.
సినిమాలు
మార్చుఈ జాబితా అసంపూర్ణంగా ఉంది; విస్తరించడం ద్వారా మీరు సహాయం చేయవచ్చు.
తమిళం
మార్చు- మహావీర భీమన్ (1962)
- తిరుదతే (1961)
- తోజిలాలి (1964) ...విజయ - తమిళంలో తొలి సినిమా
- ఎంగా వీట్టు పిళ్ళై (1965). . . శాంత
- నామ్ మూవర్ (1966)
- సబాష్ తంబి (1967). . . రత్న
- ఇధాయక్కని (1975). . . కమల
- పనం పాతుం సేయం (1975)
- తెన్నాంగ్కీత్రు (1975)
కన్నడ
మార్చు- పరోపాకరి (1970)
- భూపతి రంగా (1970)
- యావ జన్మద మైత్రి (1972)
- త్రివేణి (1972)
- సుభద్ర కల్యాణ (1972)
- స్వామీజీ (1980)
తెలుగు
మార్చు- గులేబకావళి కథ (1962)
- శ్రీకృష్ణ పాండవీయం (1966) హిడింబి
- మొనగాళ్ళకు మొనగాడు (1966) మాల
మూలాలు
మార్చు- ↑ "G. Rathna". www.antrukandamugam.wordpress.com. Retrieved 2 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Guy, Randor (30 January 2016). "Thozhilaali (1964)". The Hindu. Archived from the original on 16 April 2021. Retrieved 2 July 2021.
- ↑ "MGR Heroines".
- ↑ Narasimham, M. L. (1 June 2018). "Monagaallaku Monagaadu (1966)". The Hindu. Archived from the original on 16 November 2018. Retrieved 2 July 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.రత్న పేజీ