మొనగాళ్ళకు మొనగాడు

శతాధిక చిత్రాలు నిర్నించిన మోడరన్ థియేటర్స్, సేలం నిర్మించిన చిత్రం. ఉస్తాందోకి ఉస్తాద్ హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించ బడింది. ఇది ఒక సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా జనవరి, 14, 1966లో విడుదలయింది.[1] ఇదే సినిమా తమిళంలో వల్లవణుక్కు వల్లవన్‌ అనే పేరుతో, కన్నడలో భలే భాస్కర అనే పేరుతో మోడరన్ థియేటర్స్ వారే పునర్మించారు.

మొనగాళ్ళకు మొనగాడు
(1966 తెలుగు సినిమా)
తారాగణం ఎస్.వి.రంగారావు,
హరనాథ్,
కృష్ణకుమారి,
బాలయ్య,
చలం,
ప్రభాకర రెడ్డి
సంగీతం వేదా
నిర్మాణ సంస్థ మోడరన్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు
  • హరనాథ్ - రమేష్
  • కృష్ణకుమారి - గీత
  • ఎస్.వి.రంగారావు - కత్తుల రత్తయ్య
  • మన్నవ బాలయ్య - ప్రకాష్ [2]
  • ప్రభాకర్‌రెడ్డి -భుజంగం
  • రావి కొండలరావు - మాధవరావు
  • జి.రత్న - మాల
  • సావిత్రి - అతిథిపాత్ర
  • చలం
  • పకీర్‌ స్వామి
  • జూ।। భానుమతి

సాంకేతికవర్గం

మార్చు

చిత్రకథ

మార్చు

రమేష్ (హరనాథ్) ఒక యవ ఇంజనీర్. అతనికి ఒక ధనికుని కూతురు (కృష్ణకుమారి) తో పరిచయమై, అది కాస్తా ప్రణయంగా మారుతుంది. రమేష్ దగ్గర ఉన్న ఫాక్టరీ ప్లాన్ అతని ప్రియురాలి తండ్రికి నచ్చుతుంది. ఫ్యాక్టరీ సైట్ కి వెళ్తున్న తోటి ప్రయాణికురాలి పెట్టె రమేష్ పెట్టె మారతాయి. మారిన పెట్టెలో భ్యాంక్ నుండి దోచుకోబడ్డ డబ్బు ఉంది. దానితో రమేష్ ను అరెస్ట్ చేస్తారు. రమేష్ ను జైల్ లోనే చంపాలని కత్తుల రత్తయ్య (ఎస్.వి.రంగారావు) అనే కిరాయి రౌడిని దొంగలముఠా సంప్రదిస్తుంది. రమేష్ ని జైల్ నుండి తప్పించి దొంగల ముఠాతో బేరసారాలు సాగిస్తాడు కత్తల రత్తయ్య. కత్తుల రత్తయ్యపై కొందరు దుండగులు దాడి చేసినప్పుడు రమేష్ ప్రియురాలు అతనికి ప్రాథమిక చికిత్స చేసి, ఊరట కలగ చేస్తుంది. రమేష్ ప్రియురాలు త న చెల్లెలు వంటిదని, రమేష్ ని దొంగల ముఠా బారి నుండి కాపాడతానని కత్తులరత్తయ్య అంటాడు. ప్రకాష్ (బాలయ్య) అనే పోలీస్ అధికారి కత్తల రత్తయ్యని వెంబడిస్తూ రమేష్ ని కలిసి, కత్తల రత్తయ్య మోసగాడని, దొంగల ముఠాతో బేరం కుదిరితే రమేష్ కి ఆపద తలబెడతాడని హెచ్చరిస్తాడు. దొంగలముఠాకి, కత్తుల రత్తయ్యకి మధ్య దోబుచులాట జరుగుతంది. చివరకు ప్రకాష్ దొంగల ముఠానాయకుడని, కత్తుల రత్తయ్య పోలీస్ ఆఫిసర్ అని తెలుస్తుంది. ప్రకాష్ రమేష్ ను,అతని ప్రియురాలిని షీల్డ్ చేసి మోటారు బోట్ లో పారి పోవాలని చూస్తాడు. కానీ, రమేష్, ప్రకాష్ పోటీ బడి బోట్ గమనాన్ని మార్చే ప్రయత్నంలో బోట్ స్టీరింగ్ విరిగి పోతుంది. రమేష్, ప్రియురాలు ఒడ్డుకు చేరతారు. బోట్ కొండని ఢీకొంటుంది. బయటపడ్డ ప్రకాష్నుపోలీసులు అరెస్ట్ చేస్తారు.

పాటలు

మార్చు

‘మొనగాళ్లకు మొనగాడు’’ సినిమాకు వేదాచలం (వేదా) సంగీత దర్శకుడు. తమిళ మాతృకకు కూడా ఇతడే సంగీత సారథి[3].

పాట రచయిత సంగీతం గాయకులు
వచ్చామే నీకోసం- మెచ్చామే నీ వేషం సి.నారాయణరెడ్డి వేదా పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
పిఠాపురం
నేనున్నది నీలోనే- నీవున్నది నాలోనే- నా రూపము నీదేలే- నీ ఊపిరి నేనేలే సి.నారాయణరెడ్డి వేదా పి.బి.శ్రీనివాస్
అందాల బొమ్మలాగా ముందు నిలిచి వున్నది- ముచ్చటైన చిన్నది- రమ్మన్నది- నన్నే... రమ్మన్నది వేదా పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
ఆహాహా చూడు- అందము చూడూ- ఆడదియా ఇది ఆడదియా కొసరాజు వేదా పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
కన్ను చెదిరి పోయినదోయ్‌- కన్నె వయసు పొంగినదోయ్‌ కొసరాజు వేదా పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి
చూశానోయ్‌ నీలాంటి చిన్నాణ్ణి- వేశానోయ్‌ చూపులతో బాణాన్ని వేదా పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి

కళకళ నవ్వే కన్నులతోనే, పి సుశీల.

ప్రత్యేకతలు

మార్చు
  • ఇది మోడరన్ ధియోటర్స్ నిర్మించిన 102 వ సినిమా.
  • ఈ సినిమాలో వచ్చామే నీకోసం.. మెచ్చామే నీ వేషం అనే ఒక ఖవాళి జుగల్ బందీ పాట ఉంది. ఆ పాటను ఎస్.వి.రంగారావు, హర్ నాధ్ లతో నటి సావిత్రి అభినయించారు,
  • ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటన అమోఘం . కత్తుల రత్తయ్య పచ్చి నెత్తురు తాగుతాడు డైలాగ్ చాలా పాపులర్.
  • బాలయ్య పాత్ర పోషణ కూడా ప్రత్యేకంగా పేర్కోనదగినదే.
  • మూలంలో దొంగలముఠా నాయకుడి పాత్ర మరణిస్తుంది. తెలుగులో కథను మార్చి పాత్రను బ్రతికించారని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
  • సినిమా చివరి దాకా కత్తుల రత్తయ్య పోలీస్ ఇన్సెపెక్టర్ అని, ప్రకాష్ దొంగల నాయకుడని ఆలోచన రానీయకుండా సస్పెన్స్ ను కడదాకా కొన సాగించడం గొప్ప విషయం.
  • ఒక సారి సినిమా చూసిన తరువాత సస్పెన్స్ విడిపోతుంది. కానీ సినిమా పదేపదే చూడడానికి కూడా బాగుంటుంది.
  • ఈ సినిమా లో ఎక్కువ పాటలు పి బి శ్రీనివాస్ పాడారు. నేనున్నది నీలోనే పాట కు సౌబార్ జనమ్ లేంగే (రఫీ) పాట ఆధారం.అలాగే జబ్ ప్యార్ కిసీసె హోతాహై చిత్రంలోని సౌ సాల్ పెహ్లే ముఝే తుమ్సె ప్యార్ థా అధారంగా "అందాల .........." పాట తయారయ్యింది. పైన పేర్కొన్న ఖవాలీ కి ఆధారం హిందీ చిత్రంలో (ఉస్తాదోం కే ఉస్తాద్) లో ఉంది.

మూలాలు

మార్చు
  1. మద్ర్రాసు ఫిలిమ్‌ డైరీ(1966-1968). 1966 విడుదలైన చిత్రాలు. గోటేటీ బుక్స్. p. 18.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhra Jyothy (9 April 2022). "బాలయ్యకు ఆ వేషం ఎలా దక్కిందంటే..." Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  3. ఆచారం షణ్ముఖాచారి. "జనం మెచ్చిన థ్రిల్లర్‌...మొనగాళ్లకు మొనగాడు". సితార. USHODAYA ENTERPRISES PVT LTD. Archived from the original on 10 నవంబరు 2019. Retrieved 31 July 2020.