జి.సతీష్ రెడ్డి

శాస్త్రవేత్త

డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) చైర్మన్‌.[5] , భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు.

G Satheesh Reddy
డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి
G Satheesh Reddy.jpg
జననం01 జులై 1963
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థలుజవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) అనంతపురం జిల్లా (B.Tech, ECE)[1]
జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్ (MS & Ph.D ECE)[1]
వృత్తి
  • భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు.
  • చైర్మన్‌, డీ.ఆర్.డీ.ఓ.
  • కార్యదర్శి, రక్షణ పరిశోధన,అభివృద్ధి విభాగం (డీఆర్డీ) [2]
గుర్తింపు తెచ్చినవిక్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలకపాత్ర.
పురస్కారాలు2015 రాయల్ ఏరోనాటికల్ సొసైటీ నుంచి రజత పతకం [3][4]
వెబ్ సైటుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

బాల్యం,విద్యాభ్యాసంసవరించు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం స్వస్థలం..

  • హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యాభ్యాసం
  • క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలకపాత్ర.

పదవులు,అవార్డులుసవరించు

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్‌ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. ఆయన రెండేండ్ల పాటు డీఆర్డీవో చైర్మన్‌గా కొనసాగుతారు. అంతకు ముందు ఆయన హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన రక్షణ పరిశోధన,అభివృద్ధి విభాగం (డీఆర్డీ) కార్యదర్శిగా కూడా ఉంటారు. ఎస్ క్రిస్టఫర్ పదవీ విరమణ చేసిన అనంతరం డీఆర్డీవో చైర్మన్ పదవిలో సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం వాసి సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. ఆయన 1985లో డీఆర్‌డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. నిశ్చల సెన్సర్లు, నావిగేషన్ పథకాలు, అల్గారిథం వ్యవస్థలు, అమరిక పద్ధతులు, సెన్సర్ మోడళ్లను రూపొందించి, అభివృద్ధి చేసిన బృందాలకు సతీశ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఉపగ్రహ నావిగేషన్ రిసీవర్లు, హైబ్రిడ్ నావిగేషన్ వ్యవస్థల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నారు. ఆయన నాయకత్వంలోనే అధునాతన పరికరాలు, వివిధ రకాల ఏవియానిక్స్ వ్యవస్థలు రూపుదిద్దుకొని ప్రయోగాలలో సైతం విజయవంతమయ్యాయి. లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీలో ఫెలో ఆఫ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్‌గా ఆయన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. రష్యాలోని ఎకాడమీ ఆఫ్ నావిగేషన్, మోషన్ కంట్రోల్ సంస్థలో శాశ్వతకాల విదేశీ సభ్యునిగా మరో అరుదైన గౌరవం పొందారు. భారత్‌లోని అనేక ఇంజినీరింగ్ సంస్థలలో సైతం గౌరవసభ్యునిగా ఉన్న సతీశ్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక హోమీ బాబా స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు. స్వావలంబన పరిశోధనకు ప్రధాని నుంచి అవార్డుతోపాటు పలు సత్కారాలను అందుకున్నారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ నుంచి రజత పతకం అందుకున్న తొలి భారతీయ రక్షణ విభాగం శాస్త్రవేత్త కూడా సతీశ్‌రెడ్డినే.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Nellore celebrates award to Satheesh Reddy". The Hindu. Retrieved 29 January 2016.
  2. Rajasekhar, Pathri (26 August 2018). "Satheesh Reddy appointed as new చైర్మన్‌, [[డీ.ఆర్.డీ.ఓ.]]". Deccan Chronicle (ఆంగ్లం లో). URL–wikilink conflict (help)
  3. "Prestigious Award for Defence Scientist G Satheesh Reddy". NDTV. 12 September 2015. Retrieved 29 January 2016.
  4. "REeS Silver Medal for Satheesh Reddy". The New Indian Express. Retrieved 29 January 2016.
  5. https://www.youtube.com/watch?v=ah2HKw3Dqmc