జీనాభాయ్ దేశాయ్

గుజరాతీ రచయిత

జీనాభాయ్ రతన్జీ దేశాయ్ (16 ఏప్రిల్ 1903 - 6 జనవరి 1991), గుజరాత్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గుజరాతీ రచయిత.

జీనాభాయ్ దేశాయ్
పుట్టిన తేదీ, స్థలంజహింభాయ్ రతన్జీ దేశాయ్
(1903-04-16)1903 ఏప్రిల్ 16
చిఖలి, గుజరాత్
మరణం1991 జనవరి 6(1991-01-06) (వయసు 87)
కలం పేరుస్నేహరష్మి
భాషగుజరాతీ భాష
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం

జననం, విద్య

మార్చు

జీనాభాయ్ 1903, ఏప్రిల్ 16న గుజరాత్ రాష్ట్రంలోని చిఖలిలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ చదువును వదిలిపెట్టి, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. 1921లో గుజరాత్ విద్యాపీఠంలో చేరి, 1926లో రాజనీతి శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు.

ఉద్యోగం

మార్చు

1926 నుండి 1928 వరకు గుజరాత్ విద్యాపీఠంలో చరిత్ర, రాజనీతి శాస్త్రాన్ని బోధించాడు. 1934లో రాష్ట్రీయ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1938లో శేత్ చిమన్‌లాల్ నాగిందాస్ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌గా చేరాడు, డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.[1] గుజరాత్ యూనివర్సిటీకి మూడుసార్లు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు. 1972లో మద్రాసులో గుజరాతీ సాహిత్య పరిషత్‌కు ఆయన అధ్యక్షత వహించాడు.[2] గుజరాత్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో సెనేట్, సిండికేట్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. సాహిత్య అకాడమీ, హిస్టారికల్ రికార్డ్స్ కమీషన్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.

ఉద్యమం

మార్చు

భారత స్వాతంత్ర్య కార్యక్రమాలలో ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932 నుండి 1933 వరకు జైలు శిక్షను అనుభవించాడు.

రచనలు

మార్చు

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో రాసిన తొలి రచనలు జాతీయవాద భావాలు, గాంధేయ ఆదర్శాల ద్వారా ప్రభావితమయ్యాయి.[3][4] తరువాత రచనలు అందం, భావోద్వేగాలపై ఎక్కువగా వచ్చాయి. ప్రధానంగా కవిత్వం, చిన్న కథలు వ్రాసాడు.[2]

చిన్న కథలు

మార్చు
  1. 1934: గతా ఆసోపాలవ్[5]
  2. 1934: తుటెల తార్
  3. 1935: స్వర్గ్ అనే పృథ్వీ
  4. 1955: మోతీ బహెన్
  5. 1962: హీరా నా లత్కనియా
  6. 1969: శ్రీఫాల్
  7. 1962: కళా టోపి
  8. 1983: స్నేహరష్మి ని శ్రేష్ట్ వర్తో[2][6]

ఇతరులు

మార్చు
  • 1961: అంతర్పత్ (సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలపై నవల)
  • 1983: మాతోడు నే తులసి (నాటకాల సంకలనం)
  • 1957: భరత్ న ఘద్వయ్య (జీవిత చరిత్ర సంకలనం)
  • 1984: ప్రతిసాద్
  • 1937: ఉమాశంకర్ జోషి
  • 1941: సాహిత్య పల్లవ్
  • 1966: సాహిత్య పఠావలి[2][6]

అవార్డులు

మార్చు
  • 1961లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి అవార్డు
  • 1967లో రంజిత్రం సువర్ణ చంద్రక్
  • 1979లో నర్మద్ సువర్ణ చంద్రక్[2]
  • 1987లో సాహిత్య గౌరవ్ పురస్కార్

మూలాలు

మార్చు
  1. India Who's who. INFA Publications. 1972. p. 193.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "દેસાઈ ઝીણાભાઈ રતનજી, 'સ્નેહરશ્મિ' (Desai Jhinabhai Ratanji, 'Snehrashmi')". Gujarati Sahitya Parishad. Retrieved 9 September 2014.
  3. Kartar Singh Duggal (1988). Writer in freedom struggle, India & Bulgaria. Twenty-first Century India Society. pp. 67–72.
  4. Yogendra K. Malik (1981). South Asian intellectuals and social change: a study of the role of vernacular-speaking intelligentsia. Heritage. p. 194. ISBN 9780836408256.
  5. Sisir Kumar Das (1 January 1995). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. p. 671. ISBN 978-81-7201-798-9.
  6. 6.0 6.1 Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1 January 1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. p. 115. ISBN 978-0-313-28778-7.