జీవన ముక్తి
జీవన్ముక్తి లేదా జీవన ముక్తి 1942లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ఎస్.ఎస్.వాసన్ జెమినీ పిక్చర్స్ నిర్మించిన మొదటి సినిమా.
జీవన ముక్తి (1942 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.వి.నీలకంఠం |
---|---|
నిర్మాణం | ఎస్.ఎస్.వాసన్ |
కథ | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
తారాగణం | పి.సూరిబాబు, బెజవాడ రాజరత్నం, బలిజేపల్లి లక్ష్మీకాంతం |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
ఛాయాగ్రహణం | శైలేన్ బోస్ |
నిర్మాణ సంస్థ | జెమిని పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- పి.సూరిబాబు - జీవుడు
- బెజవాడ రాజరత్నం - సేవ, జీవుడి భార్య
- బలిజేపల్లి లక్ష్మీకాంతం - రాజగురువు
- మాస్టర్ విశ్వం - భావుడు, జీవుడి కొడుకు
- లంక సత్యం - రాజగురువు శిష్యుడు
- కమలకుమారి - శాంత, రాజగురువు కుమార్తె
- లక్ష్మీదేవి - పూల పిల్ల
- వి.వి.శఠగోపం - విష్ణుమూర్తి
- అన్నపూర్ణ - శ్రీదేవి
- శాంత - భూదేవి
- డి.లక్ష్మయ్య చౌదరి - మహారాజు
- శివరామకృష్ణయ్య
- నరసింహ శాస్త్రి
పాటలు
మార్చుఈ సినిమాలో మొత్తం 19 పాటలు, ఒక పద్యం ఉన్నాయి. అన్నింటిని సముద్రాల రాఘవాచార్య రచించారు.[1]
- ఆకల్లాడదొకింత లోకమున, నీ యాదేశ మేలేక మా (పద్యం) - సూరిబాబు
- ఆయే వేళాయే హరి మా యిలు సేరగ వేళాయె - రాజరత్నం
- ఆరగింప రారా విందారగింప రారా కరుణాలవాల రారా - పి.సూరిబాబు, రాజరత్నం, మాస్టర్ విశ్వం
- ఆహా నా తరమా సుతిసేయా - రాజరత్నం, సూరిబాబు
- ఏల రావోయీ కన్నయ్యా జీవుడు పూజకు లేడని జాగా - రాజరత్నం
- చూచితిగా చూచితిగా... కనుల పండువుగా నేడే - కమల కుమారి
- జయ జయ పరమాత్మ సకల భువన కారణా
- జైజైరాం హరె జానకిరాం
- జోడు కొంటారా బాబూ జోడు కొంటారా - మాస్టర్ విశ్వం
- దాశరథే దయాశరథే కావ రావా కనరావా - కమల కుమారి, సురిబాబు
- పలుకే బంగారమాయెనా సిన్నారి సిలకా
- పూలోయమ్మా పూలండయ్యా పూవులు చక్కని కమ్మని పూలూ
- పోవుదము కోవెలకు రండి బిరానా హాయి హాయిగా - కమల కుమారి, మాస్టర్ విశ్వం, బృందం
- బాలుడే గోపాల బాలుడే మాపాలి దేవుడు - మాస్టర్ విశ్వం
- బొద్దుగా ముద్దుగా కట్టుదామా గులాబి మాలా
- మేలుకో జీవా జీవా తూర్పు తెలవారే
- మొరవిను వారే లేదా యీ చెర విడిపింపగ రారా - మాస్టర్ విశ్వం, బృందం
- రారా కట్టుదమా సుమమాలా శ్రీహరికి తులసీ మాలా - సూరిబాబు
- లీలా రసికులు కోరెడు పూలూ - లక్ష్మీదేవి
- వెలిగింపుమా నాలో జ్యోతి తిలకింతుగా ఓ దేవా - పి. సూరిబాబు
- శ్రీ రఘు నందన జైజైరాం శ్రితజనచందన జైజైరాం
- హాయిగా హాయిగా పూజ సేయుదునా - కమల కుమారి
చలం వాఖ్యలు
మార్చుప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు. రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా మీద తను రచించిన మ్యూజింగ్స్ లో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు: జీవన్ముక్తిలో ఎవరో అమ్మాయికి కృష్ణుడు ప్రత్యక్ష మౌతాడు. ఆ సంతోషాన్ని 'చూచితిగా' అంటుంది. అదేదో చాలా బూతును చూసినట్టు, తనకి చాలా సిగ్గయినట్టు, బతుకు అసహ్యమైనట్టు. "ఏమి తెల్పుదు నాన్నా!ఏమి తెల్పుదు నాన్నా! ఏమి తెల్పుదు నాన్నా!" అని ఏడుస్తుంది.
మూలాలు
మార్చు- ↑ జీవన్ముక్తి, జీవితమే సఫలము, మొదటి సంపుటి, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు: 137-150.