మాస్టర్ విశ్వం భారతదేశంలో బ్రిటిష్ కాలంలో తెలుగు సినిమా ప్రారంభ నటుడు.1942లో జెమిని స్టూడియోస్ నిర్మించిన బాలనాగమ్మ సినిమాలో బాలవర్ధిరాజు పాత్రతో మాస్టర్ విశ్వం ప్రసిద్ధి చెందారు.[1]

మాస్టర్ విశ్వం
జననంఉప్పాల విశ్వనాథం
1932 జనవరి 7
జగ్గయ్యపేట,కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం
మరణం2004 ఏప్రిల్ 8(2004-04-08) (వయసు 71–72)
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ భారతదేశం
వృత్తిబాల నటుడు రేడియో గాయకుడు చిత్రకారుడు
క్రియాశీలక సంవత్సరాలు1940–1942
పిల్లలు3 కూతుళ్లు 1 కొడుకు

జననం బాల్యం

మార్చు

మాస్టర్ విశ్వం 1932 జనవరి 7న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లో విశ్వనాథం కనకరత్నం దంపతులకు జన్మించాడు. విశ్వం చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు జగ్గయ్యపేట నుండి నల్గొండ కు మారారు . ప్రముఖ తెలుగు నటుడు కాంతరావు విశ్వం ఎదురు ఇంట్లోనే నివసించేవారు. కాంతారావు తన అనగనగా ఆత్మకథ రచనలో మాస్టర్ విశ్వం నుండి ప్రేరణ పొంది సినిమాల్లో నటించానని రాశారు.[2] 1949లో మాస్టర్ విశ్వం పాఠశాల రోజుల్లో చదువుకొనే రోజుల్లో ఒకసారి మాస్టర్ విశ్వం చదువుతున్న పాఠశాలకుహైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నల్గొండలో జరుగుతున్న ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదిక మీద మాస్టారు విశ్వం నిజం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బొమ్మ గీశాడు. ఆ బొమ్మను చూసిన నిజాం , 1949 మార్చి 26న మాస్టర్ విశ్వం కు బంగారు పతకాన్ని బహుమతిగా ఇచ్చాడు.[3]

సినీ కెరీర్

మార్చు

మాస్టర్ విశ్వం తండ్రి సంగీత ప్రియులు కావడంతో, నల్గొండలోని పండిట్ మండపతి వెంకటరాజు దగ్గర మాస్టర్ విశ్వం హిందుస్తానీ సంగీతం కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. 1940లో, సినిమా నిర్మాణ సంస్థ భవానీ పిక్చర్స్ చండికా సినిమాను నిర్మిస్తున్నారు . సినిమాలో నటించడానికి బాల నటుల కోసం భవాని పిక్చర్స్ సంస్థ వారు వార్తాపత్రికలో సినిమాలో నటించడానికి బాలనటులు కావాలని ప్రకటన ఇచ్చారు. మాస్టర్ విశ్వం తండ్రి ఆ ప్రకటనను చూశాడు . ఆ రోజుల్లో సినిమాల్లో నటించడానికి అందం కంటే ఎంపికకు ప్రాధాన్యత, ఎక్కువగా ఉండేది. మాస్టర్ విశ్వం ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో మాస్టర్ విశ్వం ఒక పద్యం పాడాడు, ఆ సినిమా ద్వారా మాస్టర్ విశ్వం ను భవానీ పిక్చర్స్ గ్రూప్ సినిమా రంగానికి ఆయనను పరిచయం చేసింది. సినిమా రంగంలోకి రావడం ద్వారా మాస్టర్ విశ్వం కు కన్నంబ, వేమూరి గగ్గయ్య, బళ్లారి రాఘవ లాంటి నటులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా ఎ. వి. మేయప్పన్ నిర్మించిన సుందర్ రావు నాడకర్ణి దర్శకత్వం వహించిన భూకైలాస్ అనే తెలుగు సినిమాలో మాస్టర్ విశ్వం కు గణేష్ భట్ట పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కర్ణాటకలోని గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయ పురాణం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఎవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన మొదటి సినిమా భూ కైలాస్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత జెమిని స్టూడియోస్ నిర్మించిన 1942 లో విడుదల అయిన బాల నాగమ్మ సినిమాలో మాస్టర్ విశ్వం బాలవర్ధిరాజు అనే పాత్రలో నటించాడు. బాలనాగమ్మ సినిమాలో మాయ ఫకీర్ అనే దుష్ట మాంత్రికుడు కుక్క రూపంలో వచ్చి నాగమ్మను అపహరించి, తరువాత ఆమె కుమారుడు బాలవర్ధిరాజు విడుదల నాగమ్మను విడుదల చేస్తాడు. రాణి బాలనాగమ్మ ప్రసిద్ధ తెలుగు బుర్రకథ ఆధారంగా బాలనాగమ్మ సినిమా రూపొందించబడింది. బాలనాగమ్మ సినిమా మాస్టర్ విశ్వం కు చాలా కీర్తిని, తెచ్చిపెట్టింది. బాలనాగమ్మ సినిమాలో బాలనాగమ్మగా కాంచనమాల, మాయల మరాఠీగా గోవిందరాజుల సుబ్బారావు నటించారు.[4]

ఆ తర్వాత 1942లో వచ్చిన జీవన ముక్తి సినిమాలో మాస్టర్ విశ్వం భవుడు అనే పాత్రలో నటించారు.. ఆ సినిమాను ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ జెమిని స్టూడియోస్ అధినేత ఎస్. ఎస్. వాసన్ నిర్మించారు. అయితే ఆ సినిమా జోరు పరాజయాన్ని చవి చూసింది. .[5] 1944లో, ప్రతిభా గ్రూప్ సీతారామజననం సినిమాను నిర్మించి , రాముడు, లక్ష్మణ పాత్రల కోసం వెతుకుతోంది. రాముడి పాత్ర కోసం ప్రతిభా గ్రూప్ సంస్థ వారు మాస్టర్ విశ్వాన్ని పిలిచారు. అయితే, మాస్టర్ విశ్వం చిన్న వయస్సు కారణంగా, ఆ సినిమాకు ఎంపిక కాలేదు. అయితే, ఆ ఆ సినిమాలో విశ్వంను పక్కన పెట్టడం ద్వారా, మరొక గొప్ప నటుడు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆయన మరెవరో కాదు, అక్కినేని నాగేశ్వరరావు.

తరువాతి జీవితం

మార్చు

మాస్టర్ విశ్వం తన తండ్రి మరణంతో సినిమాలలో నటించడం మానేశాడు. మాస్టర్ విశ్వం మంచి చిత్రకారుడు, ఆయన సినిమాలలో నటించడం మానేసిన తర్వాత బొమ్మలను గీసి అమ్మేవాడు. తరువాత మాస్టర్ విశ్వం ఎం. ఎ. పూర్తి చేసి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశారు. ఒకసారి మాస్టర్ విశ్వం కు ాగమ్మలో మాస్టర్ పాత్రను గుర్తుకు తెచ్చుకున్న వారు ఆయన నుండి ఆటోగ్రాఫ్ తీసుకునేవారు. విశ్వం తన సంగీత సాధన సంగీతాన్ని కొనసాగించి, కొన్ని పాటలను కూడా స్వరపరిచాడు. అప్పుడప్పుడు ఆయనకు ఆల్ ఇండియా రేడియో ద్వారా పాటలు పాడే అవకాశం వచ్చింది , తర్వాత అయిన అవకాశాన్ని వదులుకోకుండా పాటలు పాడేవాడు.హైదరాబాద్ నగరంలోని ఆకాశవాణి కేంద్రంలో మాస్టర్ విశ్వం సి. నారాయణ రెడ్డి, దశరధి రచించిన పాటలను పాడేవారు. అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముందు మాస్టర్ విశ్వం ఒకసారి ప్రదర్శన ఇచ్చారు. ఆ విధంగా, మాస్టర్ విశ్వం రేడియో గాయకుడిగా మంచి కీర్తిని పొందాడు. విశ్వంకు ముగ్గురు కుమార్తెలు, కొడుకులు ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి అయిన శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నారు. మాస్టర్ విశ్వం 2004 ఏప్రిల్ 8న మరణించారు.

ఫిల్మోగ్రఫీ

మార్చు

మూలాలు

మార్చు
  1. page 24, Article: Maruguna Padina Manikyam Master Viswam, Rachana Intinti Patrika Magazine (Telugu), April, 2005.
  2. "Entertainment | Tollwood and Bollywood News | Cinema News". Archived from the original on 2019-11-19. Retrieved 2024-06-22.
  3. Certificate of Appreciation, Nalgonda Health, Agricultural & Industrial Exhibition, Hyderabad, March 26, 1949
  4. Balanagamma (1942) Cinema Plus Hindu Article by M. L. Narasimham.
  5. Blast from the past: Jeevanmukthi (1942), Hindu Article by M. L. Narasimham.