జీశాట్-3ఉపగ్రహాన్ని EDUSAT అని కూడా పిలుస్తారు.జీశాట్-3ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ద్వారా 2004 సెప్టెంబరు 20 న ప్రయోగించిన సమాచార ఉపగ్రహం.EDUSAT విద్యారంగానికి సేవలందిచుటకై ప్రత్యేకంగానిర్మించిన తొలి ఉపగ్రహం.ఇది ప్రధానంగా దేశం కోసం ఒక ఇంటరాక్టివ్ ఉపగ్రహఆధారిత దూరవిద్య వ్యవస్థ అవసరం తీర్చేందుకు ఉద్దేశించిన ఉపగ్రహం.

జీశాట్-3
మిషన్ రకంCommunication satellite
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2004-036A Edit this at Wikidata
SATCAT no.28417
మిషన్ వ్యవధి7 years planned[1]
6 years achieved[2]
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,950 kilograms (4,300 lb)
శక్తి2040 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ20 September 2004, 10:31:00 (2004-09-20UTC10:31Z) UTC[3]
రాకెట్GSLV Mk.I F01
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP
కాంట్రాక్టర్ISRO
మిషన్ ముగింపు
పారవేయడంMoved to Graveyard orbit
డియాక్టివేట్ చేయబడింది30 September 2010 (2010-10-01)[2]
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East
Perigee altitude36,066 kilometres (22,410 mi)
Apogee altitude36,084 kilometres (22,422 mi)
వాలు2.71 degrees
వ్యవధి24.17 hours
ఎపోచ్14 December 2013, 14:55:38 UTC[4]
 

EDUSAT/జీశాట్-3 లో అయిదు స్పాట్‌భీమ్ ట్రాన్స్‌పాండరులు, ఒక నేషనల్ బీమ్ కలిగిన Kuబ్యాండ్ ట్రాన్స్‌పాండరు, ఆరు నేషనల్ కవరేజి బీమ్స్ కలిగిన ఎక్సుటెండేడ్ Cబ్యాండ్ ట్రాన్స్‌పాండరులను అమర్చారు. 2004 సెప్టెంబరు 20న జీశాట్-3 ఉపగ్రహాన్నివిజయవంతంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగప్యాడ్ నుండి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ద్వారా మొదటి సారిగా భూసమస్థితి బదిలీ కక్ష్యలోకి (GTO) ప్రవేశపెట్టారు. EDUSAT/జీశాట్-3 ను ప్రారంభంలో భూమధ్యరేఖకు 19.2 డిగ్రీల వద్ద,180 కిలోమీటర్ల (110 మైళ్ళు) పెరిజీ, 35.985 కిలోమీటర్లు (22,360 mi) అపోజీ దూరంలో ఉండు లాగున కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ప్రదక్షిణ వ్యవధి 10.5 గంటలు.2010 సెప్టెంబరులో దీనిని ఉపయోగించడం నిలిపివేసి, ఉపగ్రహాన్ని నిరర్ధక కక్ష్యలోకి పంపారు.

ఉపగ్రహం వివరాలు మార్చు

ఉపగ్రహం మొత్తం బరువు (ఇంధనంతో)1950.5కిలోలు.ఇంధనం లేకుండగా బరువు 819.4 kg .EDUSAT/జీశాట్-3 లో అయిదు స్పాట్‌భీమ్ ట్రాన్స్‌పాండరులు, ఒక నేషనల్ బీమ్ కలిగిన Kuబ్యాండ్ ట్రాన్స్‌పాండరు, ఆరు నేషనల్ కవరేజి బీమ్స్ కలిగిన ఎక్సుటెండేడ్ Cబ్యాండ్ ట్రాన్స్‌పాండరులను అమర్చారు.కక్ష్యలో ఉపగ్రహంఎత్తును పెంచుటకు 440 N ద్రవ ఇంధనం (MON-3 and MMH) కలిగిన అపోజీ మోటరూమర్చబడింది.2.54 M x 1.525 M సైజు ఉన్న నాలుగు సౌరఫలకలు (solar panel) అమర్చారు.ఈసౌర ఫలకాల విద్యుతుఉత్పత్తి సామర్ధ్యం2040 W (EOL, సౌర విద్యుతు అందని సమయంలో విద్యుతు సరఫరా కై రెండు 24 AH NiCd బ్యాటరిలను అమర్చారు.

ఈ ఉపగ్రహం భూస్థిర కక్ష్యలో, 74 డిగ్రీల తూర్పు రేఖాంశకక్ష్యలో ఉంచబడింది.ఉపగ్రహం ఒకప్రదక్షణకు పట్టుసమయం 24:17గంటలు

ప్రయోగ వివరాలు మార్చు

జీశాట్-3/EDUSAT ఉపగ్రహాన్ని అంతరిక్షములోని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టుటకై, ఇస్రోవారు తయారుచేసిన జీస్ఎల్‌వి శ్రేణికి చెందిన GSLV-F01 ఉపగ్రహవాహకం ద్వారా అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహవాహక నౌక పొడవు 49 మీటర్లు, బరువు 414 టన్నులు.ఈ ఉపగ్రహ వాహకనౌక పైభాగాన అమర్చిన జీ శాట్ -3/EDUSAT ఉపగ్రహం బరువు 1950 కిలోలు.ఈ ఉపగ్రహ వాహక నౌక 20 తేది, 2004 సెప్టెంబరు న సాయంత్రం 4:01 కు నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంవైపు చొచ్చుకు వెళ్ళినది.వాహక నౌక బయలు దేరిన 17 నిమిషాల తరువాత ఉపగ్రహాన్ని విజయవంతంగా GTOలో ప్రవేశ పెట్టారు. కౌంట్ డవున్ సున్నా చేరుటకు 4.8 సెకన్ల ముందు, రాకెట్ మొదటి స్టేజికి అనుబంధంగా ఉన్న ఒక్కొక్కటి 40 టన్నుల భారమున్న స్ట్రాపాన్ హైపర్ గోలిక్ చోదకాల (UH25 and N2O4) నాలుగు మోటార్లు/ఇంజనులు మండటం మొదలైనది.సున్నా కౌంట్‌డౌన్ కు చేరాక, నాలుగు స్ట్రాపాన్ మోటార్లు సరిగా మండటం నిర్దారణఅయ్యాక,138 టన్నుల ఘనఇంధనం కలిగిన మొదటి స్టేజీచోదకఇంజను మండటం ప్రారంభమై, వాహన నౌక ఆకాశం వైపు పయనం మొదలెట్టినది.మొదటి స్టేజి ఇంజను 104 సెకండులుమండగా, స్ట్రాపన్ మోటరులు/ఇంజనులు 150 సెకన్లు మండినవి.150 సెకండుల వాహనం ప్రయాణం తరువాత రెండవ స్టేజి మోటరు/ఇంజను మండటం మొదలైనది. 227 సెకండుల తరువాత 115 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహం చుట్టూ ఉన్నఉష్ణకవచం/హిట్‌షీల్డ్ వేరుపరచబడింది.రెండవ స్టేజిలో ఇంజన్ 228 సెకండు మండినది. 12.5 టన్నుల ఇంధనమూడవ క్రయోజనిక్ దశ/స్టేజిలో ఇంజన్ 304 సెకండ్లకు మండటం మొదలై,999 సెకండ్ల తరువాత, ఉపగ్రహ చలనానికి కావలసిన 10.2 కిలోమీటరు/సెకండు త్వరణం పొందిన తరువాత ఇంజను మండటం ఆగినది.

ఉపగ్రహ వాహక నౌక శ్రీహరికోటనుండి బయలు దేరిన 1014 సెకన్ల తరువాత 5000కి.మీ దూరంలోకక్ష్యలో ప్రవేశపెట్టబడింది.

ప్రయోగానంతర సమాచారం మార్చు

ఉపగ్రహం GTO (Geo Transfer orbit) లో చేరిన వెంటనే, ఉపగ్రహం యొక్క రెండు సౌరపలకలు స్వయంచాలకంగా తెరచుకొన్నాయి.సౌరపలకలయొక్క విస్తరణ అలాగే ఉపగ్రహ సాధారణ హెల్ది ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ (ISTRAC) ఇండోనేషియన్ బియక్ ద్వీపంలోని ఇస్రో టెలిమెట్రీ గ్రౌండ్ స్టేషన్ ద్వారా పరిశీలించారు.కర్నాటకలోని హసన్ లోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (MCF) నుండి EDUSAT యొక్కఅన్ని ప్రయోగానంతర కార్యకలాపాలను నియంత్రణకు తీసుకుంది.

EDUSAT ఇస్రో ఉపగ్రహ కేంద్రం, బెంగుళూరరు ద్వారా అభివృద్ధి చేయబడింది. పేలోడ్లను అహ్మదాబాద్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. హసన్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఇస్రో) ఉపగ్రహ అన్ని పోస్ట్ ప్రయోగ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు.

ViCTERS మార్చు

భారతదేశం యొక్క మొట్టమొదటి బ్రాడ్‌బాండ్ EDUSAT నెట్ వర్కు ViCTERS (వర్సటైల్ ICT స్టూడెంట్స్ కోసం రిసోర్స్) ద్వారా పాఠశాలలలో విద్యను బోధించు ఈ విధానాన్ని మొదటగా భారతదేశపు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ 2005 జూలై 28 న తిరువనంతపురంలో ప్రారంభించారు.ఈ విద్యా సమాచారపంపిణీ, తరగతి గదికి ఉపగ్రహ ఆధారిత రెండు వైపులా సమాచార మార్పిడికి, అంకితమైన మొదటి "ఎడ్యుకేషనల్ శాటిలైట్" ప్రణాళిక

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "UCS Satellite Database". Union of Concerned Scientists. Archived from the original on 13 అక్టోబరు 2011. Retrieved 15 December 2013.
  2. 2.0 2.1 "EDUSAT Utilisation Programme" (PDF). Department of Space. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2013. Retrieved 15 December 2013.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2015-09-05.
  4. "GSAT 3 (EDUSAT) Satellite details 2004-036A NORAD 28417". N2YO. 14 December 2013. Archived from the original on 9 ఫిబ్రవరి 2014. Retrieved 15 December 2013.