జుయల్ ఓరం (జననం 22 మార్చి 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు సుందర్‌గఢ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై తొలిసారి మోదీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా, తిరిగి 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

జువల్ ఓరం
జువల్ ఓరం


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 జూన్ 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అర్జున్ ముండా
పదవీ కాలం
26 మే 2014 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు కిషోర్ చంద్ర దేవ్
తరువాత అర్జున్ ముండా
పదవీ కాలం
13 అక్టోబర్ 1999 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
ముందు కార్యాలయం స్థాపించబడింది
తరువాత పాటీ రిప్పల్ కిండియా

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ముందు హేమానంద బిస్వాల్
నియోజకవర్గం సుందర్‌గఢ్
పదవీ కాలం
10 మార్చ్ 1998 – 18 మే 2009
ముందు ఫ్రిదా టాప్నో
తరువాత హేమానంద బిస్వాల్
నియోజకవర్గం సుందర్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-22) 1961 మార్చి 22 (వయసు 63)
సుందర్‌గఢ్, ఒడిశా, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జింగియా ఓరం (మరణం ఆగస్టు 2024) [1]
సంతానం 2
నివాసం న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

జువల్ ఓరం 1989లో ఓరమ్ భారతీయ జనతా పార్టీలో 1990, 1955 శాసనసభ ఎన్నికలలో బోనై నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన 1993 బీజేపీ ఎస్టీ మోర్చా (షెడ్యూల్డ్ తెగల విభాగం)కి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ,1995లో పార్టీ జాతీయ కార్యదర్శిగా రెండు సంవత్సరాలు పనిచేసి ఆ తరువాత 1997లో ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. జువల్ ఓరం 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుందర్‌గఢ్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై ఆ తరువాత 1999లో తిరిగి రెండోసారి ఎంపీగా ఎన్నికై ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొట్టమొదటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3][4][5]

జువల్ ఓరం 2004లో బీజేపీ రాష్ట్ర విభాగానికి పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై రెండు సంవత్సరాలు పని చేసి 2004లో మూడవసారి లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు. ఆయన 2006 నుండి 2009 వరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. జువల్ ఓరం  2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినా[6] అనంతరం 22 డిసెంబర్ 2009న మూడవసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా[7],  ఆ తరువాత 1 ఏప్రిల్ 2013న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. జువల్ ఓరం 18 మే 2014న లోక్‌సభకు ఎన్నికై మే 26న నరేంద్ర మోడీ మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిగా ప్రమాణం చేశాడు.[8]

మూలాలు

మార్చు
  1. "డెంగీతో కేంద్రమంత్రి సతీమణి మృతి | Union Minister's wife died of dengue". web.archive.org. 2024-08-19. Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. The Indian Express (9 June 2024). "PM Narendra Modi Oath Taking Ceremony Live Updates: PM Modi takes oath for 3rd term; NDA 3.0 to have 30 Cabinet Ministers, 5 MoS (independent), 36 MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  3. Modi does a balancing act
  4. "Jual Oram, India's first tribal minister, back in Union cabinet". Firstpost. 27 May 2014. Retrieved 10 March 2019.
  5. "Jual Oram gets Tribal affairs ministry". Free Press Journal. 27 May 2014. Retrieved 10 March 2019.
  6. "Jual Oram, the face saver for BJP in Odisha, rewarded". The Indian Express. 26 May 2014. Retrieved 10 March 2019.
  7. Satapathy, Rajaram (22 December 2009). "Oram is state BJP chief". The Times of India. Retrieved 10 March 2019.
  8. Mishra, Ashutosh (18 May 2014). "Naveen stands tall with win – BJP's Jual Oram wins lone LS seat in Sundargarh". The Telegraph. Retrieved 10 March 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=జువల్_ఓరం&oldid=4303189" నుండి వెలికితీశారు