జూపల్లి ప్రేమ్‌చంద్
జూపల్లి ప్రేమ్‌చంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాహితీ కారుడు. ప్రేమ్‌చంద్ 1981లో ‘ఓట్లన్నీ పోలయినాయి’ పేరుతో కథానిక రాసి, రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్నాడు. ఆయన ‘వాయిస్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా గ్రామీణ సమస్యల మీద, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో సామాజికాభివృద్ది లక్ష్యంగా పని చేశాడు.
జూపల్లి ప్రేమ్‌చంద్ | |
---|---|
జననం | 1957 ఫిబ్రవరి 4 |
మరణం | 2023 అక్టోబర్ 19 హైదరాబాద్ , తెలంగాణ |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
తల్లిదండ్రులు | జూపల్లి వెంకట అప్పారావు, పద్మావతమ్మ |
జననం, విద్యాభాస్యం
మార్చుజూపల్లి ప్రేమ్‌చంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడికొండ గ్రామంలో 1957 ఫిబ్రవరి 4న జూపల్లి వెంకట అప్పారావు, పద్మావతమ్మ దంపతులకు జన్మించారుడు. ఆయన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్‌డీని పూర్తి చేశాడు.
మరణం
మార్చుజూపల్లి ప్రేమ్‌చంద్ మెదడులో రక్తం గడ్డకట్టడంతో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 అక్టోబర్ 19న మరణించాడు.[1] ఆయనకు భార్య రాజేశ్వరి, పిల్లలు శంతన్ మహరాజ్, అపర్ణ శౌరీస్ ఉన్నారు.[2]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (20 October 2023). "కవి జూపల్లి ప్రేమ్‌చంద్ కన్నుమూత". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
- ↑ Andhrajyothy (19 October 2023). "జూపల్లి కన్నుమూత". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.