జె.ఉమాదేవి
జయలకర్ ఉమాదేవి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె 2017 జనవరి 17 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తుంది.[1]
జయలకర్ ఉమాదేవి | |||
పదవీ కాలం 2017 జనవరి 17 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1959 సెప్టెంబర్ 26 అనంతపురం పట్టణం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
తల్లిదండ్రులు | జ్ఞానోబా రావు, తులసీ భాయి | ||
పూర్వ విద్యార్థి | కృష్ణ దేవరాయ వర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుజె. ఉమాదేవి 1959 సెప్టెంబర్ 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, అనంతపురం పట్టణంలో జ్ఞానోబా రావు, తులసీ భాయి దంపతులకు జన్మించింది. ఆమె 1986లో కృష్ణ దేవరాయవర్సిటీ నుండి బీఎల్ పూర్తి చేసి 6 సెప్టెంబర్ 1986న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.
వృత్తి జీవితం
మార్చుజె. ఉమాదేవి బీఎల్ పూర్తి చేశాక సీనియర్ న్యాయవాది వరద రావు దగ్గర జూనియర్ గా చేరి వృత్తిలో మెళుకువలు నేర్చుకొని న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టి 14 డిసెంబర్ 1996లో జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితురాలైంది. ఆమె తరువాత ఉమ్మడి రాష్ట్రంలోని కర్నూల్, విశాఖపట్నం, వరంగల్, మదనపల్లి, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో పలు హోదాల్లో పని చేసి హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్న సమయంలో ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితురాలైంది. ఆమె 2017 జనవరి 17 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తుంది.[2]
మూలాలు
మార్చు- ↑ Sakshi (16 January 2017). "ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Sakshi (12 January 2017). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.