జాకబ్ ఫర్జ్ రాఫెల్ "జె.ఎఫ్.ఆర్." జాకబ్ (1923 – 13 జనవరి 2016) భారత సైనిక దళంలోని లెప్టినెంటు జనరల్. ఆయన పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో ఢాకాలోని ఆ దేశ బలగాలు భారత్ బలగాలకు లొంగిపోవడానికి సంప్రదింపులు జరిపినవారు. ఆయన ఆ కాలంలో మేజర్ జనరల్ గా యుండి భారత సైనిక దళం లోని తూర్పు దళానికి అధిపతిగా వ్యవహరించారు. తన 36 సంవత్సరాల సైనిక జీవితంలో రెండవ ప్రపంచ యుద్ధం, ఇండో పాక్ వార్ (1965) లలో పాల్గొన్నారు. తరువాత ఆయన గోవా, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా వ్యవహరించారు.

జె.ఎఫ్.ఆర్.జాకబ్
జన్మనామంజాకబ్ ఫర్జ్ రాఫెల్ జాకబ్
జననం1923
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా.
మరణం (aged 92)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజభక్తి British India
 India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం1942–1978
ర్యాంకులెప్టెనెంట్ జనరల్
పనిచేసే దళాలు
  • 12 వ ఇన్‌ఫాంట్రీ డివిజన్
  • ఛీఫ్ ఆఫ్ స్టాఫ్, ఈస్టర్న్ కమాండ్
  • GOC-in-C, తూర్పు కమాండ్
పోరాటాలు / యుద్ధాలు
  • రెండవ ప్రపంచయుద్ధం
  • ఇండోపాక్ యుద్ధం 1965
  • ఇండోపాక్ యుద్ధం 1971
పురస్కారాలు
  • కమాండాషన్ ఆఫ్ మెరిట్
  • పరమ విశిష్ట సేవా పతకం
  • ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ ఆనర్
ఇతర సేవలు
  • గోవా ప్రభుత్వం
  • పంజాబ్ గవర్నర్

బాల్యా జీవితం మార్చు

ఆయన 1923 లో కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ లో జన్మించారు. ఆయన కుటుంబం 18వ శతాబ్దం మధ్యలో ఇరాక్ నుండి కలతత్తాకు వచ్చి స్థిరపడింది. వారు మతపరంగా జ్యూరిచ్ కుటుంబానికి చెందినవారు.[1] ఆయన తండ్రి ఎలియాస్ ఇమాన్యుయేల్ ప్రముఖ వ్యాపారస్తుడు. ఆయన తండ్రి అనారోగ్యంగా యున్నప్పుడు జాకబ్ తన 9వ యేట డార్జిలింగ్ దగ్గరలో గల కుర్సియాంగ్ వద్ద బోర్డింగ్ పాఠశాలలో చేరారు. తరువాత ఆయన సెలవులలో మాత్రమే ఇంటికి పోయేవాడు.[2]

జాకబ్ 19 ఏండ్ల వయసులో సైన్యంలో చేరారు. రెండో ప్రపంచయుద్ధంతోపాటు, 1965, 1971లలో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ తరపున వీరోచితంగా పోరాడిన జాకబ్ 1978లో పదవీ విరమణ పొందారు.


మరణం మార్చు

ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జనవరి 13 2016 న తన 92వ యేట మరణించాడు.

మూలాలు మార్చు

  1. Ginsburg, Aimee (2 June 2012). "The Sum of His Many Parts". Openthemagazine.com. Retrieved 30 July 2012.
  2. "Who was Lt Gen JFR Jacob? Here's all you need to know about the 1971 Indo-Pak war hero". India Today. Retrieved 15 January 2016.

ఇతర లింకులు మార్చు