జైపూర్ సంస్థానం

చారిత్రాత్మకంగా అంబర్ రాజ్యం అని పిలువబడే జైపూర్ రాజ్యం భారత భూఖండం లోని ఒక రాజ్యం. ఇది జైపూర్ పట్టణాన్ని క్కేంద్రీకృతంగా చేసుకుని పాలించింది. బ్రిటిషు కాలంలో ఒక సంస్థానంగా ఉంది. 12 వ శతాబ్దం నుండి ఇది ఉనికిలో ఉంది. 1818 నుండి ఆగస్టు 1947 లో బ్రిటిషువారు భారతదేశం నుండి వైదొలగే వరకు బ్రిటిషు వారితో అనుబంధ కూటమిలో ఉంది. దాని పాలకుడు 1949 ఏప్రిల్ లో భారత గణతంత్ర రాజ్యంలో చేరే వరకు ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉంటూ కొంత అంతర్గత స్వపరిపాలనను నిలుపుకుంది

జైపూర్ రాజ్యం
జైపూర్ రాష్ట్రం

1128–1949
Flag of జైపూరు
Flag (c. 1699-1818)
Coat of arms of జైపూరు
Coat of arms
ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియాలో జైపూర్ రాష్ట్రం
ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియాలో జైపూర్ రాష్ట్రం
రాజధానిజయపూర్
సామాన్య భాషలుధుండారి,
హిందీ,
సంస్కృతం
ప్రభుత్వంరాచరికం
(1128–1818; 1947–1949)
రాచరిక రాష్ట్రం
• 1128
డెలాహారియా (మొదటి పాలకుడు)
• 1922–1949
సవాయి మన్ సింగ్ II '(చివరి పాలకుడు)
చరిత్ర 
• స్థాపన
1128
• భారతభూఖండంలోని ఒక రాజ్యం
1949
విస్తీర్ణం
193140,407 కి.మీ2 (15,601 చ. మై.)
జనాభా
• 1931
2631775
ద్రవ్యంభారత ద్రవ్యం
Succeeded by
భారతదేశం
Today part ofరాజస్థాన్ భారతగణతంత్ర రాజ్యం
జైపూర్ మహారాణి గాయత్రీ దేవి, కూచ్ బెహార్ యువరాణి గాయత్రీగా జన్మించింది. ఆమె భర్త రెండవ మాన్ సింగ్, చివరి పాలక మహారాజా.

చరిత్ర

మార్చు
 
సిటీ ప్యాలెసు, జైపూర్

1093 లో దుల్లా రాయ్, జైపూర్ రాజ్యాన్ని ధుంధర్ (దౌసా రాజ్యం) పేరుతో స్థాపించాడు. అతనిని దుల్హా రావు అని కూడా పిలుస్తారు. ఈ రాజ్యం 14 వ శతాబ్దం - 1727 మధ్య అంబర్ అని పిలువబడింది. ఆ సంవత్సరంలో కొత్త రాజధానిని నిర్మించి, దానికి జయపురా అని పేరు పెట్టారు. ఈ రాజ్యానికి జైపూర్ అని పేరు మార్చారు.[1]

ధుంధర్ రాజ్యం

మార్చు
 
"లూయిస్ రాసిన 'ఇండియా అండ్ ఇట్స్ నేటివ్ ప్రిన్సెస్' నుండి "జైపూర్ మహారాజాతో మొదటి ఇంటర్వ్యూ"1878

శ్రీరాముడి కుమారుడు కుశుడికి వారసులమని కుచ్వాహాలు చెప్పుకున్నారు. వారి పూర్వీకులు రామరాజ్యం కోసల నుండి వలస వచ్చి గ్వాలియరు వద్ద కొత్త రాజవంశాన్ని స్థాపించారు.[2] 31 తరాల తరువాత వారు రాజపుతానాకు వెళ్లి ధుంధర్ వద్ద ఒక రాజ్యాన్ని స్థాపించారు. కుచ్వాహా పాలకుల పూర్వీకులలో ఒకరైన దుల్లా రాయ్, మాంచి, అంబర్ లకు చెందిన మీనాలను ఓడించాడు. తరువాత దౌసా, డియోటి బార్గుర్జార్లను ఓడించి ధుంధర్ మీద విజయం సాధించాడు.[3]

అంబర్ రాజ్యం

మార్చు

అంబర్ పాలకులు పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యంలో సైనికాధికారులుగా, తరువాత బాబరు ఆధ్వర్యంలోని మొఘలుల మీద రాణాసంగా నాయకత్వంలోనూ పోరాడారు. మాల్దేవు రాథోడ్ అంబర్‌ను ఆక్రమించాక, అంబర్ మార్వారుకు సామంత రాజ్యంగా మారింది. 16 వ శతాబ్దిలో రాజా భర్మల్ కుచ్వాహా, మొఘలు చక్రవర్తి అక్బరుతో పొత్తు కోరాడు.[4] మొఘలులు అతన్ని అధికారికంగా రాజాగా గుర్తించారు. అక్బరు చక్రవర్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించినందుకు ప్రతిగా మొఘలు కులీనులలో సమానంగా అతడు గౌరవించబడ్డాడు. అక్బరును వివాహం చేసుకున్న రాజా రాజా భర్మల్ కుమార్తె మరియం-ఉజ్-జమాని తరువాత నాల్గవ మొఘలు చక్రవర్తి జహంగీరుకు జన్మనిచింది. ఆమె తన భర్త పాలనలో సామ్రాజ్ఞిగా, కుమారుడి పాలనలో రాజమాతగా ఆమె గౌరవం పొందింది. ఈ సంబంధం ద్వారా అంబర్ రాజాలు కూడా మొఘలు రాజసభలో గణనీయమైన ప్రాముఖ్యతను పొందారు.

భార్మల్ భూభాగాన్ని పర్యవేక్షించడానికి ఒక రాజప్రతినిధిని నియమించారు. కప్పం ఏర్పాటులో భాగంగా భర్మల్‌కు వేతనం అందుకునే హోదా ఇవ్వబడింది. ఈ ప్రాంతం ఆదాయంలో కొంత భాగం నుండి ఆయనకు వేతనం చెల్లించేవారు.[5][6]

అంబర్ పాలక రాజవంశం మొఘలు పాలనలో అభివృద్ధి చెందింది. మొఘలు సామ్రాజ్యానికి కొంతమంది విశిష్ట సైనికాధికారులను అందించింది.[7] వారిలో భగవంతు దాసు, మొదటి మాన్ సింగ్, మొదటి జై సింగ్ మొదలైన వారున్నారు. మొదటి మాన్ సింగ్కాబూలు నుండి ఒరిస్సా, అస్సాం వరకు పాలించాడు.[7]

జైపూర్ రాజ్యం

మార్చు

మొదటి జై సింగ్ తరువాత మొదటి రాం సింగ్, బిషన్ సింగ్, రెండవ జై సింగ్ పాలించారు. రెండవ జై సింగ్ (సవాయి జై సింగ్) 1699 నుండి 1743 వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందాడు. 1727 లో ఆయన పాలనలో కొత్త రాజధాని నగరం జైపూర్ స్థాపించబడింది. [7]మొఘలు సామ్రాజ్యం విచ్ఛిన్నం అయ్యేవరకు జైపూర్ సైన్యాలు నిరంతరం యుద్ధ స్థితిలో ఉండేవి. 18 వ శతాబ్దం చివరలో భరత్‌పూర్ జాట్లు, అల్వార్ కచ్వాహా అధిపతి జైపూర్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుని జైపూర్ భూభాగం తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు.[7] జైపూర్ చరిత్రలో ఈ కాలం అంతర్గత అధికార-పోరాటకాలంగా గుర్తించబడింది. ఈ కాలం మరాఠాలు, జాట్లు, ఇతర రాజపుత్ర రాజ్యాలతో పాటు బ్రిటిషు, పిందారీలతో నిరంతర సైనిక ఘర్షణలు కలిగి ఉంటుంది. గంగ్వానా యుద్ధంలో మార్వార్ రాథర్స్ పై జైపూర్ భయంకరమైన నష్టాలతో బాధపడ్డాడు.[8]

1790 లో పటాను యుద్ధంలో మహాద్జీ సింధియా మరాఠా దళాల చేతిలో ఈ రాజ్యం మళ్ళీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఫలితంగా జైపూర్ పాలకులు భారీ యెత్తున కప్పం చెల్లించుకోవలసి వచ్చింది.[9] అయినప్పటికీ చక్కటి దేవాలయాలు / రాజభవనాలు, న్యాయస్థాన సంప్రదాయాల కొనసాగింపు జరిగింది. దాని పౌరులు, వర్తక వర్గాల శ్రేయస్సు కోసం తగినంత సంపద జైపూర్లో ఉంది. గ్వాలియరు నుండి స్వేచ్ఛ పొందటానికి జైపూరీయులు చివరి ప్రయత్నంగా మాల్పురా యుద్ధంలో పాల్గొని ఓడిపోయారు.[10] 1803 లో గవర్నరు జనరలు మార్క్విసు వెల్లెస్లీ ఆధ్వర్యంలో మహారాజా సవాయి జగత్ సింగ్, బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కొద్దికాలం తరువాత వెల్లెస్లీ వారసుడు లార్డు కార్న్‌వాలిస్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసాడు. ఈ సందర్భంలో జైపూర్‌లో బ్రిటిషు రాయబారి లార్డు లేక్‌, "భారతదేశంలో ఆంగ్ల ప్రభుత్వం స్థాపించబడినప్పటి నుండి, సౌలభ్యం కోసం విశ్వసనీయతను పణంగా పెట్టడం ఇదే మొదటిసారి" అని వ్యాఖ్యానించాడు.[11]

1818 లో జైపూర్ ఒక అనుబంధ కూటమిలోకి ప్రవేశించడం ద్వారా బ్రిటిషు రక్షిత ప్రాంతంగా మారింది. 1835 లో నగరంలో తీవ్ర కలవరానికి గురైంది. ఎందుకంటే బ్రిటిషు వారు రాజ్యాన్ని విలీనం చేసుకోవడానికి రాంజవంశానికి చెందిన శిశువును హతమార్చారని ఒక తప్పుడు పుకారు వచ్చింది. [12] ఆ తరువాత బ్రిటిషు ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంది.[7] తరువాత రాజ్యం బాగా సుసంపన్నమైంది.[7] 1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు సిపాయిలను అణిచివేసేందుకు బ్రిటిషు వారు సహాయం కోరినప్పుడు మహారాజా తన ఒప్పందాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా గుర్గావ్ చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుబాట్లను[7] అణచివేయడానికి సహాయం చేయడానికి దళాలను పంపాడు.

జైపూర్ రాజ్యానికి 1901లో రూ.65,00,000 ఆదాయం ఉంది. ఇది రాజపుతానాలో అత్యంత సంపన్నమైన సంస్థానం.[13]

జైపూర్ చివరి రాచరిక పాలకుడు 1949 ఏప్రిల్ 7 న భారత యూనియనులోకి ప్రవేశించడానికి సంతకం చేశాడు.

2019 లో పద్మనాభ సింగ్ (జననం 1998 జూలై 12), జైపూరుకు నామమాత్రపు మహారాజయ్యాడు. రాజ కుటుంబ సంపద అంచనాలు మారుతూ ఉంటాయి కానీ, సింగ్ 697 మిలియన్ల డాలర్ల నుండి 2.8 బిలియన్ల డాలర్ల వరకూ సంపద ఉందని ఒక అంచనా.

పాలిత రాజవంశం

మార్చు

పాలకుల జాబితా [14][15]

మార్చు

పాలకులు

మార్చు
  • 27 డిసెంబరు 966 – 15 డిసెంబరు 1006 సొర్హా దేవా (d. 1006)
  • 15 డిసెంబరు 1006 – 28 నవంబరు 1036 దుల్లాహు రాయ్ (d. 1036)
  • 28 నవంబరు 1036 – 20 ఏప్రిల్ 1039 కాకిలు (d. 1039)
  • 21 ఏప్రిల్ 1039 – 28 అక్టోబరు 1053 హను (d. 1053)
  • 28 అక్టోబరు 1053 – 21 మార్చి 1070 జాండియా (d. 1070)
  • 22 మార్చి 1070 – 20 మే 1094 పజూను రాయ్ (d. 1094)
  • 20 మే 1094 – 15 ఫిబ్రవరి 1146 మలయాసి (d. 1146)
  • 15 ఫిబ్రవరి 1146 – 25 జూలై 1179 విజాల్డియో (d. 1179)
  • 25 జూలై 1179 – 16 డిసెంబరు 1216 రాజ్డియో (d. 1216)
  • 16 డిసెంబరు 1216 – 18 అక్టోబరు 1276 కిల్హను (d. 1276)
  • 18 అక్టోబరు 1276 – 23 జనవరి 1317 కుంతలు (d. 1317)
  • 23 జనవరి 1317 – 6 నవంబరు 1366 జొంసి (d. 1366)
  • 6 నవంబరు 1366 – 11 ఫిబ్రవరి 1388 ఉదయకిరణ్ (d. 1388)
  • 11 ఫిబ్రవరి 1388 – 16 ఆగస్టు 1428 నరసింగ్ (d. 1428)
  • 16 ఆగస్టు 1428 – 20 సెప్టెంబరు 1439 బంబిరు (d. 1439)
  • 20 సెప్టెంబరు 1439 – 10 డిసెంబరు 1467 ఉధరను (d. 1467)
  • 10 డిసెంబరు 1467 – 17 జనవరి 1503 చంద్రసేను (d. 1503)
  • 17 జనవరి 1503 – 4 నవంబరు 1527 మొదటి పృధ్విరాజ సింగ్ (d. 1527)
  • 4 నవంబరు 1527 – 19 జనవరి 1534 పురాణ్మలు (d. 1534)
  • 19 జనవరి 1534 – 22 జూలై 1537 భీం సింగ్ (d. 1537)
  • 22 జూలై 1537 – 15 మే 1548 రతను సింగ్ (d. 1548)
  • 15 మే 1548 – 1 జూన్ 1548 అస్కరను (d. 1599)

నామమాత్ర పాలకులు

మార్చు

ఆశించేవారు

మార్చు
  • 28 డిసెంబరు 1971 – 17 ఏప్రిల్ 2011: సవై భవాని సింగ్ (b. 1931 – d. 2011)
  • 17 ఏప్రెలు 2011 – ప్రస్తుతం: పద్మనాభ సింగ్ (b. 1998)

ఇతర కుటుంబ సభ్యులు

మార్చు

జైపూర్ రెసిడెన్సీ

మార్చు

1821 లో జైపూర్ రెసిడెన్సీని ఏర్పాటు చేసారు. ఇందులో జైపూర్, కిషన్‌గఢ్, లావా ఎస్టేట్ భాగంగా ఉండేవి. ఆ తరువాత లావా ఎస్టేట్, "హరోటి-టోంక్ ఏజెన్సీ" కి బదిలీ అయి 1867 వరకు అలాగే ఉంది.[16]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Princely States of India
  2. Prasad, Rajiva Nain (1966). Raja Man Singh of Amber. p. 1.
  3. Sarkar, Jadunath (1984). A History of Jaipur: C. 1503-1938. Orient Longman Limited. pp. 23–23. ISBN 81-250-0333-9.
  4. Sarkar (1994, p. 34)
  5. Wadley, Susan Snow (2004). Raja Nal and the Goddess: The North Indian Epic Dhola in Performance. Indiana University Press. pp. 110–111. ISBN 9780253217240.
  6. Sadasivan, Balaji (2011). The Dancing Girl: A History of Early India. Institute of Southeast Asian Studies. pp. 233–234. ISBN 9789814311670.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 Chisholm, Hugh, ed. (1911). "Jaipur" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 15 (11th ed.). Cambridge University Press. pp. 128–129.
  8. Sarker (1994, p. 209)
  9. Sarker (1994, p. 289)
  10. Sarker (1994, p. 315)
  11. Giles Tillotson, Jaipur Nama: Tales from the Pink City.
  12. Rajasthan Through the Ages By R.K. Gupta, S.R. Bakshi, pg.287
  13. https://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V13_401.gif
  14. Prasad (1966, pp. 1–3)
  15. Sarker (1994)
  16. Imperial Gazetteer of India, v. 16, p. 156.

వెలుపలి లంకెలు

మార్చు

26°55′34″N 75°49′25″E / 26.9260°N 75.8235°E / 26.9260; 75.8235