జైరాం రమేష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2004లో రాజ్య‌స‌భ‌కు ఎన్నికై, 2009 మే నుండి 26 మే 2014 వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా పని చేశాడు. జైరాం రమేష్ కర్ణాటక ప్ర‌ణాళిక బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స‌లహామండ‌లికి డిప్యూటీ ఛైర్మ‌న్‌గా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[2]

జైరాం రమేష్
జైరాం రమేష్


రాజ్యసభ సభ్యుడు [1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 జులై 2016
ముందు ఆయనూర్ మంజునాథ్, బీజేపీ
నియోజకవర్గం కర్ణాటక

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
13 జులై 2011 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు విలాసరావు దేశముఖ్
తరువాత గోపినాథ్ ముండే

అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
మే 2009 – 12 జులై 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మన్మోహన్ సింగ్
తరువాత జయంతి నటరాజన్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
జూన్ 2004 – 21 జూన్ 2016
నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-04-09) 1954 ఏప్రిల్ 9 (వయసు 69)
చిక్‌మగళూరు, మైసూర్ రాష్ట్రం, భారతదేశం
(ఇప్పుడు కర్ణాటక,భారతదేశం)
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం న్యూ ఢిల్లీ
పూర్వ విద్యార్థి ఐఐటీ బొంబాయి (బి.టెక్)
కార్న్ జి మెలోన్ యూనివర్సిటీ (ఎం.ఎస్)
మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ
వృత్తి ఎకనామిస్ట్

జననం, విద్యాభాస్యం మార్చు

జైరాం రమేష్ మైసూర్ రాష్ట్రం, చిక్‌మగళూరులో 1954 ఏప్రిల్ 9న సి. కే. రమేష్, శ్రీదేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఐఐటీ పూర్తి చేశాడు. ఆయన 1981 జనవరి 26న కే.ఆర్. జయశ్రీ వివాహమాడాడు. వారికీ ఇద్దరు కుమారులు ప్రద్యుమ్న, అన్నిరుద్ధ ఉన్నారు.[3]

రాజకీయ జీవితం మార్చు

జైరామ్ ర‌మేష్ 1990 వీ.పీ. సింగ్ ప్ర‌భుత్వంలో, పీవీ న‌ర‌సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్కు స‌ల‌హ‌దారుడిగా, 1996-98 లో దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న పి. చిదంబరం స‌ల‌హాదారుడిగా ప‌ని చేశాడు. ఆయన 2004లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికై అనంత‌రం మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర అటవీ & పర్యావరణ శాఖ మంత్రిగా, 2010లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికై, కేంద్ర గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు, పారిశుద్ధ్య మంత్రిగా పని చేశాడు. జైరాం రమేష్ 2015లో మూడోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు. ఆయ‌న క‌ర్ణాట‌క ప్ర‌ణాళిక బోర్డు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక స‌లహామండ‌లికి డిప్యూటీ ఛైర్మ‌న్‌గా ప‌ని చేశాడు. ఆయన 2018లో పురాత‌న సంప‌ద, పురాత‌త్వ స్థలాలు, అవ‌శేషాల(స‌వ‌ర‌ణ‌) బిల్లుపై ఏర్పాటైన రాజ్య‌స‌భ సెలెక్ట్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యాడు.[4]

మూలాలు మార్చు

  1. "Nirmala Sitharaman Wins Rajya Sabha Seat From Karnataka, Congress Gets 3". NDTV.com.
  2. Firstpost (13 June 2016). "I was an instrument of destiny: Jairam Ramesh on the Andhra Pradesh bifurcation" (in ఇంగ్లీష్). Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  3. India TV News (8 April 2014). "B'day Special: Jairam Ramesh " The IITian-turned-Congress minister" (in ఇంగ్లీష్). Retrieved 10 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Eenadu (30 May 2022). "కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా చిదంబరం, జైరామ్‌ రమేశ్‌". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.