జై రామ్ ఠాకూర్

(జై రామ్ థాకూర్ నుండి దారిమార్పు చెందింది)

జై రామ్ థాకూర్ (జననం: 1965 జనవరి 6) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.[1]

జై రామ్ ఠాకూర్
జై రామ్ ఠాకూర్


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 డిసెంబర్ 2017 – 8 డిసెంబర్ 2022
గవర్నరు బండారు దత్తాత్రేయ
ముందు వీరభద్ర సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1965-01-06) 1965 జనవరి 6 (వయసు 59)
మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సాధన థాకూర్
సంతానం చంద్రిక, ప్రియాంక
నివాసం తండి గ్రామం, మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం

తొలినాళ్ళ జీవితం

మార్చు

థాకూర్ మంది తుంగా ప్రదేశంలోని తండి గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. ఇతని తండ్రి జేతు రామ్ సుతారి పని చేసే వాడు, తల్లి బ్రికు దేవి. జై రామ్ థాకూర్ కురణిలోని ప్రాథమిక పాఠశాలలో తన విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆ తరువాత 1987లో వల్లభ్ ప్రభుత్వ పాఠశాల నుండి బి.ఏ పూర్తి చేసాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ చదువు పూర్తి చేసాడు.

వివాహం

మార్చు

థాకూర్ ఎబివిపిలో తన సహచారిగా ఉన్న సాధన థాకూర్ని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు.[2]

రాజకీయ నాయకునిగా

మార్చు

థాకూర్ తన గ్రాడ్యుయేషన్లో ఉండగా ఎబివిపి కార్య కలాపాలలో పాల్గొనేవాడు. జైరాం ఠాకూర్ తొలిసారిగా చచ్యోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1998లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, అప్పటి నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జైరాం ఠాకూర్ మండి జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుండి 2022లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ ​అభ్యర్థి చేత్​రామ్​పై 21వేల మెజార్టీతో గెలిచాడు.[3] [4]

మూలాలు

మార్చు
  1. Yogendra, Kanwar (2017-12-24). "Jairam Thakur to take oath as Himachal Pradesh Chief Minister on December 27". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-06-23.
  2. "Jairam Thakur sworn-in as 14th CM of Himachal Pradesh | DD News". ddnews.gov.in. Retrieved 2021-06-23.
  3. V6 Velugu (9 December 2022). "హిమాచల్ ప్రదేశ్ లో 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (8 December 2022). "ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ 22 వేల ఓట్లతో..." Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.