జోహార్ (2020 సినిమా)

తేజ మార్ని తొలిసారిగా దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం

జోహార్ 2020, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై రామ్ వంశీ కృష్ణ నిర్మాణ సారథ్యంలో తేజ మార్ని తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్తేర్ అనిల్, అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఈశ్వరి రావు, చైతన్య కృష్ణ, శుభలేఖ సుధాకర్ నటించగా ప్రియదర్శి బాలసుబ్రమణ్యన్ సంగీతం అందించాడు. ఈ చిత్ర స్క్రిప్ట్ కు, ప్రధాన నటుల నటనకు చాలా మంచి స్పందన వచ్చింది.[1][2][3][4][5][6] ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.

జోహార్
జోహార్ సినిమా పోస్టర్
దర్శకత్వంతేజ మార్ని
నిర్మాతరామ్ వంశీ కృష్ణ
తారాగణంఎస్తేర్ అనిల్
అంకిత్ కొయ్య
నైనా గంగూలీ
ఈశ్వరి రావు
చైతన్య కృష్ణ
శుభలేఖ సుధాకర్
ఛాయాగ్రహణంజగదీష్ చీకటి
కూర్పుఅన్వర్ ఆలీ
సిద్ధార్థ్ తాతోలు
సంగీతంప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్
నిర్మాణ
సంస్థ
ధర్మ సూర్య పిక్చర్స్
పంపిణీదార్లుఆహా (ఓటిటి)
విడుదల తేదీ
15 ఆగస్టు 2020 (2020-08-15)
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

ఉద్ధానం కాలేయ సమస్య వల్ల భర్తను పోగొట్టుకున్న మంగ (ఈశ్వరిరావు) తన కూతురికి కూడా అదే జబ్బు చేయడంతో వైద్యం చేయించడానికి డబ్బులు సంపాదించడం కోసం పొలం కౌలుకు తీసుకుంటుంది. వారణాసిలో ఒక టీ కొట్టులో పనిచేసే కుర్రాడు (అంకిత్‍), వేశ్యావాటికలో జీవిస్తున్న అమ్మాయిని (ఎస్తేర్‍) ప్రేమిస్తాడు. ఆమె తల్లి తనను కూడా అదే వృత్తిలో దించేందుకు చూస్తోంటే... ఆమె ఇంట్లోంచి పారిపోయి ఈ కుర్రాడితో మరో ఊరు చేరుకుంటుంది. స్కాలర్‍షిప్‍ సాధించి పై చదువుల కోసం ఆశ పడుతుంది. స్వాతంత్ర్య సమరయోధుడు (శుభలేఖ సుధాకర్‍) విలువలకు లోబడి ఆశ్రమం నడుపుతూ... అది శిథిలావస్థలో వుండడంతో నిధుల కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాడు. రోడ్డు మీద సర్కస్‍ ఫీట్లు చేసి జీవనం సాగించే యువతి (నైనా గంగూలి) అథ్లెట్‍ కావాలనుకుంటుంది. ఆమెకి అకాడమీలో స్థానం దక్కుతుంది కానీ అవసరమయిన పోషకాహరం లభించక ఆశయం సాధించలేకపోతుంది. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన కొడుకు (చైతన్య కృష్ణ) తన తండ్రిని జనం ఎప్పటికీ దేవుడిగా గుర్తుంచుకోవాలని ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావిస్తాడు. అయితే అందుకోసం నిధులు లేక రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్‍ నుంచి తలా కొంత తీసి విగ్రహ ప్రతిష్ఠాపన చేయిస్తాడు. అతని కోరిక వల్ల పైన చెప్పుకున్న వారి జీవితాలు ఎలా ఛిద్రమవుతాయి, ఆ విగ్రహం నిలబెట్టడం కోసం అలాంటి ఎందరి బ్రతుకులు నేలరాలాయి అన్నది జోహార్ సినిమా నేపథ్యం.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: తేజ మార్ని
 • నిర్మాణం: రామ్ వంశీ కృష్ణ
 • సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్
 • సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
 • కూర్పు: అన్వర్ అలీ, సిద్ధార్థ్ థాథోలు
 • నిర్మాణ సంస్థ: ధర్మ సూర్య పిక్చర్స్
 • పంపిణీదారు: ఆహా (ఓటిటి)

నిర్మాణం మార్చు

బాలనటి ఎస్తేర్ అనిల్ ఈ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి తెరంగేట్రం చేసింది.[7]

విడుదల మార్చు

"రాజకీయ, సామాజిక అంశాలతో ఈ చిత్రం రూపొందించడం ప్రశంసనీయమైన ప్రయత్నం" అని హిందూ పత్రికలో రాశారు.[8] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది, "తేజ మార్ని రూపొందించిన జోహార్ సినిమా దేశంలోని రాజకీయ పరిస్థితులపై ధైర్యమైన అస్త్రం" అని రాశారు.[9]

మూలాలు మార్చు

 1. "Director Krish all praise for Teja Marni's debut film Johaar actor Ankith Koyya - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 2. "Actor Varun Tej releases the teaser of Johaar - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 3. "'Life of Johaar', a glimpse into Teja Marni's debut film released - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 4. "Teja Marni's 'Johaar' sound-mixing in full swing in London - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 5. "First-look of Teja Marni's 'Johaar' released - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 6. "Rashmika Mandanna shares video song of Neeve Saagipo Ala from Johaar - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 7. "Then and Now: Esther Anil, the child artist from Drushyam, has become more beautiful and stunning diva! - Times of India". The Times of India. Retrieved 29 October 2020.
 8. Dundoo, Sangeetha Devi (August 14, 2020). "'Johaar' review: A commendable attempt by debut director Teja Marni". Retrieved 29 October 2020 – via www.thehindu.com.
 9. "Johaar Movie Review: Using multiple narratives, debut director makes a political statement". Retrieved 29 October 2020 – via timesofindia.indiatimes.com.

ఇతర లంకెలు మార్చు