జ్ఞాని జైల్ సింగ్

(జ్ఞాని జైల్‌సింగ్ నుండి దారిమార్పు చెందింది)

జ్ఞాని జైల్ సింగ్ (audio speaker iconఉచ్చారణ  పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ జిల్లాలో "సంధవాన్" అనే గ్రామంలో 1916 మే 5 న జన్మించాడు. జైల్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్ మంచి దేశభక్తుడు. జైల్ సింగ్ సిక్కుమతానికి సంబంధించి చేసిన కృషి వలన "జ్ఞాని" అని గౌరవించబడ్డాడు. 1956 లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. 1962లో ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై పంజాబ్ ప్రభుత్వంలో పని చేసాడు. 1962 మార్చిలో పంజాబ్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాడు. 1980 జనవరి లో జరిగిన ఎన్నికలలో హోషియాపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు గెలిచి హోమ్ శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 15.07.1982 న రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అదేనెల 25 వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

జ్ఞాని జైల్ సింగ్
జ్ఞాని జైల్ సింగ్ ( కుడి వైపు)
జననంజ్ఞాని జైల్ సింగ్
5 మే, 1916
మరణం25 డిసెంబరు, 1994

ఇవి కూడా చూడండి

మార్చు