జ్ఞానేంద్ర పాండే

ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ భారత క్రికెట్ ఆటగాడు

జ్ఞానేంద్ర కేదార్‌నాథ్ పాండే, ఉత్తర ప్రదేశ్కు చెందిన మాజీ భారత క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్.[1]

జ్ఞానేంద్ర పాండే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జ్ఞానేంద్ర కేదార్‌నాథ్ పాండే
పుట్టిన తేదీ (1972-08-12) 1972 ఆగస్టు 12 (వయసు 52)
లక్నో, ఉత్తర ప్రదేశ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్
పాత్రబ్యాటింగ్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1998–2006ఉత్తరప్రదేశ్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 2 117 82
చేసిన పరుగులు 4* 5,348 1,781
బ్యాటింగు సగటు 4 36.38 37.10
100s/50s 0/0 9/30 3/20
అత్యధిక స్కోరు 39 178 89*
వేసిన బంతులు 15,199 4,064
వికెట్లు 165 89
బౌలింగు సగటు 35.89 33.78
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 7/167
క్యాచ్‌లు/స్టంపింగులు 6/–
మూలం: ESPNcricinfo, 2007 ఏప్రిల్ 20

జ్ఞానేంద్ర కేదార్‌నాథ్ పాండే 1972, ఆగస్టు 12న ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

పాండే 1998–99లో పెప్సీ కప్‌లో అరంగేట్రం చేశాడు. ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీ జట్టుకు నిలకడగా ఆడి, 1996-97లో తనదైన ముద్ర వేశాడు. అక్కడ రెండు వరుస సీజన్లలో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో గుర్తింపు పొందాడు.[3]

పాండే 2006లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైరయ్యాడు.[4] 2016లో క్రికెట్‌లో అతను చేసిన కృషికి గాను షహీద్ శోధ సంస్థాన్‌చే మతి రతన్ సమ్మాన్‌ను అందుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. ESPNCricinfo.com. "Gyanendra Pandey". Retrieved on 2023-08-03.
  2. "Gyanendra Pandey Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz. Retrieved 2023-08-04.
  3. "Gyanendra Pandey Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo. Retrieved 2023-08-04.
  4. Hindustan Times. "Gyanendra Pandey quits from cricket". 29 November 2006. Retrieved on 2023-08-03.

బయటి లింకులు

మార్చు