జ్యోతి అరోరా

భారతీయ రచయిత్రి, టెక్ బ్లాగర్

జ్యోతి అరోరా భారతీయ రచయిత్రి, టెక్ బ్లాగర్.[1] డ్రీమ్స్ సేక్ (2011), లెమన్ గర్ల్ (2014), యు కేమ్ లైక్ హోప్ (2017)తో సహా అనేక పుస్తకాలు రాసింది. ఘజియాబాద్‌లో నివసిస్తోంది.[2]

జ్యోతి అరోరా
పుట్టిన తేదీ, స్థలం1977
వృత్తినవలా రచయిత; బ్లాగర్
రచనా రంగంఫిక్షన్; మోటివేషినల్
గుర్తింపునిచ్చిన రచనలుయు కేమ్ లైక్ హోప్ (2017); లెమన్ గర్ల్ (2014)

జీవిత చరిత్ర

మార్చు

అరోరాకు మూడు నెలల వయస్సులో తలసేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యం కారణంగా ఏడవ తరగతిలో పాఠశాల చదువును విడిచిపెట్టింది.[3][4] కరస్పాండెన్స్ పాఠశాల విద్య ద్వారా తన విద్యను కొనసాగించింది.[4] ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ (ఆనర్స్) లో బిఏ పూర్తి చేసింది. అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం, అప్లైడ్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసింది.[2][4][5] ఇంగ్లీష్ ట్యూటర్, ఫ్రీలాన్స్ రైటర్‌గా, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఒక ఐటీ రిక్రూట్‌మెంట్ సంస్థలో పనిచేసింది.[2][4]

రచనలు

మార్చు
  • డ్రీమ్స్ సేక్ (2011), వి&ఎస్ పబ్లిషర్స్[4][6][7]
  • లెమన్ గర్ల్ (2014), స్వీయ-ప్రచురణ[1][4][5]
  • యు కేమ్ లైక్ హోప్ (2017), స్వీయ-ప్రచురణ[1][5]
  • #జస్ట్ రొమాన్స్: 7 చిన్న రొమాన్స్‌ల కథల సంకలనం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Rajpal, Seema (December 12, 2017). "How author Jyoti Arora hasn't let thalassemia or Twitter trolls get in her way". The New Indian Express. Retrieved 15 April 2021.
  2. 2.0 2.1 2.2 Narkhede, Nikhil. "Jyoti Arora Interview – Lemon Girl Book". WriterStory. Retrieved 15 April 2021.
  3. Arora, Jyoti (May 8, 2019). "World Thalassemia Day: Here's Why It's Important To Donate Blood". The Quint. Retrieved 15 April 2021.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Dua, Neha (September 2, 2015). "Thalassemia Could Not Stop Her from Achieving Her Dream of Becoming a Novelist. Meet This Dynamo". The Better India. Retrieved 15 April 2021.
  5. 5.0 5.1 5.2 Gupta, Soumyabrata (January 31, 2018). "Women do file fake cases against men and their families, says author Jyoti Arora". Deccan Chronicle. Retrieved 15 April 2021.
  6. Chakraborty, Bastab (August 25, 2011). "Book Review: 'Dream's Sake' by Jyoti Arora". Between The Lines. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.
  7. "Interview: Jyoti Arora, author of 'Dream's Sake'". Between the Lines. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 31 December 2017.